హోదాకు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబే

వేమూరు సభ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

ఐదేళ్లలో చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారు

ప్రజల్ని మోసం చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా అర్హుడా?

వేమూరులో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీ లేదు

మీ కష్టాలు నేను విన్నాను..మీ బాధలను నేను చూశాను

అగ్రిగోల్డు ఆస్తులు కొట్టేయడానికి చంద్రబాబు కుట్రలు

ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు దగా చేశారు

జైట్లీ ప్యాకేజీ అబద్ధం అయితే ఎందుకు సన్మానాలు చేశారు?

చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు

అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని ప్రతి ఒక్కరికి చెప్పండి

గుంటూరు: ప్రత్యేక హోదా అంశానికి చంద్రబాబే వెన్నుపోటు పొడిచారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు. మళ్లీ హోదా కోసం ధర్మా పోరాట దీక్షలు చేసింది చంద్రబాబే అని మండిపడ్డారు. హోదా కోసం ప్రణాళిక సంఘానికి ఒక్క లేఖనైనా రాశారా అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో  ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడారు. 

 

  •  ఇలా కన్నులెత్తి చూస్తే ఎక్కడా ఖాళీ స్థలం కనిపించడం లేదు. ఏ వైపు చూపినా జనమే. ఎండను పట్టించుకోలేదు. దుమ్మును పట్టించుకోలేదు. చిక్కటి చిరునవ్వులతో ప్రేమానురాగాలను చూపిస్తున్నారు. మీ అందరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
  •  3648 కిలోమీటర్ల పాదయాత్ర..మీ అందరి చల్లని దీవెనలతో చేయగలిగా..ఆ అడుగులు వేస్తున్నప్పుడు మీ ప్రతి గుండె చప్పుడు విన్నాను. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నది ఒక్కసారి చూడండి. చంద్రబాబు చెబుతున్న మాటలు ఒక్కసారి వినండి. చంద్రబాబు వ్యవసాయ రుణాలు మాఫీ చేయకుండానే చేశానని చెబుతున్న మాటలు వింటున్నాం. పొదుపు సంఘాల రుణాలు రూపాయి కూడా మాఫీ చేయకుండానే అవి చేశానని చెబుతున్నారు. ఐదేళ్లుగా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ప్రతి ఇంటికి రూ.1.20 లక్షలు బాకీ పడ్డారు. రాజధానిలో పర్మినెంట్‌ పేరుతో ఒక్క ఇటుక కూడా వేయలేదు. ఇవాళ రాజధాని కట్టేశానని చెబుతున్నారు. మందుషాపులు చూస్తే గ్రామంలో కనీసం నాలుగైదు బెల్టు షాపులు కనిపిస్తున్నాయి. కిరణా షాపుల్లో కూడా మందు లభిస్తోంది. బెల్టు షాపులు మూయించకుండానే మూసేశానని చెబుతున్నారు. కాపులను బీసీలలో చేర్చానని చెబుతున్నారు. మత్స్యకారులను ఎస్సీలుగా చేశానని చెబుతున్నారు. 
  •  టీడీపీ 2014 ఎన్నికల ప్రణాళికలో అక్షరాల 650 హామీలు ఇచ్చారు. ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించారు. ప్రతి కులాన్ని ఎంత చక్కగా మోసం చేయగలరో చూశాం. టీడీపీ మేనిఫెస్టో ఎక్కడ ఉందో కూడా ఆ పార్టీ Ðð బ్‌సైట్‌లో కనిపించడం లేదు. ఏమీ చేయకుండా అన్నీ చేశానని చెబుతున్నారు.
