సి.నా.రె. పుస్తకం ఆవిష్కరించడం నా అదృష్టం

పుస్తకావిష్కరణ సభలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
 

అమరావతి: డాక్టర్‌ సి. నారాయనరెడ్డి పార్లమెంట్‌ ప్రసంగాల పుస్తకాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో డాక్టర్‌ సి.నారాయణరెడ్డి పార్లమెంట్‌ ప్రసంగాలపై రూపొందించిన ‘పెద్దల సభలో తెలుగు పెద్ద’ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రసంగించారు. నా కన్న ముందు ఇంతమంది గొప్ప వ్యక్తులు ప్రసంగించిన తరువాత నా ప్రసంగం అంత గొప్పగా ఆకట్టుకోకపోవచ్చు. అయినా ప్రయత్నం చేస్తాను. అందరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సి.నారాయణరెడ్డి గురించి రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన కవితలు, వ్యాసాలు ఎంతోత మందిని ప్రభావితం చేశాయి. సి.నా.రె.గొప్పవ్యక్తి. అలాంటి వ్యక్తి పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం ఇచ్చినందుకు, ఇక్కడికి వచ్చినందుకు అందరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top