బాబు పాలనలో ఎవరికీ భద్రత లేదు

బద్వేలు సభలో వైయస్‌ జగన్‌

ఎన్నిలప్పుడే చంద్రబాబుకు ప్రజలు గుర్తొస్తారు

హోదాను, కడప స్టీల్‌ ఫ్యాక్టరీని చంద్రబాబు తాకట్టు పెట్టారు

రైతులకు రుణమాఫీ చేస్తామని మోసం చేశారు

108కు ఫోన్‌ కొడితే అంబులెన్స్‌ వస్తుందన్న నమ్మకం లేదు

చంద్రబాబు దొంగపనులు చేస్తూ చట్టం నుంచి తప్పించుకుంటున్నారు.

రెండేళ్లలోనే బద్వేలు సమస్యలకు పరిష్కారం చూపుతా

వైయస్‌ఆర్‌ జిల్లా: ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఎవరికీ భద్రత లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు. ఇవాళ మీ భవిష్యత్తు–నా  బాధ్యత అని చెబుతున్నారని, రాష్ట్ర ప్రజల డేటాను దొంగిలించి ప్రైవేట్‌ కంపెనీలకు ఇచ్చారని మండిపడ్డారు. మీ కష్టాలు, బాధలు విన్నానని, అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే మీ సమస్యలకు పరిష్కారం చూపుతానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయస్‌ఆర్‌ జిల్లా బద్వేలు పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగించారు. వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..
– నాకు బాగా గుర్తుంది. పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు బద్వేలు నియోజకవర్గం తగలడం లేదని, ఇక్కడి నుంచి చాలా మంది మార్గమధ్యంలో నన్ను కలిశారు. ఓ టెంట్‌ వేసి అక్కడ కలిసి నాతో మీ కష్టాలు చెప్పారు. మీ బాధలు విన్నాను. మాకున్న సమస్యలు నాలుగేళ్లుగా చంద్రబాబు పట్టించుకోలేదని ఆ రోజు చెప్పిన ప్రతి అంశం నాకు గుర్తుంది. ఐదేళ్ల చంద్రబాబు పాలన ఇవాళ చూస్తున్నాం. పక్కనే బ్రహ్మసాగరం కనిపిస్తుంది.  ఇక్కడ 15 టీఎంసీల నీటి సామర్థ్యం ఉంది. ఏ ఒక్క సంవత్సరం కూడా రెండు, మూడు టీఎంసీల నీరు రాలేదు. నాన్నగారి హయాంలో బ్రహ్మంసాగర్‌ ప్రాజెక్టులో 14 టీఎంసీల నీరు స్టోర్‌ చేశారని చెప్పారు. నాన్నగారి హయాంలో నీళ్లు సక్రమంగా అందేవి, అందరూ సంతోషంగా ఉండేవారమని మీరు చెప్పిన మాటలు గుర్తున్నాయి.
– ఇదే బద్వేలుకు సంబంధించి బ్రహ్మసాగరంలో నీళ్లు లేవు కాబట్టి తాగడానికి నీరు లేక అన్యాయమైన పరిస్థితి ఉంది. ఈ నియోజకవర్గానికి ఉన్న నీటి కొరత, మీ అవస్థలు కూడా నాకు తెలుసు. మీ అందరికి ఇవాళ మాట ఇస్తున్నాను. నేను ఉన్నాను. 
– కుందునదిపై లిప్టు పెట్టి బ్రహ్మసాగర్‌కు నీళ్లు ఇవ్వాలని, వివిధ గ్రామాలకు తాగునీరు ఇవ్వాలని గతంలో మీరు అడిగిన అంశాలు అన్నీ కూడా గుర్తున్నాయి. వెలుగొండ ప్రాజెక్టు పూరై్తతే సాగునీరు, తాగునీరు అందుతుంది. ఆ ప్రాజెక్టు నత్తనడకనా సాగుతున్నాయి. ఈ అన్నీ సమస్యలపై దేవుడిదయతో మనం అధికారంలోకి వచ్చాక రెండేళ్లలోనే పరిష్కారం చూపుతానని మీ అందరికి మాట  ఇస్తున్నాను. 
–చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు రారు. అభివృద్ధి గుర్తుకు రాదు. ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకు వస్తారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ప్రజలు గుర్తుకు రాలేదు. చివరి మూనేళ్లు మాత్రం ప్రజలపై ముసలి ప్రేమ చూపిస్తారు. బద్వేలుకు అభివృద్ధి చేయడం లేదని, పట్టణం అధ్వాన్నంగా ఉందని, చివరకు కౌన్సిలర్లు ధర్నా చేశారంటే ఏ రకమైన అభివృద్ధి జరుగుతుందో చెప్పాల్సిన అవవసరం లేదు. తన పార్టీ వారే ఆయన పాలనను వ్యతిరేకిస్తున్నారు.
