ప్రత్యేకహోదాకు కేసీఆర్‌ మద్దతిస్తుంటే బాబు అభ్యంతరం

చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలకు కష్టాలే

కరువొచ్చినా రైతులకు ఎలాంటి సాయం అందడం లేదు

సుదీర్ఘ పాదయాత్రలో మీ అందరి కష్టాలు విన్నాను

జగన్‌కు కేసీఆర్‌ డబ్బులిచ్చారని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు

వెయ్యి కోట్లు ఇస్తుండగా చంద్రబాబు ఏమైనా చూశారా?

ఐదేళ్లలో కేసీఆర్‌ను యాక్టర్లు ఎన్నిసార్లు పొగిడారో గుర్తు చేసుకోవాలి

రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు

అనంతపురం: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక హోదాకు మద్దతిస్తుంటే చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు.  కేసీఆర్‌ మద్దతు ఇస్తున్నది హోదాకా? వైయస్‌ఆర్‌సీపీకా అని చంద్రబాబును ప్రశ్నించారు. తనకు కేసీఆర్‌ రూ.1000 కోట్లు ఇస్తున్నారని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, అలా ఇస్తుంటే మీరేమైనా చూశారా చంద్రబాబూ అని నిలదీశారు. చంద్రబాబు, ఆయన పార్ట్‌నర్, యాక్టర్‌లు ఐదేళ్లలో కేసీఆర్‌ను ఎన్నిసార్లు పొగిడారో గుర్తు చేసుకోవాలన్నారు. అందితే జట్టు..అందకపోతే కాళ్లు పట్టుకునే రకం చంద్రబాబుదన్నారు. ఓటుకు కోట్లు కేసులో పట్టుబడి దొరికిన దొంగ చంద్రబాబు అన్నారు. భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు, ఆయన పార్ట్‌నర్‌లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి అధిపతులను కేసీఆర్‌ ఏమైనా బెదిరించారా అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే...

