వచ్చేది రాజన్న రాజ్యమే..అందరూ ధీమాగా ఉండండి

సంతనూతలపాడు సభలో వైయస్‌ జగన్‌

చంద్రబాబు పాలనలో రైతన్నల ఆత్మహత్యలు పెరిగాయి

బాబు విమాన ప్రయాణాలు పెరిగాయి కానీ..పేదవాడు పిలిస్తే అంబులెన్స్‌ రాదు

ఇంటి పన్నులు, నీటి పన్నులు, పెట్రోల్, డీజిల్‌ రేట్లు అన్నీ పెరిగాయి

చంద్రబాబు చేసిన 600 వాగ్ధానాల్లో ఏమీ నెరవేర్చలేదు

రోజుకో సినిమా, డ్రామాను చంద్రబాబు చూపిస్తున్నారు

ప్రతీ గ్రామానికి బాబు మూటల మూటల డబ్బు పంపిస్తారు

బాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని అందరికీ చెప్పండి

ప్రకాశం: వచ్చేది రాజన్న రాజ్యమే అని..ప్రతి ఒక్కరు ధీమాగా ఉండాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు గత ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీల్లో ఏమీ నెరవేర్చలేదని, రోజుకో సినిమా, డ్రామా చూపిస్తున్నారన్నారు. మళ్లీ ఎన్నికలు వచ్చే సరికి గ్రామాలకు మూటలు మూటలు డబ్బులు పంపిస్తున్నారని, ఆయన ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని ప్రతి ఒక్కరికి చెప్పాలని పిలుపునిచ్చారు. మరో 14 రోజులు ఓపిక పడితే అన్న ముఖ్యమంత్రి అవుతారని, మనందరి కష్టాలు తీరే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పాలని సూచించారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు పట్టణంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..

