నారాసురుడి పాలన అంతం చేయండి

అవనిగడ్డ సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపు

మీ ప్రతి కష్టాన్ని నేను చూశాను..మీ బాధను నేను విన్నాను

గ్రామాల్లో పింఛన్లు కావాలంటే జన్మభూమి కమిటీల దగ్గరికి పోవాలా?

పిల్లనిచ్చిన మామనే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు

 అన్న ముఖ్యమంత్రి అవుతారు..మొత్తం అప్పును మాఫీ చేస్తామని చెప్పండి

పొదుపు సంఘాల వారిని చంద్రబాబు మోసం చేశారు

45 ఏళ్లు నిండిన మహిళలకు ఉచితంగా రూ.75 వేలు ఇస్తామని చెప్పండి

 

కృష్ణా జిల్లా:  ఐదేళ్లు చంద్రబాబు మోసాలను, అబద్ధాలను, అన్యాయాలను చూశామని, ఇలాంటి నారాసురుడి పాలన అంతం చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఇన్నాళ్లు బాబు మోసం చేస్తున్నాడని తెలిసిన ఏం చేయలేని పరిస్థితి, రాజకీయ వ్యవస్థ మారాలని, రాజకీయాల్లో విశ్వసనీయత రావాలని ఆయన ఆకాంక్షించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చాలని, లేదంటే ఆ పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలని సూచించారు. చంద్రబాబు లాంటి పెద్ద కొడుకు అవసరమా? ఎవరైనా ఆయన్ను దత్తత తీసుకుంటారా అని ప్రశ్నించారు. అవనిగడ్డలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. 