  •  ఇదే పెద్ద మనిషి చంద్రబాబు ఐదేళ్లు రాష్ట్రానికి, ప్రజలకు చేసిన మోసాలు చాలవన్నట్లుగా ఇప్పుడు చంద్రబాబు మళ్లీ మోసం చేసేందుకు ఇవాళ ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? మీ భవిష్యత్‌..ఆయన బాధ్యత అంటున్నారు. ఐదేళ్లు దుర్మార్గాలు చేశారు. అన్యాయాలు చేశారు. మోసం చేశారు. మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి మళ్లీ ఏమంటున్నారు. మీ భవిష్యత్తు..తన బాధ్యత అంటున్నారు. రాష్ట్రాన్ని, ప్రజలను ఇంత ఘోరంగా ఇన్ని వందల దగాలు చేసిన వ్యక్తి రాజ్యాధికారంలో సీఎంగా కొనసాగడానికి అర్హుడా అని అడుగుతున్నాను.
  •  ఈ మనిషి ఇదే వేమూరుకు సంబంధించి ప్రజలంతా కూడా వ్యవసాయంపై ఆధారపడ్డారు. ఈ ఐదేళ్లలో మీరు పండించిన వరి, అరటి, కంది, జోన్న, మినుము, పెసలు పంటలకు గిట్టుబాటు ధర లభించిందా? అని అడుగుతున్నాను. క్వింటాల్‌ పసుపు రూ.5500 దాటడం లేదు. వ్యవసాయానికి కృష్ణా జలాలు అందడం లేదు. వేమూరులో డిగ్రీ కాలేజీ లేదు. మీ కష్టాలు నేను విన్నాను. మీ బాధలు విన్నాను. మీ అందరికి మాట ఇస్తున్నాను. నేను ఉన్నానని మాటిస్తున్నాను.
  •  చంద్రబాబు చేసిన వందల దగాల్లో, మోసాల్లో ఈ రోజు రెండు విషయాలు కాస్త సుదీర్ఘంగా చెబుతున్నాను. అగ్రిగోల్డు విషయం చెబుతున్నాను. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇంత మోసం చేయడం ధర్మమేనా? ఆలోచన చేయండి. రాష్ట్రంలో 19 లక్షల మంది అగ్రిగోల్డు బాధితులు ఉన్నారు. చంద్రబాబు ఎంతటి మోసం చేశారో చూడండి. పెద్ద బాబు, చిన్నబాబు, ఆయన అనుయాయులు విలువైన అగ్రిగోల్డు ఆస్తులు కొట్టేశారు. విచారణ చేసేది ఎవరంటే చంద్రబాబు జేబు సంస్థ సీఐడీ అధికారులు. ఈ అధికారులతో అగ్రిగోల్డు బాధితులకు ఏం న్యాయం జరుగుతుందని అడుగుతున్నాను. చంద్రబాబు ఢిల్లీలో కూర్చొని డీల్‌ కుదుర్చుకున్నారు. చీకటి సమావేశాల్లో మిగిలిన ఆస్తులు ఎలా కొట్టేయాలో అని ఒప్పందాలు చేసుకుంటారు. 19 లక్షల బాధితులకు కేవలం రూ.1138 కోట్లు  ఇస్తే బాధితులకు తిరిగి ఇవ్వవచ్చు అని నివేదికలు చెబుతున్నాయి. ఈ డబ్బులు ఇవ్వాలని బాధితులు ధర్నా లు చేసినా పట్టించుకోవడం లేదు. చివరకు వంద మంది బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బాధితులు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తున్నారు. మీ బాధలు నేను విన్నాను. మీ ఆవేదనను ఏకీభవిస్తున్నాను. మీ అందరికి నేనున్నానని మాట ఇస్తున్నాను.
  •  చంద్రబాబు చేసిన దగాల్లో మరో విషయం..ప్రత్యేక హోదా విషయం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనమందరం కూడా మన సీఎం మనహక్కుల కోసం గట్టిగా పోరాటం చేస్తారని అనుకుంటాం. ఎన్నికలకు ముందు చంద్రబాబు అన్న మాటలు ఏంటి..ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు..పదిహేనేళ్లు లె స్తామన్నారు. ఐదేళ్లలో చంద్రబాబు ఏమన్నారు. కేంద్రంతో చంద్రబాబు నాలుగేళ్లు సంసారం చేశారు. ఇద్దరు చిలుకా, గోరింకాల్లా కాపురం చేశారు. చంద్రబాబు ఎంపీలు కేంద్రంలో మంత్రలుగా కొనసాగారు. వీరు ప్రత్యేక హోదా గురించి పట్టించుకోలేదు. ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయని బీజేపీతో విడాకులు తీసుకున్నారు. పూర్తిగా వ్యతిరేకత రావడంతో ఆ నెపాన్ని బీజేపీపై నెట్టేశారు. ప్రత్యేక హోదాకు వెన్నుపోటు పొడిచింది ఆయనే..మళ్లీ ఆయనే ధర్మపోరాటం చేస్తున్నట్లు డ్రామాలు ఆడుతున్నారు. ఈయన ఆడిన డ్రామాలు చూస్తే..సొంత కూతురును ఇచ్చిన మామకు వెన్నుపోటు పొడిచారు. ఎన్నికల సమయంలో అదే ఎన్‌టీఆర్‌ పోటోకు దండలు వేసి దండాలు పెడతారు. ప్రత్యేక హోదా అంటూ ఆయనే నల్ల చొక్కాలు వేసుకొని ధర్నా చేస్తారు. చంద్రబాబుకు చాలాసార్లు చాలా ప్రశ్నలు వేశాను. మళ్లీ ఇవాళ చాలెంజ్‌ చేస్తున్నాను. 