  •  ఈ నియోజకవర్గంలో సాగునీరు, తాగునీరు ఇబ్బంది. ఇంతటి దారుణమైన పరిస్థితిలో ఉంది కదా అని గతంలో ఏ ఒక్కరూ చేయని విధంగా.. ఆ దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డిగారు సాగునీరు, తాగునీరు కోసం రామతీర్థం, గుండ్లకమ్మప్రాజెక్టు కట్టించారు. నాన్నగారి హయాంలో కట్టిన ఆ ప్రాజెక్టుల పరిస్థితి ఒక్కసారి చూస్తే నిజంగా గుండె తరుక్కుపోయింది. ఇదే రామతీర్థం కింద సాగర నీరు కనీసం ఇప్పించుకోలేని పరిస్థితిలో ఐదేళ్ల పాలన సాగింది. ఇంతకంటే అన్యాయమైన పాలన ఎక్కడైనా ఉంటుందా..? గుండ్లకమ్మ ప్రాజెక్టు పూర్తయినా ఆ ప్రాజెక్టు కింద పంట కాల్వలను ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు హయాంలో కనీసం పూర్తి కూడా చేయలేకపోయాడంటే ఈ మనిషి ముఖ్యమంత్రేనా..? 11 గ్రామాల్లో ఇంకా పునరావాస పనులు పూర్తికాలేదంటే ఈ జిల్లా మీద, ఈ ప్రజల మీద చంద్రబాబు ఏ మేరకు ధ్యాసపెట్టాడో ఆలోచన చేయండి. పొగాకు రైతుల పరిస్థితి ఎలా ఉందో ఆలోచన చేయండి. ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు పాలనలో పెట్టుబడులు రాక అప్పులపాలై బతుకు కష్టమై ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా ఈ నియోజకవర్గంలో చూశాం. రమణారెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే కనీసం పరిహారం ఇవ్వలేదు. పరిహారం కోసం పోరాటం చేస్తే కేసులు పెట్టించిన పరిస్థితి. 
  • పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. గిట్టుబాటు ధరల కోసం జగన్‌ అనే వ్యక్తి ధర్నాలు చేస్తే గానీ ఇవ్వని పరిస్థితి. ఈ రోజుకు పొగాకు రేటు రూ. 165 మించి లేదు. కనీసం రూ. 220 లేకపోతే పెట్టుబడులు కూడా రావని, ఖర్చులు కూడా రావని రైతులు ఆవేదన పడుతున్నా.. పట్టించుకోవాలనే ఆలోచన రైతులకు లేదు. పొగాకు సేద్యం వదిలేస్తాం.. బ్యారల్‌కు కనీసం రూ. 10 లక్షలు ఇప్పించండి. గిట్టుబాటు ధర కావడం లేదు. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నామని రైతులు అడుగుతున్నా.. ఐదేళ్ల పాలనలో కనీసం రైతన్న గురించి పట్టించుకునే పాపాన పోలేదు. 
  • కందికి కనీస మద్దతు ధర రూ. 5,675 అయితే కనీసం రూ. 4 వేలు కూడా దక్కని పరిస్థితుల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నారు. సుబాబుల్‌ నాన్నగారి హయాంలో ఆ రోజుల్లో రూ. 4,400 పలికింది. ఈ రోజు కనీసం రూ. 2 వేలు కూడా రావడం లేదని రైతులు ఆరాటపడుతుంటే పట్టించుకునే నాధుడు లేడు. శనగలు కనీస మద్దతు ధర రూ. 4620, కనీసం రూ. 3500 రావడం లేదని రైతులు బాధపడుతున్నా.. వినేనాధుడు లేడు. 
  • ఉద్యోగాలు దొరక్క అవస్థలు పడుతున్న ఆ పిల్లలను చూసి గుండె తరుక్కుపోతుంది. ఇదే నా పాదయాత్ర సాగింది. ఇదే నియోజకవర్గం చీమకుర్తిలో ఆ పరిశ్రమలు చూసినప్పుడు బాధ అనిపించింది. వరుసగా పాలిషింగ్‌ యూనిట్లు మూతపడుతున్నాయి. జిల్లాలో 11 వందల పాలిషింగ్‌ యూనిట్లు ఉంటే.. వీటిలో జిల్లా వ్యాస్తంగా మొత్తం 5 వందల పాలిషింగ్‌ యూనిట్లు మూతపడే పరిస్థితి. ఉద్యోగాలు వస్తున్నాయి. లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ఊదరగొడుతూ మాట్లాడుతున్న ఈ పెద్ద మనిషి ఇదే జిల్లాలో ఉద్యోగాలు దొరక్క ఉన్న కంపెనీలన్నీ మూతపడుతుంటే గాడుదులు కాస్తున్నాడా.. అని అడుగుతున్నా.. 
  • వరుసగా ఇవన్నీ ఎందుకు మూతపడుతున్నాయంటే.. గ్రనైట్‌ క్వారీలకు సంబంధించి రాయల్టీని పెంచాడు. పాలిషింగ్‌ యూనిట్ల కరెంటు రేట్‌ ఇంతకు ముందు రూ. 3.70 పైసలు ఉంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత రూ. 8.70 పైసలకు తీసుకెళ్లాడు. ఇక గిట్టుబాటు లేక వరుసగా పరిశ్రమలు మూతపడుతున్నాయి. రాయల్టీ రేటు చూస్తే గతంలో రూ. 1980 పెద్ద సైజ్‌ స్టోన్‌కు ఉంటే ఇవాళ రూ. 5,200 చేశాడు. చిన్నసైజ్‌ స్టోన్‌ రూ. 660 ఉంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత దాన్ని రూ. 1755కు తీసుకెళ్లాడు. ఇక ఏరకంగా పరిశ్రమలు బతుకుతాయి.. చదువుకున్నవారికి ఉద్యోగాలు ఏరకంగా వస్తాయని అడుగుతున్నా.. 