 • 3648 కి లోమీటర్లు సాగిన పాదయాత్రలో ఇదే తాడిపత్రి నియోజకవర్గం నుంచి కొనసాగింది. ఆ పాదయాత్రలో మీరు ఆ రోజు చెప్పిన బాధలు నాకు గుర్తున్నాయి. ఆ రోజు మీరు చెప్పిన కష్టాలు చూశాను. మీ ఆవేదన నేను విన్నాను. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. పంటలు పండన పరిస్థితి. చంద్రబాబు నాయుడితో కరువు కలిసి వచ్చింది. అంతటి దారుణమైన పరిస్థితుల్లో ఈ ఐదు సంవత్సరాల పాలన జరిగితే కరువు వచ్చినా ఆదుకునేవాడు లేడు. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చేవాడు లేడు. కరువు వచ్చినా ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సహకారం లేని పరిస్థితులు నేను చూశా. పంట పూర్తిగా నష్టపోయి కొద్దోగొప్పో చేతికి వస్తే చేతికి వచ్చిన వేరుశనగ పంటకు రేటు కూడా లేని పరిస్థితులు నేను చూశా. పత్తి రైతుల పరిస్థితి అంతే. అంతటిదారుణమైన పరిస్థితుల్లో జిల్లా రైతాంగం ఉండడం నా కళ్లతో నేను చూశా. నాన్నగారి హయాంలో ఇదే నియోజకవర్గంలో చాగళ్లు ప్రాజెక్టుకు రూ. 244 కోట్ల వ్యయంతో ప్రారంభించారు. దాదాపు 85 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు 2012లోనే పూర్తయినా ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులే జరగలేదు. ఇంతకంటే దారుణమైన పాలన ఎక్కడైనా ఉంటుందా..? చాగళ్లు ప్రాజెక్టు గురించి 6 వేల ఎకరాలకు సాయం అందే ప్రాజెక్టు నీరుగార్చబడిన తీరు మీరు చెప్పినప్పుడు విన్నాను. నాన్నగారి హయాంలో 102 కోట్లతో చేపట్టిన పెండేకళ్లు ప్రాజెక్టు ఇవాల్టికి కొనసాగుతూనే ఉందని మీరు చెప్పిన మాటలు ఇవాల్టికి గుర్తుకు ఉన్నాయి. దాదాపుగా 18 వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టుకు నీరు ఇవ్వాలని ఆలోచన చేయలేదంటే ఇంతటి దారుణమైన పాలన, ముచ్చుకొండ రిజర్వాయర్‌కు కూడా నీరు కేటాయింపు లేదు. ఐదేళ్ల పాలనలో కాస్త ద్యాస పెడితే అయ్యే పరిస్థితులు కూడా జరగని పనులు మీ నోటి నుంచి విన్నాను. 
 • హెచ్‌ఎల్‌సీ కాల్వ ఆధునీకరణ పనులు, నాన్నగారి హయాంలో మొదలుపెట్టారు. ఈ ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలనలో ఇంకా 45 శాతం పనులు కూడా జరగని పరిస్థితి చెబుతున్నప్పుడు మీరు పడిన ఆ బాధలు, వేధన నేను విన్నాను. ఇదే నియోజకవర్గంలో గ్రనైట్‌ పరిశ్రమలు దారుణంగా దెబ్బతిన్నాయని చెప్పినప్పుడు బాధ అనిపించింది. మీరు చెప్పిన ఆ బాధను విన్నాను. 750 యూనిట్లలో చాలా వరకు మూతపడ్డాయి. దాదాపు 20  వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారని చెప్పినప్పుడు బాధ అనిపించింది. ఇదే చంద్రబాబు హయాంలో రాయల్‌డీని ఒకేసారి రూ. 1650 నుంచి 2750కి పెంచిన పరిస్థితుల్లో నడపలేని పరిస్థితుల్లో గ్రనైట్‌ పరిశ్రమలు ఉన్నాయని మీరు చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. ఇదే  నాన్నగారి హయాంలో రూ. 3.70 ఉంటే, చంద్రబాబు పాలనలో కరెంటు చార్జీలు యూనిట్‌ రూ.8.75కి పెరిగింది. ఇంతటి దారుణంగా కరెంటు చార్జీలు పెంచి రాయల్‌టీని పెంచిన నేపథ్యంలో గ్రానైట్‌ పరిశ్రమలు మూతపడ్డాయి. ఇదే నియోజకవర్గంలో జరిగిన దౌర్జన్యాల గురించి మీరు చెప్పారు. ఒక నియంతలా.. దౌర్జన్యాలు యధేశ్చగా జరుగుతున్నప్పుడు మీరు చెప్పిన బాధలు విని చలించిపోయాను.  హత్యలు చేయడానికి, రౌడీయిజం చేయడానికి దగ్గరుండి చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ ఉన్న పాలకులు రెచ్చిపోతున్నారు. ఇదే నియోజకవర్గం పెదమడుగూరు మండలంలో కృష్ణపాడు సింగల్‌ విండో అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డిని కార్యాలయంలో హతమార్చిన సంగతి ప్రజలు చెప్పినప్పుడు, ఇటువంటి అన్యాయమైన పాలన చూసి బాధ అనిపించింది. మీ ప్రతి సమస్య నాకు చెప్పారు. మీ ప్రతి కష్టం నాకు చెప్పారు. నేను విన్నాను.. నేను ఉన్నానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 