– చంద్రబాబు ఇవాళ ప్రకటనలు ఇస్తూ..మీ భవిష్యత్తు..నా బాధ్యత అంటున్నారు చంద్రబాబు. ఆ టీవీ ప్రకటనలు చూస్తే నాకు ఆశ్చర్యమనిపించింది. ఈ ఐదేళ్లలో చంద్రబాబు ఎవరికి భద్రత ఇచ్చారు. 
– చంద్రబాబు పరిపాలన ఒక్కసారి చూడండి. ప్రజలు భద్రంగా దాచుకున్న బ్యాంకు అకౌంట్లు, ఆధార్‌ డిటైల్స్, ఆడవాళ్ల టెలీఫోన్‌ నంబర్లు ఎవరైనా భద్రంగా దాచుకుంటారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజల ఆధార్, బ్యాంకు అకౌంట్‌ నంబర్లు, టెలీఫోన్‌ నంబర్లు దొంగలించి..తన సేవా మిత్ర యాప్‌లో పెట్టారు. జన్మభూమి కమిటీలకు ఇచ్చారు.
– ఈ రాష్ట్రంలో ఇంతదారుణంగా జన్మభూమి కమిటీల వద్ద మన ఆడవాళ్ల టెలీఫోన్‌ నంబర్లు ఉన్నాయంటే మనకు భద్రత ఉందా అని అడుగుతున్నాను. ఐదేళ్లుగా చంద్రబాబు పరిపాలన చూస్తున్నారు. ఇన్నాళ్లు ఎవరికి భరోసా ఇచ్చారు. ఎవరికి భద్రత ఇచ్చారని అడుగుతున్నాను.
– ఇసుక నుంచి భూముల దాకా, రాజధాని వరకు చంద్రబాబు చేయని దోపిడీ ఏది లేదు. రాష్ట్ర ప్రజలకు భద్రత ఇచ్చారా? ఆయన కుమారుడు లోకేష్‌కు ఇచ్చారా? అని అడుగుతున్నాను.
– రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతుంటే..ఒక మహిళా ఎంఆర్‌వో వచ్చి అడ్డుకుంటే..టీడీపీ ఎమ్మెల్యే ఆ మహిళా అధికారిణి జట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లారు. ఆ మహిళా అధికారిణికి భద్రతా ఇచ్చారా? ఆయన పార్టీకి భద్రతా ఇచ్చారా?
– విజయవాడలో కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ నడిపితే చంద్రబాబు ఎవరికి భద్రత ఇచ్చారని అడుగుతున్నాను. ఆడవాళ్లకు భద్రత ఇచ్చారా అని అడుగుతున్నాను.
– చంద్రబాబు పరిపాలన చూస్తే ఎవరికి భద్రత ఇవ్వలేదు. నాలుగేళ్లు బీజేపీతో కలిసి కాపురం చేశారు. కేంద్రంతో టీడీపీ ఎంపీలు మంత్రులుగా ఉన్నప్పుడు కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీ కట్టాలన్న ఆలోచన చంద్రబాబుకు రాలేదు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. ఎవరికి భద్రత ఇచ్చారని చంద్రబాబును అడుగుతున్నాను.
– రైతులకు రుణమాఫీ చేయకుండా, గిట్టుబాటు ధర ఇవ్వలేదు. కరువు వచ్చినా కూడా పట్టించుకున్న దాఖలాలు ఒక్క సంవత్సరమైనా మనం చూశామా? ఏ రైతుకు భరోసా ఇచ్చారని అడుగుతున్నాను.
 – పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఎగురగొట్టారు, సున్నా వడ్డీ రుణాలు కూడా ఎగురగొట్టారు. వడ్డీలు రెట్టింపు అయ్యాయి. ఇంతటి దారుణంగా పరిపాలన చేసిన ఈ పెద్ద మనిషి..ఏ మహిళకు భరోసా ఇచ్చారు.
– ప్రతి ఇంటికి ఉద్యోగం అన్నారు. లేదంటే నిరుద్యోగ భృతి అన్నారు. ఏ ఇంటికి ఉద్యోగం ఇచ్చారు. ప్రతి ఇంటికి రూ.1.20 లక్షలు బాకీ పడ్డారు. ఏ నిరుద్యోగికి నీవు భరోసా ఇచ్చావని చంద్రబాబును అడుగుతున్నాను. రాష్ట్రం విడిపోయేటప్పుడు అక్షరాల 1.40 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని కమల్‌నాథన్‌ కమిటీ రిపోర్టు ఇచ్చింది. ప్రస్తుతం 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిల్లో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చావా అని అడుగుతున్నాను. నీరు నిరుద్యోగులకు ఏరకంగా భరోసా ఇస్తావని  అడుగుతున్నాను.
