చంద్రబాబు పాలనంతా మోసమే

గూడురు సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

3648కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల బాధలు విన్నా..కష్టాలు చూశా

ప్రభుత్వ సాయం అందక అవస్థలు పడుతున్న పేదల బాధలు చూశా

నిమ్మకాయ రైతుల బాధలు విన్నా

ప్రభుత్వం పట్టించుకోలేదని చెబుతున్న రైతుల ఆదేవన విన్నా

దుగ్గరాజపట్నం పోర్టు కడతామని హామీ ఇచ్చారు

హోదా తాకట్టు పెట్టేందుకు చంద్రబాబు ఎవరని ప్రజలు అడుగుతున్నారు

2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయలేదు

20 రోజులు ఓపిక పడితే అన్న ముఖ్యమంత్రి అవుతారని ప్రతి ఒక్కరికి చెప్పండి

 

నెల్లూరు: చంద్రబాబు ఐదేళ్ల పాలనంతా కూడా మోసమే అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు. ఈ కుట్రలు, మోసాలు ఎన్నికలు వచ్చేసరికి ఎక్కువ అవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలను చూశానని, బాధలు విన్నానని, అందుకే మీ అందరికీ నేనున్నానని భరోసా కల్పిస్తున్నానని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నెల్లూరు జిల్లా గూడురు పట్టణంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో వైయస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే.

 • ఇదే గూడురు నియోజకవర్గం గుండా నా పాదయాత్ర సాగింది. 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేయగలిగానంటే అది ఆ దేవుడి దయ..మీ అందరి చల్లని దీవెనలే. నా పాదయాత్రలో మీ కష్టాలు చూశాను. మీ బాధలు విన్నాను. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఏమనుకుంటుందో చూశాను. ప్రభుత్వం సహాయం చేస్తుందని ఎదురు చూశారు. ప్రభుత్వం నుంచి సాయం అందక మీరు పడ్డ కష్టాన్ని చూశాను. మీ అందరికి నేను ఉన్నానని భరోసా ఇస్తున్నాను.
 • గిట్టుబాటు ధరలు అందక రైతులు పడుతున్న కష్టాలు చూశాను. చేస్తానన్న రుణమాఫీ చేయకపోగా సున్నా వడ్డీ రుణాలు ఎగురగొట్టారు. రాష్ట్రంలోని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు పడ్డ బాధలు, ఆవేదనలు ప్రతి రోజు దారి పొడవునా విన్నాను.
 •  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక తల్లిదండ్రులు పడుతున్న బాధలు చూశాను. ఆ పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ తల్లిదండ్రుల ఆవేదన విన్నాను. ఇదే జిల్లాలోని ఆత్మకూరు ప్రాంతంలో జరిగిన సంఘటన నేను మరిచిపోలేదు. ఆ తండ్రి తన బిడ్డను చదవించకలేక చివరకు కొడుకునే కొల్పోయాడు.
 • 108 అంబులెన్స్‌ సకాలంలో రాక ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల గాధలు విన్నాను. ఆరోగ్యశ్రీ అమలు కాక..వైద్యం కోసం ఎదురు చూస్తూ వ్యాధిని నయం చేసుకునేందుకు లక్షల కొద్ది అప్పులు చేసిన కష్టాలు విన్నాను.  మీ బాధలన్నీ కూడా విన్నాను.
 •  మద్యంషాపులు ఎక్కువై..మద్యానికే బానిస అయిన కుటుంబాలను చూశాను. మా వీధి చివరనే బెల్టు షాపు పెట్టారు. బయటకు వెళ్లాలంటే భయంగా ఉందని చెప్పిన మాటలు విన్నాను. నేను విన్నాను..నేను చూశాను.
 •  ఇదే జిల్లాలో పాదయాత్ర సాగుతుంటే చదువుకుంటున్న పిల్లలు నా వద్దకు వచ్చి..అన్నా దుగ్గరాజపట్నం పోర్టు కడతామని హామీ ఇచ్చారు. చంద్రబాబు దగ్గరుండి కట్టించాల్సింది పోయి ఆయనే అవసరం లేదని చెప్పారని, ప్రత్యేక హోదాతో పరిశ్రమలు వస్తాయి. ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూస్తుంటే..,చంద్రబాబు ఎవరన్నా హోదాను తాకట్టు పెట్టడానికి అన్న మాటలు నాకు గుర్తున్నాయి.
 •  రాష్ట్ర విభజన సమయంలో 1.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమలనాథన్‌ కమిటీ సీపార్సు చేసింది. రాష్ట్రంలో ఈ నాటికి అక్షరాల 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఒక్కటి కూడా భర్తీ చేయలేదు. 
 •  ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి గూడురులో ఉన్న తాగునీటి సమస్యపై ఏనాడు పట్టించుకోలేదు. ఆ రోజు నాన్నగారు కండెలేరు నుంచి పైప్‌లైన్‌ తెచ్చారు. అటువంటి పథకం కూడావీళ్లు సరిగ్గా నడపలేని అన్యాయమైన పరిస్థితిలో ఉన్నారని చెప్పారు.
 •  ఇదే నియోజకవర్గంలోని నిమ్మకాయల రైతులు 800 కాయల బస్తాను కనీసం రూ.500లకు కూడా కొనడం లేదని నా కళ్ల ముందే రోడ్డుపై పారబోశారు. మీ కష్టాన్ని చూశాను. మీకు భరోసా ఇస్తు..నేనున్నానని మీకు హామీ ఇస్తున్నాను.
 • చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ప్రతి అడుగులోనూ మోసం మోసంమోసం చూశాం. ప్రతి రోజు  ఒక అబద్ధం, కుట్రలు చేస్తున్నారు. మరో 12 రోజుల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ కుట్రలు తారాస్థాయికి చేరుతాయి. ఇవాళ మనం యుద్ధం చేస్తున్నది చంద్రబాబు ఒక్కరితోనే కాదు..ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, అమ్ముడుపోయిన అనేక టీవీ చానళ్లతో యుద్ధం చేస్తున్నాం. ఇవే కుట్రలు ఇంకా ఎక్కువ చేస్తారు. రాబోయే రోజుల్లో ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపిస్తారు. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోమని కోరుతున్నాను.
 •  ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు చేయబోయే పెద్ద కుట్ర ఏంటో తెలుసా? ప్రతి గ్రామానికి మూటలు మూటల డబ్బు పంపిస్తారు. ప్రతి ఒక్క చేతిలో రూ.3 వేలు డబ్బులు పెడతారు. మీరంతా కూడా మీ వార్డుల్లో, గ్రామాల్లో ప్రతి అక్క, చెల్లెమ్మ, అవ్వ, తాతను కలవండి. ప్రతి అన్నను కలవండి. వారికి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు.. 20 రోజులు ఆగితే అన్న ముఖ్యమంత్రి అవుతారు. ఆ తరువాత మన బతుకులు మారుతాయని చెప్పండి.
 •  ఫీజు రియంబర్స్‌మెంట్‌ రాక ఇంజనీరింగ్‌ చదవాలంటే ఫీజులు లక్షలు దాటుతున్న పరిస్థితులు ఉన్నాయి. గవర్నమెంట్‌ అరకొర మాత్రమే ఇస్తుంది. తల్లితండ్రులు ఆ పిల్లలను చదవుల కోసం ఆస్తులను అమ్ముకుంటున్న పరిస్థితని నా కళ్లారా చూశా.ప్రతి తల్లికి నేను చెబుతున్నా..నేను ఉన్నాను.108నెంబుర్‌కు ఫోన్‌ కొడితే కుయ్‌..కుయ్‌ అంటు 20నిమిషాల్లో అబుంలెన్స్‌ రాక ప్రాణాలు పొగొట్టుకున్న కుటుంబాలను చూశా. మందులకు డబ్బులు లేక అవస్థలు పడుతున్న కుటుంబాలను చూశా.అంతటి బాధలు పడుకుతన్న కూడా మనసు లేని ప్రభుత్వాన్ని చూశా. మీ కష్టాన్ని నేను చూశా. అంబులెన్స్‌ రాక ప్రాణాలు పోగొట్టుకున్న ప్రతి కుటుంబానికి చెబుతున్నానేను ఉన్నాను. మద్యం షాపులు ఎక్కువైపోయి మద్యానికే బాసిసలు అయి కుటుంబాలు నాశనం అవుతున్న పరిస్థితులు చూశా. ప్రతి గ్రామాల్లో మూడు నాలుగు బెల్టు షాపులు కనిపిస్తాయి. చంద్రబాబు పాలనలో గ్రామాల్లో ఉన్న ప్రతి దుకాణంలో మం‍దు దొరుకుతుంది. రాత్రి 7 దాటితే ఆడపిలల్లను బయటకు పంపించాలంటే తల్లిదండ్రులను భయపడుతున్న పరిస్థితిని కనిపిస్తుంది. తాగుడుతో కుటుంబాలు నాశనం అవుతున్న పరిస్థితిని చూశా. ప్రతి అక్కాచెల్లికి చెబుతున్నా నేను ఉన్నాను. 

