మీ ఓటు ..రాష్ట్ర భవిష్యత్తుకే మార్పు

పులివెందుల సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

మాట నిలబెట్టుకోవడం కోసం ఎన్ని కష్టాలైనా భరించడం తెలుసు

నాలుగు దశబ్ధాలుగా నాన్నను ఆశీర్వదించారు. చిన్నాన్నను దీవించారు

నాన్న చనిపోయాక మేమంతా నీకు తోడుగా ఉంటామని అండగా నిలిచారు

పది మందికి సాయం చేయడం మనకు తెలుసు

పులివెందుల అభివృద్ధి చేసింది దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డియే

చంద్రబాబు తాను  అభివృద్ధి చేసినట్లు అబద్ధాలు చెబుతున్నారు

ప్రతిపక్ష పార్టీ ఓట్లను చీల్చేందుకు టీడీపీ కుట్ర

చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వచ్చేది మన ప్రభుత్వమే

 

వైయస్‌ఆర్‌ జిల్లా: పులివెందుల ప్రజలు వేసే ప్రతి ఓటు వైయస్‌ జగన్‌ ఎమ్మెల్యే కావడమే కాదని, మీరు వేసే ఓటు రాష్ట్ర భవిష్యత్తుకే మార్పు కాబోతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలుగా నాన్నను ఆశీర్వదించారు. చిన్నాన్నను దీవించారు. చివరకు మా అమ్మను కూడా ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నారు.  నాన్న చనిపోయిన తరువాత నాకు ఎవరు లేరనుకున్న పరిస్థితిలో లేదు..మేమంతా కూడా నీకు తోడుగా ఉన్నామని అండగా నిలిచారు. అవే దీవెనలు మళ్లీ కావాలని వైయస్‌ జగన్‌ కోరారు.   వైయస్‌ఆర్‌సీపీ పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా వైయస్‌ జగన్‌ నామినేషన్‌ వేసే ముందు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. చంద్రబాబు తన పార్ట్‌నర్‌ పవన్‌ కళ్యాణ్‌తో కలిసి కుట్రలు చేస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసిన వచ్చేది మన ప్రభుత్వమే అని విశ్వాసం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..