– ఎన్‌టీఆర్‌ పెట్టిన పార్టీని లాక్కున్నావు. సొంత మామ ఎన్‌టీఆర్‌కే భరోసా ఇవ్వలేకపోయావు. ఆయన పదవిని లాక్కున్నావు. గ్రామ గ్రామంలో కూడా ఒక మాఫియా తయారు చేశారు. పింఛన్, రేషన్‌కార్డు, ఏది కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే. మరుగుదొడ్లు కావాలంటే మీరు ఏ పార్టీ అని అడుగుతున్నారు. మాఫియా సామ్రాజ్యాన్ని తయారు చేసి ఎవరికి భద్రత కల్పించారని అడుగుతున్నాను.
– మన పిల్లలు ఈ ఐదేళ్లలో పెద్ద పెద్ద చదువులు చదవాలంటే ఫీజులు విఫరీతంగా పెంచారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా అరకొరగా ముష్టివేసినట్లు ఇస్తున్నారు. మనపిల్లలను చదివించాలంటే అప్పులపాలు అవుతున్నాం. 
– చంద్రబాబు ఐదేళ్ల పాలనలో 108 నంబర్‌కు ఫోన్‌ కొడితే కుయ్‌ కుయ్‌ అంటూ రావాల్సిన అంబులెన్స్‌ రావడం లేదు. ఆరోగ్యశ్రీతో జబ్బులు నయం అవుతాయన్న భరోసా లేదు. ఇంతటి దారుణమైన చంద్రబాబు పాలనలో భరోసా దేవుడెరుగు. చంద్రబాబు చేస్తున్నది ఏంటంటే ఈ ఐదేళ్లు దొంగపనులు చేసి చట్టానికి దొరకకుండా ఉన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సంకలో పెట్టుకొని  ఆయనకు ఆయనే భరోసా ఇచ్చుకుంటున్నారు.
– ఇంతటి దారుణమైన పాలన జరుగుతుంటే..టీవీ అడ్వర్‌టైజ్‌మెంట్లు చూడండి. 2014 ప్రకటనలు గుర్తుకు తెచ్చుకోండి. ఆ రోజుల్లో ప్రకటనలు ఏంటి? బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. ఒక చేయ్యి వచ్చి ఆడవారి మెడలోని మంగళసూత్రం లాక్కొని వెళ్తుంది. అప్పుడు ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. అప్పుడు..ఆయనొస్తారు అని అడ్వర్‌టైజ్‌మెంట్లు ఇచ్చారు.గుర్తున్నాయా..ఆ రకంగా ప్రకటనలు ఇచ్చారు. ప్రతి గోడపై కూడా జాబు కావాలంటే బాబు రావాలన్నారు. మళ్లీ ఐదేళ్ల తరువాత కొత్త కొత్త ప్రకటనలు ఇస్తున్నారు.
– మీ భవిష్యత్తు – నా బాధ్యత అంటున్నారు. ఈ చెడిపోయిన వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం రావాలి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి. ఈ వ్యవస్థలోకి మార్పు రావాలంటే మీ అందరితోనే సాధ్యమని ఎవరు కూడా మరచిపోవద్దు. మరో 14 రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి. చంద్రబాబు రోజుకో కొత్త అబద్ధం, డ్రామా చూపిస్తారు. చంద్రబాబుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి అమ్ముడపోయిన చానల్స్‌ బాకా ఊదుతున్నాయి.  ప్రతి గ్రామానికి చంద్రబాబు మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ప్రతి చేతిలోనూ రూ.3 వేలు డబ్బు పెడతారు. మీ అందరూ కూడా ప్రతి ఒక్కరిని కలవండి. కలిసి..ప్రతి ఒక్కరికి చెప్పండి..చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు..20 రోజులు ఓపిక పడితే అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం అని చెప్పండి. బద్వెలు ఎమ్మెల్యే అభ్యర్థిగా వెంకటసుబ్బయ్య, ఎంపీగా వైయస్‌ అవినాష్‌రెడ్డిలను ఆశీర్వదించాలని వైయస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు.

 

Back to Top