  • చంద్రబాబు పాలనలో ఏం జరిగిందని మీరంతా ఆలోచన చేయాలని కోరుతున్నా.. చంద్రబాబు పాలనలో రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. రైతుల అప్పులు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి రూ. 87,612 కోట్లు ఉంటే తడిసిమోపెడై ఇవాళ వడ్డీలతో కలిపి రూ. 1.5 లక్షల కోట్లకు చేరాయి. చంద్రబాబు పాలనలో గవర్నమెంట్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయడు. పెంచిన కరెంటు రేట్లకు, రాయల్టీ రేట్లకు ఉన్న పరిశ్రమలు మూతపడుతున్నాయి. చంద్రబాబు పాలనలో పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఉద్యోగాలు తగ్గాయి. నిరుద్యోగులు రెట్టింపు అయ్యారు చంద్రబాబు హయాంలో.. బాబు వస్తే జాబు వస్తుందన్నాడు.. బాబు వచ్చాడు ఉన్న జాబులన్నీ ఊడగొట్టాడని పిల్లలు బాధపడుతున్నారు. ఇంటికి రూ. 2 వేల భృతి అన్నాడు. ప్రతి నిరుద్యోగికి రూ. 1.20 లక్షలు ఎగ్గొట్టాడు ప్రతి ఇంటికి. బాబు పాలనలో ఏం జరిగిందంటే పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు బలహీనపడ్డారు. అక్కచెల్లెమ్మల రుణాలభారం గతంలో రూ. 14 వేల 200 కోట్లు ఉంటే ఇవాళ అక్షరాల వడ్డీలతో కలిసి రూ. 26 వేల కోట్లకు ఎగబాకింది. చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు సున్నావడ్డీకే రుణాలు ఇచ్చే పరిస్థితిని పూర్తిగా ఎగరగొట్టాడు. 
  • మహిళలకు  భద్రత 5 నిమిషాల్లో పోలీసులు వస్తారని ఎన్నికలకు ముందు ఊదరగొట్టాడు. ఇవాళ పరిస్థితి చూస్తే మహిళా ఎమ్మార్వోను ఒక ఎమ్మెల్యే జుట్టుపట్టుకొని  ఈడ్చుకొని పోతున్నా కేసులు ఉండవు. చంద్రబాబు బ్యాచ్‌ మొత్తం విజయవాడలోనే తన కళ్ల ఎదుటనే కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ నడుతుపుతున్నా.. ఏ ఒక్కరికీ శిక్షలు ఉండవు. మహిళలను వేధించడం తప్ప మరేదీ లేదన్నారు. చంద్రబాబు హయాంలో పది సంవత్సరాల క్రితంతో పోల్చితే పంట దిగుబడి తగ్గింది. పంట సాగు విస్తృతం కూడా తగ్గింది. బీసీల మీద ప్రేమ అని చెబుతాడు.. అదే బీసీల పిల్లల చదువుల కోసం ఫీజురియంబర్స్‌మెంట్‌ కూడా ఇవ్వకుండా బీసీ పిల్లలంతా ఇవాళ అప్పులపాలు అయితే తప్ప చదివించుకోలేని పరిస్థితికి వెళ్లిపోయారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలకు ప్రభుత్వం ఇచ్చేది తగ్గిపోయింది. వారి భూములు లాక్కోవడం మాత్రం పెరిగిపోయాయి. చంద్రబాబు పాలనలో జరిగిందేమిటంటే గవర్నమెంట్‌ బడులు పూర్తిగా తగ్గిపోయాయి. బార్లు మాత్రం ప్రతి గ్రామంలో పెరిగిపోయాయి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యుత్‌ అన్నారు. నారాయణ స్కూళ్లు ఫీజులు గుంజడానికి 6 వేల గవర్నమెంట్‌ స్కూళ్లను మూసివేయించాడు. బెల్టుషాపుల రద్దు మీద తొలి సంతకం అని చెప్పాడు.. ఆ తరువాత చేసిందేమీటంటే ప్రతి వీధి చివర మందు షాపులు పెట్టే అనేక ఫైల్స్‌పై సంతకాలు పెట్టాడు. పోలీస్‌ స్టేషన్లు పెరగలేదు కానీ.. ప్రతి గ్రామంలో జన్మభూమి కమిటీల మాఫియా చెలరేగిపోతుంది. బాబు ప్రత్యేక విమానాల్లో తిరగడం పెరిగింది.. కానీ 108కి ఫోన్‌ కొడితే అంబులెన్స్‌లు రావడం తగ్గాయి. చంద్రబాబు హయాంలో తన మంత్రి యనమల రామకృష్ణుడికి పంటి నొప్పి వస్తే సింగపూర్‌కు పంపించి వైద్యం చేయిస్తాడు.. కానీ జనాలకు రోగాలు వస్తే పక్క రాష్ట్రంలో వైద్యం చేయించుకోవడానికి అనుమతులు ఇవ్వడం లేదు. 