 
  • ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు, ఆత్మీయతలకు రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.. 
  • ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలన మధ్యలో మనం ఉన్నాం. తుడి గడియలు వచ్చిన పరిస్థితుల్లో ఉన్నాం. ఐదు సంవత్సరాల పాలనలో మనం చూడని మోసం, అబద్దం, అన్యాయం, దుర్మార్గం లేదు. వీటన్నింటి మధ్య నిల్చొని చెబుతున్నా.. నేను విన్నాను.. నేను ఉన్నాను ఈ రెండు మాటలు గట్టిగా చెబుతున్నా.. గిట్టుబాటు ధర లేని పరిస్థితులు చూశాం. చీని టన్నుకు రూ. 40 వేలు ఉండాల్సింది. రూ. 22 వేలకు తెగనమ్ముకుంటున్న పరిస్థితులు చూశాం.
  •  అరటి రూ. 10 వేలు ఉండాల్సింది రూ. 6 వేలు కూడా రాని పరిస్థితి. వేరుశనగకు కనీస ధర రూ. 4890 ఉంటే రూ. 3500 మించని పరిస్థితి చూశాం. గిట్టుబాటు ధరలు కాని పరిస్థితి చూశాం. రుణాలు మాఫీకాక రైతులు అల్లాడుతున్న పరిస్థితులు చూశాం. వాళ్లు చెప్పిన గాధలు విన్నాం. సున్నా వడ్డీలేదు. ప్రాజెక్టులు పూర్తి కాలేదు. 95 శాతం పూర్తయిన ప్రాజెక్టులు నత్త నడకన నడుస్తున్నాయి. పంటలు ఎండిపోవడం చూశాం. బీమా రాక ధర్నాలు చేస్తున్న పరిస్థితులు చూశాం. రైతులు పడుతున్న బాధలు విన్నాం. గ్రామాల్లో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు చూస్తున్న పరిస్థితులు చూశాం. సున్నా వడ్డీ పరిస్థితులపై వాళ్లు చెబుతున్న విషయాలు విన్నాం. పసుపు – కుంకుమ పేరుతో చంద్రబాబు చేస్తున్న డ్రామాలు కూడా చూశాం. ఉద్యోగాలు లేవు. పక్క రాష్ట్రాలకు వలస పోతున్న పరిస్థితులు చూస్తున్నాం. కడప స్టీల్‌ ఫ్యాక్టరీ కడతారేమో కడప స్టీల్‌ ఫ్యాక్టరీ కట్టిన వెంటనే ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్న పిల్లలను చూశాం, కళ్ల ఎదుటే ఆశలు ఆవిరి అయిపోతున్న పరిస్థితులను చూశాం. ఉద్యోగాల కోసం పక్కనే ఉన్న కర్ణాటక, బెంగళూరుకు వలసలు వెళ్తున్నారు.  వీటన్నింటి మధ్య నిల్చొని చెబుతున్నా.. నాన్నకు, నాకు. మా ఇద్దరికి పులివెందుల అంటే మాకు ప్రేమ అని చెబుతున్నా.. కడప గడ్డమీద పుట్టినందుకు గర్వపడుతున్న.. పులివెందుల గడ్డమీద పుట్టినందుకు ఇంకా గర్వపడుతున్నా అని గర్వంగా చెబుతున్నా.
  • ప్రతి ఒక్కరి మంచితనాన్ని, ప్రతి ఒక్కరి మానవత్వాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. కష్టంలో కూడా గుండె ధైర్యంతో ఎలా ఉండాలో నేర్పించింది ఈ గడ్డ. మన మీద వందల నిందలు, కుట్రలు జరుగుతున్నా.. తునకకుండా, బెదరకుండా ఎలా నిబ్బరంగా ఉండాలో నేర్పించింది ఈ గడ్డ. ఈ గడ్డ నాకు సహనాన్ని నేర్పించింది. మనం మంచి చేస్తున్నామా లేదా అనేదే ముఖ్యం. మనం మంచి చేస్తున్నప్పుడు ఎదుటివారు దుష్టపన్నాగాలు పన్నినా కూడా చిరునవ్వుతో ఉండడం నేర్పించింది ఈ గడ్డ. 
  • ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయి. మంచి రోజులు వచ్చినప్పుడు నిజం వెలుగులోకి రాకతప్పదు. చీకటి వచ్చిన తరువాత పగలు కూడా వస్తుందని ఓపిక, సహనంతో ఉండమని నేర్పించింది ఈ గడ్డ, రాతినేలలో సేద్యం చేయడం ఎలాగో ఈ గడ్డ మనందరికీ నేర్పించింది. ఈ నేలలో నీటిని నింపితే బంగారం ఎలా పండించగలమో చేసి చూపించింది మహానేత వైయస్‌ఆర్‌. 
  • పది మందిరికి సాయం చేయడం మనకు తెలుసు. మాట మీద నిలబడడం, మాట కోసం ఎంతటి కష్టాన్ని అయినా ఓర్చుకోవడం మనకు తెలుసు. ఈ మంచితనానికి విరుద్ధంగా చంద్రబాబు పాలన చూస్తున్నాం. అధికారం కోసం సొంత మామ ఎన్టీఆర్‌నే కుట్ర చేసి వెన్నుపోటు పొడిచి దింపేసి చంపేసిన చంద్రబాబు. తన పాలనలో కుప్పానికే ఏం మంచి చేయని వ్యక్తి.. పులివెందులకు వచ్చి మంచిచేశానని చెప్పుకునే వితండవాదం వింటున్నాం. 
  • అయ్యా చంద్రబాబు నేను ఇప్పటి నుంచి చదివే ఇవన్నీ నువ్వు తీసుకొచ్చావా.. లేక దివంగత మహానేత వైయస్‌ఆర్‌ తీసుకొచ్చారా చెప్పు.. 
  • పులివెందులలో జేఎన్టీయూ కళాశాల దివంగత మహానేత ముఖ్యమంత్రి అయిన తరువాత వచ్చింది. పులివెందుల నియోజకవర్గంలో ట్రిబుల్‌ఐటీ వైయస్‌ఆర్‌ చలవే. పక్కనే అంతర్జాతీయ పశు పరిశోధన కేంద్రం, ఐజీకార్‌. ఆరు లక్షల చదరపు అడుగులు కట్టింది. వచ్చింది దివంగత నేత హయాంలో. కడప నుంచి పులివెందులకు నాలుగు లేన్ల రోడ్డు, గండిక్షేత్రంలో టీటీడీ ద్వారా అభివృద్ధి, 2800 కోట్లతో పులివెందులలో మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు, ప్రతి మండల కేంద్రంలో ఐటీఐ, ఇంటర్మీడియట్‌ కాలేజీలు, పులివెందుల చుట్టూ రింగ్‌ రోడ్డు, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఏర్పాటు, పులివెందులలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, లింగాల మండలం నక్కలపల్లిలో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్, ఫుడ్‌ టెక్నాలజీ కాలేజీ, సింహాద్రిపురంలో పైడిపాలెం ప్రాజెక్టు, దాదాపు రూ. 12 వందల కోట్లతో కృష్ణా జలాలు పులివెందులకు వస్తాయా అని చెప్పి ముక్కున వేలేసుకున్న నాయకులకు అర్థం అయ్యేలా సింహాద్రిపురంలో పైడిపాలెం ప్రాజెక్టు, టీబీసీ బ్రాంచ్‌ కెనాల్‌ ఆధునీకరణ, పులివెందుల – కదిరి మధ్య రోడ్డు, పులివెందల, ముదిగుబ్బ, జమ్మలమడుగు మధ్య డబుల్‌ లేన్‌ రోడ్డు కూడా వైయస్‌ఆర్‌ పుణ్యమే. చిత్రావతి రిజర్వాయర్‌ 98 శాతం పూర్తి, చంద్రబాబును అడుగుతున్నా.. అయ్యా చంద్రబాబూ పులివెందుల మీద ప్రేమ అంటావు.. ఇక్కడకు వచ్చి మోసం చేస్తావు. పక్కనే ఐజీకార్ల పరిశోధన కేంద్రం కనిపిస్తుంది. ఎందుకు అక్కడకు పరిశ్రమలు తేలేదు. ఎందుకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నం చేయలేదని నిలదీస్తూ అడుగుతున్నా.. 
