నేడు గవర్నర్‌ను కలవనున్న వైయ‌స్‌ జగన్‌

రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ప్రదర్శనలు

 హైదరాబాద్‌: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం శనివారం సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కలవనుంది. మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైయ‌స్‌ వివేకానందరెడ్డి హత్యతో సహా టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రాజకీయ హత్యలను, రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్‌ దృష్టికి ప్రతినిధి బృందం ఈ సందర్భంగా తీసుకెళ్లనుంది.

ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ప్రదర్శనలు నిర్వహించాలని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపు నిచ్చింది. నల్లచొక్కాలు, నల్ల రిబ్బన్లు ధరించి, నల్లజెండాలతో గాంధీ విగ్రహాల వద్ద శాంతియుత ప్రదర్శనలు చేపట్టాలని, ఇందులో పార్టీ నేతలు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొనాలని విజ్ఞప్తి చేసింది. 
 

Back to Top