  డబ్బులకు మోసపోవద్దు
  ఎన్నికలు దగ్గరుకు వస్తే చంద్రబాబు రోజకో సినిమా చూపిస్తాడు. అధికారం కోసం దేనికైనా తెగిస్తాడు చంద్రబాబు. ప్రతి ఊరికి మూటలు, మూటలు డబ్బులు తీసుకోస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల రూపాయల నగదును పెడతారు. మీరందరు గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి చెప్పాలి. చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండని గ్రామాల్లోని అక్కాచెల్లమ్మలకు, అవ్వ తాతలకు చెప్పండి.

  ఇరవై రోజులు ఓపిక పట్టమని చెప్పండి. జగనన్న చెప్పకపోయి ఉంటే పించన్‌ రెండు వేలకు పెరిగేదా అని గుర్తుచేయండి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి. ఏ చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్‌​ చేయూత కింద 75 వేల రూపాయలు నాలు దఫాలుగా చెల్లిస్తాం. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. నవరత్నాల గురించి ప్రతి అవ్వకు, తాతకు చెప్పిండి.  ఎమ్మెల్యే అభ్యర్థి వరప్రసాద్, ఎంపీ అభ్యర్థి ప్రసాద్ లపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు కావాలి. వైయస్ఆర్  కాంగ్రెస్‌ పార్టీని ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు వేయండి. వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి’ అని వైయస్ జగన్‌ విజ్ఞప్తి చేశారు

Back to Top