  • రూ. 2800 కోట్ల మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదు. సర్వరాయ్‌సాగర్, గండికోట, వామికొండ ప్రాజెక్టులు ఎందుకు పూర్తిచేయలేకపోతున్నారు. ఇదే చంద్రబాబును అడుగుతున్నా.. కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీకి మూడు నెలలకే శంకుస్థాపన చేసి ఉంటే మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తయ్యేది కాదా.. ఉద్యోగాలు వచ్చేవి కావా.. అని నిలదీస్తున్నాను. ఇదే పులివెందులలో మీరు వేసే ప్రతి ఓటు జగన్‌ను ఎమ్మెల్యేలను చేయడానికి కాదు ఓటు వేసేది.. మీరు వేసే ప్రతి ఓటుతో రాష్ట్ర భవిష్యత్తుకు మార్పురాబోతుంది. నాలుగు దశాబ్దాలుగా నాన్నను ఆశీర్వదించారు. చిన్నానను దీవించారు. చివరకు మా అమ్మను కూడా ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నారు.
  • నాన్న చనిపోయిన తరువాత ఎవరూ లేరనుకున్న పరిస్థితుల్లో లేదు.. మేమంతా నీకు తోడుగా ఉన్నామని అండగా నిలిచారు. అవే దీవెనలు మళ్లీ కావాలి. రాష్ట్రంలో విపరీతమైన కుట్రలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయో మీకు తెలుసు. చిన్నాన్న అంత సౌమ్యుడు ప్రపంచంలో ఉండేరేమో... చిన్నాన్నను అతిదారుణంగా చంపించింది వీళ్లే, మళ్లీ బురదజల్లేది వీళ్లే. వీళ్లే హత్య చేయించి.. వీళ్ల పోలీసులతో ఎంక్వైరీ చేయిస్తారు. వీళ్లు ఏది చెబితే అదే ఎంక్వైరీలో వస్తుంది. మళ్లీ ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. వక్రీకరిస్తూ వీళ్లకు కావాల్సిన రాసేది.. చూపేది మళ్లీ వీళ్ల టీవీ ఛానళ్లే, వీళ్ల టీవీలే. నిజంగా వీళ్లు పన్నుతున్న కుట్రలు, కట్టుకథలు చూస్తుంటే రాజకీయాలు ఇంత దిక్కుమాలిన పరిస్థితుల్లోకి దిగజారాయి. 
  • కడప జిల్లాలో గెలవలేమనే నిర్ధారాణలో టీడీపీ ఉంది. నిర్ధారణకు వచ్చిన తరువాత కుట్రలు చేసే కార్యక్రమం, కడప జిల్లాలోనే కాదు.. చంద్రబాబు అబద్ధాలు, మోసాల పాలన చూస్తే రాష్ట్రంలో చంద్రబాబుకు డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
  • చిన్నాన్నను చంపేస్తే జమ్మలమడుగులో తిరిగేవారు ఎవరూ ఉండరని చంపేశారు. చంపిన తరువాత ఆ నేరాన్ని కుటుంబ సభ్యుల మీదే వేసి, ఆ తరువాత అన్యాయంగా ఎవరినైనా అరెస్టు చేస్తే చివరకు పులివెందులలో ఎన్నికలు జరిపేవారు ఉండరని కుతంత్రాలు పన్నుతున్నారు. అన్యాయంగా అరెస్టులు చేసినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఇదే చంద్రబాబు నిన్న ఆదేశాలు ఇచ్చారంట.. రాష్ట్ర వ్యాప్తంగా హత్యలకు, దహనానికి రెడీ కావాలని మూడ్రోజుల్లో చేసేయాలి నేరాన్ని వైయస్‌ఆర్‌ సీపీపై నెట్టేద్దామని నిన్ననే చెప్పేశారంట. అంటే దాని అర్థం వీళ్ల పాలనపై ఓట్లు అడిగే సత్తా లేదు. అబద్ధాలు, మోసాలతో ప్రజలు విసుగెత్తిపోయారని వీళ్లకు తెలుసు. ప్రజల దృష్టిని మరల్చడానికి కడపలో హత్యా రాజకీయాల మీద ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పడానికి చంద్రబాబు పన్నుతున్న కుట్రలు చూస్తే బాధ అనిపిస్తుంది. మీ అందరితో విజ్ఞప్తి చేస్తున్నాం.. నాకు తోడుగా, అండగా నిలబడ్డారు. నాన్న చనిపోయినప్పుడు, కాంగ్రెస్‌తో పోరాడుతున్నప్పుడు, అక్రమంగా కేసులు పెట్టినప్పుడు నాకు తోడుగా నిలబడింది మీరే. రేపు పొద్దున మళ్లీ అలాంటి పరిస్థితులు వస్తే అండగా నిలబడాల్సింది మీరే. చంద్రబాబు ఎటువంటి అన్యాయాలు చేసినా.. అన్యాయపు అరెస్టు చేసినా ప్రశాంతంగా ఉండాలి. ఎన్నికలే