 • ఎన్నికల ప్రకటన వచ్చిన నాటి నుంచి ఏం జరుగుతుందో మీరంతా చూస్తున్నారు. గత 20 రోజులుగా ఏమేం జరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు. ఒకసారి ఆలోచన చేయండి. చంద్రబాబు ఏమంటున్నాడో విన్నారా..? చంద్రబాబు పాట్నర్‌ ఒక సినిమా యాక్టర్‌ ఏమంటున్నాడో విన్నారా.. అని అడుగుతున్నా.. మన పార్టీ గుర్తు మాదిరిగానే పోలిక ఉండే హెలికాఫ్టర్‌ గుర్తు ఇప్పిస్తారు. మన పార్టీ కండువాలను కొత్త పార్టీలను పుట్టించి ఇస్తారు. కొత్త పార్టీలను పుట్టిస్తారు. మన పార్టీ గుర్తు మాదిరిగానే గుర్తు ఇప్పిస్తారు. కండువాలు మన పార్టీలాగే తయారు చేయిస్తారు. వీళ్లంతా రోజూ ఎవరి గురించి మాట్లాడుతున్నారో వింటున్నారా.. చంద్రబాబు నాయుడి ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఇంకా అమ్ముడుపోయిన ఎల్లో మీడియా అంతా ఎవరిని టార్గెట్‌ చేస్తూ ఎవరి గురించి రోజూ మాట్లాడుతున్నారో మీరంతా వింటున్నారా.. రోజంతా వీళ్లనేది ఒకటే జగన్‌.. జగన్‌.. జగన్‌. నిజంగా వాళ్ల బాధలు చూసినప్పుడు నవ్వాలనిపించింది. పండ్లు ఉండే చెట్టు మీదనే రాళ్లు పడతాయని, గెలుస్తుందని అర్థం అయిపోయిన పార్టీపైనే విమర్శలు ఉంటాయి. జనం మన పార్టీకి తోడుగా ఉన్నారని కుట్రలు పన్నుతున్నారు. జగన్‌ జగన్‌ అని కలవరిస్తున్నారు. 
 • వీళ్లంతా తెలంగాణలో కేసీఆర్‌ గురించి మాట్లాడుతున్నారు.. తెలంగాణలో కేసీఆర్‌ జగన్‌కు మద్దతు ఇచ్చాడంట. ఆ కేసీఆర్‌ జగన్‌కు రూ. 1000 కోట్లు ఇచ్చాడని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడి పాట్నర్‌ యాక్టర్‌ ఇదే మాట్లాడుతున్నాడు. ఎల్లో మీడియా కూడా సిగ్గులేకుండా ఇవే మాటలు ప్రసారం చేస్తుంది. చంద్రబాబును అడుగుతున్నా.. కేసీఆర్‌ వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చారని అంటున్నారే.. వెయ్యి కోట్లు ఇస్తుండగా నువ్వు చూశావా అని అడుగుతున్నా.. లేదా.. కేసీఆర్‌ నీకు ఫోన్‌ చేసి చెప్పాడా.. ? అని అడుగుతున్నా.. సిగ్గులేకుండా కనీసం నీ వయస్సు కూడా గౌరవం లేకుండా నిసిగ్గుగా అబద్ధాలు ఆడడం నీకే చెల్లుబాటు అవుతుంది బాబూ.. 
 • కేసీఆర్‌ మద్దతు ఇస్తుంది మాకా.. లేక ప్రత్యేక హోదాకా అని అడుగుతున్నా.. ప్రత్యేక హోదా కోసం మద్దతు ఇస్తుంటే చంద్రబాబుకు ఎందుకు అభ్యంతరం అని అడుగుతున్నా.. ప్రత్యేక హోదాకు మద్దతుగా వేరే రాష్ట్రాలు నిలుస్తుంటే నచ్చదా మీకు అని అడుగుతున్నా.. హరికృష్ణ శవాన్ని పక్కనబెట్టుకొని పొత్తు పెట్టుకుందామా అని చెప్పి ఇదే కేటీఆర్‌తో బేరాలు కుదుర్చుకోవడం సబబేనా..? మీతో పొత్తుకుంటే వాళ్లు మీరు మంచివారు, పొత్తు పెట్టుకోకుంటే వాళ్లంతా అన్యాయస్థులు, దుర్మార్గులు అని మాట్లాడుతున్నారు. జాతీయ స్థాయిలో ఒక రాష్ట్రానికి, మరొక రాష్ట్రం తోడుగా ఉంటే రాష్ట్రాలకు సంబంధించిన హక్కలు కాపాడబడతాయి. ఫెడరల్‌ ఫ్రంట్‌ ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి రాష్ట్రానికి సంబంధించిన విషయాలను పరిష్కరించవచ్చని, ప్రత్యేక హోదాకు మద్దతు తెలుపుతే దానికి హర్షించాల్సింది పోయి సిగ్గుమాలిన విధంగా మాట్లాడడం సబబేనా..? మన రాష్ట్రంలో 25 మంది ఎమ్మెల్యేలకు తోడు తెలంగాణ ఎంపీలు కూడా మద్దతు ఇస్తామంటే దానికి హర్షించాల్సింది పోయి దిక్కుమాలిన రాజకీయాలు మాట్లాడుతావా..? ఇదే చంద్రబాబు, ఆయన పాట్నర్‌ యాక్టర్‌ గత ఐదేళ్లలో వీళ్లు ఎన్నిసార్లు కేసీఆర్‌ను పొగిడారో గుర్తు చేసుకోవాలి. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు ఇది చంద్రబాబు నైజం. 