  • చంద్రబాబు హయాంలో కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, ఇంటి పన్నులు, నీటి పన్ను, పెట్రోల్, డీజిల్‌ రేట్లు బాదుడే బాదుడు.. చంద్రబాబు హయాంలో ప్రతీది తగ్గాయి కానీ ప్రజల ఆదాయం మాత్రం పదేళ్ల కిందటితో చూస్తే ఇప్పటికీ ఇంకా తగ్గాయి. అమరావతి అని పేరు పెట్టాడు.. అమరేశ్వరుడి భూములను కూడా కొల్లగొట్టాడు. రాజధానిలో ఏం కట్టాడంటే.. 40 గుడులను కూలగొట్టాడు. గ్రాఫిక్స్‌ చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాడు. అమరావతిలో ఏం కట్టారని అడిగితే.. బాహుబలి గ్రాఫిక్స్‌ చూపిస్తూ.. రియలెస్టేట్‌ వ్యాపారం చేశాడు. చంద్రబాబు పాలనలో 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి తీసుకొస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి చేసిందేమీటంటే.. అక్షరాల రూ. లక్షల కోట్లతో లోకేష్‌ స్థిరీకరణ నిధి తీసుకువచ్చాడు. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడు. వి్రరవీగాడు.. కానీ 13 జిల్లా ప్రజలను చూసి వణికిపోతున్నాడు. ఏదైనా మీటింగ్‌కు పోవాలంటే భయపడుతున్నాడు. ఢిల్లీ నుంచి ఎవరైనా నాయకులు జతగా వస్తేనే పోయే పరిస్థితి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు 650 వాగ్ధానాలు చేశాడు కానీ చెప్పినవి ఒక్కటి కూడా నెరవేర్చలేదు 
  • 2014లో తాను రిలీజ్‌ చేసిన ఎన్నికల మేనిఫెస్టో ఎక్కడ ఉందని టీడీపీ వెబ్‌సైట్‌కు వెళ్లి వెతికితే కనిపించకుండా మొహాన్ని చాటేస్తున్నాడు. ఇటువంటి వ్యక్తి ఎన్నికలు వచ్చే సరికి మళ్లీ మోసం చేయడానికి టీవీ ప్రకటనలు ఇస్తూ మీ భవిష్యత్తు నా బాధ్యత అంటూ మాటలు చెబుతున్నాడు. మళ్లీ ఇలాంటి వ్యక్తిని ఎవరైనా నమ్ముతారా.. ఐదేళ్ల పాలనను ఒక్కసారి చూడమని అడుగుతున్నా.. మోసాలు, అన్యాయాలు, కుట్రలు ఏ స్థాయికి పోయాయో ఒక్కసారి గమనించాలి. రాబోయే రోజుల్లో చంద్రబాబు రోజుకో సినిమా చూపిస్తాడు. ప్రతి మోసాన్ని ప్రజలు గమనించాలి. చేయని మోసం, చేయని కుట్ర ఉండదు. కుట్రలో భాగంగా ప్రతి గ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. ప్రతి చేతిలో రూ. 3 వేలు పెట్టే ప్రయత్నం చేస్తాడు. మీ గ్రామాల్లో, మీ వార్డుల్లో తిరగండి.. ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను, ప్రతి తాతను, ప్రతి అవ్వను, ప్రతి అన్నను కలవండి. 
  • చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలు తీసుకొని మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపిక పట్టు అక్కా.. అన్ను ముఖ్యమంత్రి చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పిల్లలను కేవలం బడులకు పంపిస్తే చాలు అన్న ప్రతి అక్క చేతిలో రూ. 15 వేలు పెడతాడని చెప్పండి. మన పిల్లలను ఇంజనీర్లుగా, డాక్టర్లుగా చదివించగలుగుతున్నామా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. మన పిల్లలను ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్‌ వంటి చదువులు చదివించే పరిస్థితి లేదు అక్కా.. పిల్లల చదువుల కోసం ఆస్తులు అమ్ముకుంటున్నాం.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పిల్లలను పెద్ద చదువులు ఎన్ని లక్షలు ఖర్చు అయినా అన్న ఉచితంగా చదివిస్తాడని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. 
  • పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి చెప్పండి చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అని చెప్పండి. ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశాడు. ఒక్క రూపాయి మాఫీ చేసిన పరిస్థితి లేదు. గతంలో మనకు సున్నావడ్డీకే రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండేది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత సున్నావడ్డీ ఎగరగొట్టాడు. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. ఆ తరువాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు ఉన్న రుణాలన్నీ మొత్తం నాలుగు దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తాడని ప్రతి అక్కకు, ప్రతిచెల్లెమ్మకు చెప్పండి. మళ్లీ సున్నా వడ్డీకి రుణాలు వచ్చేది జగనన్నతోనే సాధ్యమని చెప్పండి.