మనకు కనిపించాలి. పెద్ద పెద్ద నాయకులను అరెస్టు చేస్తారేమో.. కానీ గ్రామాల్లో ఉండేది మీరు మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. పులివెందుల నుంచి నేను కూడా ప్రచారం చేయలేకపోవచ్చు.. రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సి వస్తుంది. కానీ నేను నమ్మేది.. గ్రామాల్లో ఉన్న నా అన్నలను, తమ్ములను నమ్ముతున్నా.. అక్క చెల్లెమ్మలపై నమ్మకం ఉంది. ఎన్నికలు మీరే చేస్తారు. బహుశా జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు మీరే చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో.. కడప జిల్లాలోని ప్రతి ఇంట్లో నుంచి కదలిక రావాలి. అన్యాయంగా అరెస్టులు జరిగితే.. రావణుడి పాలన అంతం కావాలంటే అది వానరుల చేత జరిగింది అని కచ్చితంగా మర్చిపోవద్దు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవే కుట్రలు జరుగుతున్నాయి. 
  • ఈ కుట్రలు ఇంతటితో ఆగిపోవు. ఈ వ్యూహంలో చంద్రబాబుకు భాగంగా తన పాట్నర్‌తో ప్రతిపక్షంగా ఉన్న వైయస్‌ఆర్‌ సీపీ మీద తానే స్క్రిప్టు చదివిస్తున్నాడు. ఆ పాట్నర్‌ ఎవరో తెలుసు కదా.. ఒక సినిమా యాక్టర్‌.. చంద్రబాబు ఎలా ఆదేశిస్తే ఆయన అలా చేస్తాడు. చంద్రబాబు ఆదేశాల మేరకు అభ్యర్థులను ప్రకటిస్తాడు. పాట్నర్‌ నిర్మాత, డైలాగులు చంద్రబాబువి. అభ్యర్థులు చంద్రబాబు నిర్ణయించిన వారే.. బీఫారంలు ఒక్కటే పాట్నర్‌తో పెట్టిస్తాడు. చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీతో కుమ్మకై ఇబ్బందులు పెట్టిన సీబీఐ అధికారి కూడా మీకు తెలుసు. టీడీపీ ఆ అధికారిని భీమిలి నుంచి నిలబెట్టాలనుకున్నాడు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసరికి తన పాట్నర్‌తో చెప్పి భీమిలి టికెట్‌ కాస్త విశాఖపట్నం ఎంపీగా నిలబెట్టించారు. గొప్ప గొప్ప డ్రామాలు ఆడుతున్నారు వీళ్లంత. చివరకు చంద్రబాబు పాట్నర్‌ యాక్టర్‌ నామినేషన్‌ వేస్తే అక్కడ టీడీపీ జెండాలు కనిపించాయి. దారుణంగా ప్రతిపక్ష ఓట్లను తీల్చేందుకు ఒకటి కాదు రెండు కాదు రకరకాల జిత్తులు, ఎత్తులతో డ్రామాలు ఆడుతున్నారు.
  • మీ అందరికీ ఒకటే చెప్పేది మనకు ఇటువంటి డ్రామాలు చేయాల్సిన పనిలేదు. మనకు ఇటువంటి సినిమాలు తీయాల్సిన పనిలేదు. దేవుడిని నమ్ముతున్నా.. ప్రజల మీద నేను ఆధారపడ్డా.. దేవుడి ఆశీస్సులు, మీ అందరి చల్లని దీవెనలతో ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా వచ్చేది ఖచ్చితంగా మనందరి ప్రభుత్వం. ప్రతి గ్రామంలోనూ రాబోయే రోజుల్లో చంద్రబాబు విపరీతమైన డబ్బులు పంపించే పరిస్థితి వస్తుంది. దాన్ని మనం అదిగమించాలి. డబ్బుకు మన నవరత్నాలు పోటీ కావాలి. సంవత్సరానికి ప్రతి అక్కకు, ప్రతి అన్నకు, ప్రతి అవ్వాతాతకు, ప్రతి రైతుకు నవరత్నాలతో ఎంత మేలు జరుగుతుందో.. చెప్పాలని కోరుతున్నా.. మీ బిడ్డను ఆశీర్వదించాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా.. 
 

 

  •  

తాజా వీడియోలు

Back to Top