నేడు తిరుమలకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

అమరావతి  : సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. సీఎం వైయ‌స్ జగన్‌ నేడు సాయంత్రం 6.15 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. తిరుపతి తాజ్‌ హోటల్‌లో జరగనున్న సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న అమిత్‌షాకు స్వాగతం పలికి అక్కడి నుంచి తిరుమల వెళతారు. రాత్రి 9.30 గంటల అనంతరం వారిద్దరూ శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం సీఎం వైయ‌స్ జగన్‌ రేణిగుంట చేరుకుని తిరిగి తాడేపల్లి బయలుదేరుతారు.

ఆదివారం సీఎం షెడ్యూల్‌ ఇలా..
ఆదివారం మధ్యాహ్నం 1.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి తిరుపతి బయలుదేరుతారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి తిరుపతి తాజ్‌ హోటల్‌లో అమిత్‌ షా అధ్యక్షతన జరిగే సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొంటారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top