  • పేదరికంలో అవస్థలు పడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలకు చెప్పండి. అక్కా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్నముఖ్యమంత్రి అయిన తరువాత వైయస్‌ఆర్‌ చేయూత అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రతి అక్క చేతిలో రూ. 75 వేలు నాలుగు దఫాలుగా మీ చేతుల్లోనే పెడతాడని చెప్పండి. 
  • గ్రామాల్లోని ప్రతి రైతు దగ్గరకు వెళ్లి చెప్పండి. చంద్రబాబును నమ్మి ఓట్లు వేశాం. రుణాలు మాఫీ చేస్తానన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదని ప్రతి రైతన్నకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి చూస్తున్నాం. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలతో మోసపోవద్దు అన్నా.. 20 రోజులు ఓపికపట్టు అన్న.. ఆ తరువాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ప్రతి రైతన్నకు మే మాసం వచ్చే సరికి పంట పెట్టుబడికి రూ. 12,500లు అందిస్తాడని, అక్షరాల పెట్టుబడుల కోసం రూ. 50 వేలు ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం అందిస్తాడని ప్రతి రైతుకు చెప్పండి. అన్నముఖ్యమంత్రి అయిన తరువాత గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు..  గిట్టుబాటు ధరలకు కూడా గ్యారెంటీ ఇస్తాడని చెప్పండి. 
  • అవ్వాతాతల దగ్గరకు వెళ్లండి. రెండు నెలల కిందట పెన్షన్‌ ఎంత వచ్చేదని అడగండి.. పెన్షన్‌ వచ్చేది కాదని, లేకపోతే రూ. వెయ్యి మాత్రమే వచ్చేదని వేలెత్తి చూపిస్తుంది. ఎన్నికలు రాకపోయి ఉంటే జగనన్న రూ. 2 వేలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే ఈ చంద్రబాబు రూ. 2 వేలు ఇచ్చేవాడా అని ప్రతి అవ్వను అడగండి. ఆ అవ్వకు, ప్రతి తాతకు చెప్పండి అవ్వా చంద్రబాబు మోసాలను బలికావొద్దు.. 20 రోజులు ఓపిక పట్టు అవ్వా.. తరువాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడు.. ప్రతి అవ్వాతాతలకు పెన్షన్‌ రూ. 3 వేల వరకు పెంచుకుంటూ పోతాడని చెప్పండి. 
  • ఇల్లులేని ప్రతి నిరుపేదకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఇల్లు లేదు. కట్టిస్తానన్న మాట పోయింది. 20 రోజులు ఓపిక పట్టు అన్నా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అక్షరాల 25 లక్షల ఇళ్లులు కట్టిస్తాడని చెప్పండి. రాజన్న రాజ్యంలో ఇళ్లులు కట్టడం చూశాం. మళ్లీ జగనన్నతోనే అది సాధ్యమని ఇల్లులేని ప్రతి నిరుపేదకు చెప్పండి.
  • నవరత్నాల్లోని ప్రతి అంశం ప్రతి కుటుంబంలోకి తీసుకొనిపోండి. నవరత్నాలతో మన బతుకులు మారుతాయి. మన ముఖాల్లో చిరునవ్వు వస్తుంది. అది జగనన్నతోనే సాధ్యమని చెప్పండి. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి మార్పురావాలి. మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సుధాకర్‌బాబును నిలబెడుతున్నాను. సౌమ్యుడు మంచిచేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ అందరి దీవెనలు అన్నపై ఉంచాలని కోరుతున్నాను. అదే విధంగా ఎంపీ అభ్యర్థిగా నందిగాం సురేష్‌ను నిలబెడుతున్నాను.. యువకుడు మంచిచేస్తాడు. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఆయనపై కూడా ఉంచాలని కోరుతున్నాను. మన పార్టీ గుర్తు ఫ్యాన్‌ అని ఎవరూ మర్చిపోవద్దు.. 

తాజా వీడియోలు

Back to Top