  •  చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మార్చి 2, 2014న రాష్ట్రాన్ని విడగొట్టిన యూపీఏ ప్రభుత్వం ఎన్నికలకు ముందే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి అని అప్పటి కేబినెట్‌ ఆమోదం తెలిపి ప్రణాళిక సంఘానికి పంపించారు. ఆతరువాత ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అయ్యారు. ఏడు నెలల పాటు ప్రణాళిక సంఘం ఉంది. ఒక్కరోజు కూడా ప్రణాళిక సంఘాన్ని కలువలేదు. ఒక్క లేఖైనా రాశారా?
  •  సెప్టెంబర్‌8, 2016న అరుణ్‌జైట్లీ చంద్రబాబు మంత్రులను పక్కనపెట్టుకొని ప్రత్యేక హోదాకు బదులు ఒక అబద్ధపు ప్యాకేజీపై కేంద్ర మంత్రితో అర్ధరాత్రి ప్రకటన చేయించారు. అదే అర్ధరాత్రి మేల్కోని బ్రహ్మండంగా ఉందని ప్రకటన చేశారు. చంద్రబాబు సలహా మేరకే ప్యాకేజీ ఇస్తున్నట్లు అరుణ్‌జైట్లీ చెప్పారు. ఆ రోజు కేంద్రంతో కుమ్మక్కై ఎందుకు ఈ ప్రకటన చేయించారని ప్రశ్నిస్తున్నాను.  అది అబద్ధపు ప్యాకేజీ అయితే ఎందుకు బీజేపీ నాయకులకు సన్మానాలు చేసి శాలువాలు కప్పారని అడుగుతున్నాను. మరుసటి రోజు అసెంబ్లీలో పొగుడుతూ తీర్మానాలు ఎందుకు చేశారని అడుగుతున్నాను. ప్రత్యేక హోదాతో ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయన్నారు. కోడలు మగ బిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అన్నారు. ప్యాకేజీ ప్రకటన అనంతరం ఆరు నెలలకు చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట్టి ఏమన్నారో తెలుసా? కేంద్రం మన రాష్ట్రానికి చేసినట్లుగా ఏ రాష్ట్రానికైనా చేసిందా అని చాలేంజ్‌ చేశారు. ప్రత్యేక హోదా కోసం ధర్నాలు చేస్తే.. నిరాహార దీక్షలు చేస్తే అన్యాయంగా ఆ ఉద్యమాన్ని నీరుగార్చింది చంద్రబాబు కాదా? పిల్లలు ప్రత్యేక హోదా కోసం అడిగితే పీడీ యాక్ట్‌ పెడతా అన్నది నీవు కాదా చంద్రబాబు?. ప్రత్యేక హోదా అవసరం లేదని కేంద్రానికి కలుగ జేసింది వాస్తవం కాదా? రాష్ట్రంలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని లెక్కలు చెప్పడం ధర్మమేనా?
  •  అసలు వైయస్‌ఆర్‌సీపీ కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం పెట్టకపోతే చంద్రబాబు పెట్టేవారా? మా ఎంపీలు మొత్తం పదవులకు రాజీనామా చేశారు. బడ్జెట్‌ సమావేశాల చివరి రోజు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు ప్రత్యేక హోదాకు రాజీనామా చేశారు. అప్పుడే చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామా చేయించమని గట్టిగా అడిగాం. అప్పుడు టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి నిరాహార దీక్ష చేసి ఉంటే దేశం మొత్తం మన వైపు చూసేవారు కాదా? ప్రత్యేక హోదా రాకుండా పోయేదా? ఇంతటి దారుణంగా మోసం చసిన చంద్రబాబు నల్ల చొక్కాలు వేసుకొని «దర్మ పోరాటం అంటున్నారు. ప్రతి అంశంలోనూ ఇలాంటి మోసాలు కనిపిస్తున్నాయి. రైతుల నుంచి డ్వాక్రా మహిళల వరకు ఇదే మోసాలు, అన్యాయాలు కనిపిస్తున్నాయి. 
