తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మా గాంధీజీ చిత్రపటానికి వైయస్ జగన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంంలో శాసనమండలి ప్రతిపక్ష నేత లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ వై వి సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, విడదల రజని, కారుమూరి నాగేశ్వరరావు, మెరుగు నాగార్జున, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.