 • ఓటుకు కోట్ల కేసులో  అడ్డంగా దొరికిపోయి పారిపోయి వచ్చిన తరువాత తెలంగాణ మన ప్రజలు అక్కడ ఉన్నారని కనీస జ్ఞానం కూడా లేకుండా భావోద్వేగాలు రెచ్చగొట్టేలా చంద్రబాబు, ఆయన పాట్నర్‌ మాట్లాడుతున్నాడు. ఎల్లో మీడియా కూడా అదే ప్రసారం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులను, ఏపీ పారిశ్రామిక వేత్తలను బెదిరిస్తుందని చంద్రబాబు అంటున్నాడు.. మరి ఈనాడు రామోజీ రావును బెదిరించారా..? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను బెదిరించారా..? చంద్రబాబుకు హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్నాయి.. వాటిని ఏమైనా లాక్కున్నారా బాబూ అని అడుగుతున్నా.. రాజకీయ లాభం భావోద్వేగాలను రెచ్చగొట్టి మన వాళ్లకు అపకారం చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి దుశ్చర్యలు గమనించాలి. ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇంత గొప్పగా పాలన చూపి ఓటేయమని అడగలేని అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నాడు. 
 • నేను పలానా చేశాను నాకు ఓటేయండి అని అడగలేని పరిస్థితుల్లో ఉన్నాడు. జగన్‌ అధికారంలోకి వస్తే ఏదో జరిగిపోతుంది. తెలంగాణ వాళ్లను తీసుకొచ్చి బురదజల్లే ప్రయత్నం. అధ్వాన్నమైన పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి రోజుకో కథ తీసుకువస్తాడు. ఒక రోజు కేసీఆర్‌ అంటాడు. మరో రోజు తానే మా చిన్నాన్నను చంపిస్తాడు. చంపించిన తరువాత తన పోలీసుల చేత ఎంక్వైరీ చేయిస్తూ.. తన పత్రికలు, తన టీవీల్లో వక్రీకరిస్తూ రాయిస్తాడు. తానే చంపిస్తాడు బురదమాపై చల్లుతాడు చంద్రబాబూ.. 
 • తన పాలన మీద చర్చ జరగకూడదు. తన డిపాజిట్లు కూడా రావని తెలుసు. రోజుకో కొత్త అంశం తీసుకువచ్చి భావోద్వేగాలతో ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకునే కార్యక్రమానికి దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నాడు. చంద్రబాబు గత 25 రోజులుగా చేస్తున్న కుట్రలు గమనించాలి. ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి చేయని కుట్ర, చెప్పని అబద్ధం, చూపని సినిమా కూడా ఉండదని ఎవరూ మర్చిపోవద్దు. ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి చంద్రబాబు.. కుట్రలో భాగంగా గ్రామాలకు మూటల మూటలు డబ్బులు పంపించి ప్రతి చేతిలోనూ రూ. 3 వేలు పెట్టే ప్రయత్నం చేస్తాడు. మీ అందరికీ ఒకటే చెబుతున్నా.. మీ గ్రామాలు, మీ వార్డుల్లోకి వెళ్లి ప్రతి అక్కను కలవండి, ప్రతి చెల్లెమ్మను కలవండి. ప్రతి అన్నను, ప్రతి అవ్వాతాతలను కలవండి. అక్కా చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. మన ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుందాం. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం.. మన పిల్లలను కేవలం బడులకు పంపిస్తే చాలు ప్రతి తల్లికి రూ. 15 వేలు ఇస్తాడని ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. మన పిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్‌ వంటి చదువులు చదివే పరిస్థితుల్లో ఉన్నారా అని అడగండి.. ఒక్కసారి ఆలోచన చేయండి అని అడగండి. ఫీజులు చూస్తే సంవత్సరానికి రూ. లక్షలు దాటుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన పిల్లలను చదివించాలంటే ఆస్తులు అమ్ముకుంటే కానీ చదివించలేకపోతున్నాం అక్కా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపిక పట్టండి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఆ తరువాత మన పిల్లలను ఇంజనీరింగ్, డాక్టర్‌ వంటి చదువులను ఎన్ని లక్షలు ఖర్చు అయినా అన్న చదివిస్తాడని ప్రతి అక్కకు చెప్పండి. పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. రూ. 3 వేలు తీసుకొని మోసపోవద్దు అక్కా.. ఐదేళ్లు చంద్రబాబుకు సమయం ఇచ్చాం. ఎన్నికలప్పుడు పొదుపు సంఘాలకు రుణాలు మాఫీ చేస్తామన్నాడు.. మాఫీ చేయకపోగా గతంలో వచ్చే సున్నా వడ్డీ కూడా ఎగరగొట్టిన పరిస్థితిని చూస్తున్నాం.. 20 రోజులు ఓపిక పట్టు అక్కా అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఎన్నికల నాటి వరకు పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు ఎంతైతే రుణాలు ఉంటాయో మొత్తం నాలుగు దఫాలుగా నేరుగా మీకే ఇస్తారక్కా అని చెప్పండి. 
 • బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనార్టీ అక్కలకు చెప్పండి... 45 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలలోపు ఉన్న అక్కలకు చెప్పండి చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. అన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం.. ప్రతి అక్క చేతిలోనూ వైయస్‌ఆర్‌ చేయూత అనే పథకాన్ని తీసుకొస్తున్నాడు.. ప్రతి అక్క చేతిలోనూ అన్న అక్షరాల రూ. 75 వేలు ప్రతి అక్కచేతికి నాలుగు దఫాలుగా ఇస్తాడని చెప్పండి. ప్రతి రైతు దగ్గరకు వెళ్లండి అన్నా చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలు తీసుకొని మోసపోవద్దు అన్నా.. 20 రోజులు ఓపిక పట్టు అన్నా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. చంద్రబాబుకు ఐదేళ్లు సమయం ఇచ్చాం రుణమాఫీ అన్నాడు.. ఆయన చేసిన మాఫీ కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదన్నా.. ఒకసారి ఆలోచన చేయన్నా.. రైతన్నకు సున్నావడ్డీకే ఇంతకు ముందు రుణాలు వచ్చేవి.. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తరువాత సున్నావడ్డీ పథకం పూరిగా ఎగరగొట్టాడని ప్రతిరైతుకు చెప్పండి. ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రావడం లేదన్నా.. చంద్రబాబు సొంత కంపెనీ హెరిటేజ్‌ కోసం రైతులందరినీ అమ్మేశాడని ప్రతి రైతుకు చెప్పండి. 20 రోజులు ఓపికపట్టండి అన్నా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అన్నా.. అన్నను ముఖ్యమంత్రి అయిన తరువాత రైతుకు పెట్టుబడి కోసం ప్రతి సంవత్సరం రూ. 12,500 ఇస్తాడని చెప్పండి. అంతేకాదన్నా.. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత గిట్టుబాటు ధరలకు అన్న గ్యారెంటీ కూడా ఇస్తాడని చెప్పండి. 
 • ప్రతి అవ్వాతాతల దగ్గరకు వెళ్లి ఆ అవ్వను ఒకే ఒక్క మాట అడగండి మూడు నెలల కిందట పెన్షన్‌ ఎంత వచ్చేదని అడగండి.. రూ. వెయ్యి అని మాత్రమే చెబుతుంది. ఎన్నికలు రాకపోయి ఉంటే జగనన్న రూ. 2 వేలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే చంద్రబాబు రూ. 2 వేలు ఇచ్చేవాడా అని అడగండి. అవ్వాతాతలకు చెప్పండి చంద్రబాబు మోసాలకు బలికావొద్దు.. 20 రోజులు ఓపిక పట్టండి.. నీ మనవడిని ముఖ్యమంత్రిని చేసుకుందాం.. మనవడు ముఖ్యమంత్రి అయిన తరువాత పెన్షన్‌ రూ. 3 వేలకు పెంచుకుంటూ పోతాడని చెప్పండి.  
 • నవరత్నాల్లోని ప్రతి అంశం ప్రతి ఇంటికి చేరాలి. ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ దగ్గరకు వెళ్లాలి. ప్రతి తాత, అవ్వా దగ్గరకు వెళ్లాలి. ప్రతి అన్న దగ్గరు చేర్చే కార్యక్రమం చేయాలి. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. విశ్వసనీయత అనే పదానికి అర్థం రావాలి. విలువలు అంటే ఏమిటో తెలియాలి. మీ అందరి చల్లని దీవెనలు పెద్దారెడ్డి అన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నాడు మీ అందరి చల్లని దీవెనలు ఉంచాలని కోరుతున్నా.. అదే విధంగా ఎంపీ అభ్యర్థిగా రంగయ్య అన్న బీసీ కులానికి చెందిన వ్యక్తి, మంచి వ్యక్తి, మీ అందరి చల్లని దీవెనలు రంగయ్యపై కూడా ఉంచాలని పేరు పేరున ప్రార్థిస్తున్నా.. మీ అందరి చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు కావాలని, రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తున్నా.. మన గుర్తు ఫ్యాన్‌ అని ఎవరూ మర్చిపోవద్దు. 
Back to Top