  •  చివరకు పిల్లలకు ఇచ్చే నిరుద్యోగ భృతిలో కూడా ఇవే మోసాలు, అన్యాయాలు కనిపిస్తున్నాయి. ఖాళీలు భర్తీ చేయకుండా మోసం చేశారు. ఐదేళ్లు చంద్రబాబు మోసాలు చేసి ఇవాళ ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు కొత్త సినిమాలు చూపిస్తున్నారు.
  •  20 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. చంద్రబాబు చెప్పని అబద్ధాలు ఉండవు, చేయని మోసం ఉండదు, చంద్రబాబుకు తానా తందానా అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఉంటుంది. వీళ్లంతా కూడా ఉన్నది లేనట్లుగా..లేనిది ఉన్నట్లుగా చూపిస్తున్నాయి. చంద్రబాబు మోసాలు ఇంతటితో ఆగిపోవు.
  •  మీ ప్రతి ఊరికి మూటలు మూటలు డబ్బులు తెస్తారు. ప్రతి చేతిలోనూ రూ.3 వేలు డబ్బు పెడతారు. మీ అందరికి ఒక్కటే చెబుతున్నాను. ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు అన్నా..అక్కా..20 రోజులు ఓపిక పట్టండి. అన్న ముఖ్యమంత్రి అవుతారు. అన్న సీఎం అయితే మన పిల్లలను కేవలం బడులకు పంపిస్తే చాలు ఏడాదికి రూ.15 వేలు ఇస్తారని ప్రతి ఒక్కరికి చెప్పండి. 
  •  ప్రతి ఒక్కరికి చెప్పండి..చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. మన పిల్లలలు ఉన్నత చదువులు చదవాలంటే అప్పులు చేయాల్సి వస్తోంది. అన్న ముఖ్యమంత్రి అయితే మన పిల్లల చదువులకు ఎంత ఖర్చైనా అన్న సీఎం అవుతారు..అన్ని అన్నే భరిస్తారని చెప్పండి. మన పిల్లలను పెద్ద పెద్ద చదువులు ఉచితంగా చదివించుకుందామని చెప్పండి.
  •  పేదరికంలో ఉండి తినడానికే అగచాట్లు పడుతున్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకు చెప్పండి. 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క మహిళకు రూ.75 వేలు వైయస్‌ఆర్‌ చేయూత పథకం కింద ఉచితంగా ఇస్తారని చెప్పండి. 
  •  పొదుపు సంఘాల్లో ఉన్న అక్కాచెల్లెమ్మలకు చెప్పండి..చంద్రబాబు ఇచ్చే డబ్బులకు మోసపోవద్దు. రుణాలు మాఫీ చేస్తామని మోసం చేశారు..మర్చిపోవద్దు. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తరువాత ఎన్నికల తేదీ వరకు మీకు ఎంతైతే అప్పు ఉంటుందో మొత్తం నాలుగు దఫాలుగా నేరుగా మీ చేతుల్లోకి  ఇస్తారని చెప్పండి.
  • సున్నా వడ్డీకే రుణాలు ఇస్తారని చెప్పండి.
  •  రైతులకు చెప్పండి..అన్నా..చంద్రబాబు  ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఆ తరువాత వ్యవసాయాన్ని పండుగ చేస్తారు. ప్రతి ఏటా రూ.12500 ,చొప్పున రూ.50 వేలు ఇస్తారని చెప్పండి. గిట్టుబాటు ధరలు కల్పిస్తూ అన్న గ్యారంటీ ఇస్తారని గట్టిగా చెప్పండి.
  •  ప్రతి ఒక్కరికి చెప్పండి. అన్న ముఖ్యమంత్రి కాగానే పింఛన్‌ రూ. 3 వేలు ఇస్తారని చెప్పండి. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందామని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశం ప్రతి ఒక్కరికి తెలియాలి. అందరికి నేనున్నానని చెబుతున్నాను. మన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేరుగ నాగార్జున, ఎంపీగా నందిగాం సురేష్‌ నిలబడ్డారు. మీ అందరూ ఆశీర్వదించాలని, వైయస్‌ఆర్‌సీపీ ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వైయస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. 
     
Back to Top