 • ఐదేళ్ల చంద్రబాబు పాలన చూశాం. ఎన్నికలకు ముందు రకరకాల హామీలు ఇచ్చారు. ప్రజలను ఎన్ని రకాలుగా వెన్నుపోటు పొడవాలో అన్ని రకాలుగా వెన్నుపోట్లు పొడిచారు. ముఖ్యమంత్రి అయ్యేందుకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. సాక్షాత్‌ అసెంబ్లీలోనే కృష్ణా జిల్లాకు ఫలానిది చేస్తామని హామీ ఇచ్చారు. అటువంటి వ్యక్తి అసెంబ్లీలో ఇచ్చిన హామీ..మచిలీపట్నంలోని పరిశ్రమలు, ఆటోమొబైల్‌ పరిశ్రమలు, విజయవాడ మెగాసీటీ, అక్వాకల్చరర్‌ యూనివవర్సిటీ, నూజీవీడులో పరిశోధన కేంద్రం ఇస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి అయిన తరువాత ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు. చంద్రబాబు ఈ ఐదేళ్ల పాలనలో చేసింది ఏంటో తెలుసా? కృష్ణా జిల్లాలో ఏకంగా కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌కు పాల్పడ్డారు. ఆడవారి మానప్రాణాలతో చంద్రబాబు చెలగాటమాడారు. ఒక ఐపీఎస్‌ ఆఫీసర్‌ను టీడీపీ ఎమ్మెల్యే చొక్కా పట్టుకున్నా చూస్తూ ఊరుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ బూములు కబ్జా చేశారు. ముఖ్యమంత్రిగా ఉంటూ లైసెన్స్‌ లేకుండా బోట్లు నడిపి ఏకంగా 23 మంది ప్రాణాలు బలికొన్నారు. విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో తాంత్రీక పూజలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు. చంద్రబాబు మాట్లాడితే  చాలు కంప్యూటర్‌ కనిపెట్టానని చెబుతుంటారు. ఐదేళ్లలో కనీసం ప్లైఓవర్‌ పూర్తి చేయలేకపోయారు. ఈ పెద్ద మనిషి సింగపూర్‌లాంటి రాజధాని కడతారట. ఐదేళ్లలో ఒక్కటీ కూడా నెరవేర్చలేదు. రాజధాని ఎక్కడా అని అడిగితే బాహుబలి సినిమా చూపిస్తున్నారు.
 •  విజయవాడలో మందుషాపులకు విచ్చలవిడిగా లైసెన్స్‌ ఇచ్చారు. బాగా తాగిస్తున్నారు. చంద్రబాబు తాను నివసిస్తూ చూట ఐదేళ్లు కిలోమీటర్ల దూరంలో పొక్లైన్‌ పెట్టి తవ్వేస్తున్నారు. ఇసుక ఉచితంగా ఇస్తున్నానని ప్రచారం చేస్తున్నారు. ఎక్కడైనా ఇసుక ఫ్రీగా దొరుకుతుందా? ఇసుక పేరుతో దోచుకుంటున్నారు. 
 •  ముఖ్యమంత్రిగా ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకుండా మోసం చేశారు. 57 నెలలు మోసాలు, అబద్ధాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా అర్హుడా అలోచించండి. నాన్నగారి పాలనను కూడా గుర్తుకు తెచ్చుకోండి. ఒక్కసారి సీఎంగా అవకాశమిస్తే..రెండోసారి కూడా ౖÐð యస్‌ఆర్‌కు పట్టం కట్టారు. అలాంటి పాలన నాన్నగారు చేశారు. ఒక్కసారి వైయస్‌ఆర్‌సీపీకి అవకాశం ఇవ్వండి. మళ్లీ రాజన్న రాజ్యం తెస్తామని హామీ ఇస్తున్నాను.
 •  మీ కష్టాన్ని నేను చూశాను. మీ బాధను విన్నాను. అందరికి చెబుతున్నాను..నేనున్నాన ని భరోసా ఇస్తున్నాను. పరిపాలన ఎలా ఉంటుందో చేసి చూపిస్తాం. కులం, మతం, రాజకీయాలు చూడకుండా మంచి పాలన ఇస్తాం. ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ పథకాలను డోర్‌ డెలీవరీ చేయిస్తామని మాట ఇస్తున్నాను.
 •  ఇవాళ జరుగుతున్న పరిపాలన చూస్తే బాధనిపిస్తుంది. పేదలతో రాజకీయం ఏంటి చంద్రబాబు? ఇచ్చే అరకొర ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఇబ్బందులు పడుతున్నారు. గిట్టుబాటు ధర లేని రైతులు, రుణాలు అందని డ్వాక్రా మహిళలతో రాజకీయాలు ఏంటని చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు.
 •  ఏదైనా సంక్షేమ పథకాలు కావాలంటే జన్మభూమి కమిటీ వద్దకు పంపుతున్నారు. గ్రామాల్లో పింఛన్‌ కావాలంటే జన్మభూమి కమిటీల వద్దకు వెళ్లాలి. వాళ్లు ఏ పార్టీ వారు అని అడుగుతున్నారు. పేదలతో రాజకీయామా. 69 ఏళ్ల చంద్రబాబు వయస్సు. ఇన్నాళ్లు చేయాల్సిన దుర్మార్గాలన్నీ చేశారు. ఇప్పుడు ఈయన పెద్ద కొడుకుగా ఉంటారట?. ఇలాంటి వ్యక్తి పెద్ద కొడుకుగా కావాలా?. మీరేవరైనా ఆయన్ను దత్తత తీసుకుంటారా? ఇతన్ని నమ్మి పిల్లనిచ్చిన మామ ఎన్టీరామారావునే వదల్లేదు. ఈయనను పెద్ద కొడుకుగా దత్తత తీసుకుంటే మనం బతుకుతామా? ఇటువంటి చంద్రబాబును చూస్తే నాకు ఒక కథ గుర్తుకు వస్తుంది.
 •  శిశుపాలుడు అనే అన్యాయమైన రాక్షసుడు ఉండేవాడు. ఆయన వంద తప్పులు చేసేవరకు దేవుడు క్షమించాడట. 101వ తప్పు చేసినప్పుడు దేవుడు శిక్షించాడట. నరకంలో శిశుపాలుడు ఉన్నారట. నాపై శిక్ష విధించావే..మరీ చంద్రబాబు నా కంటే ఎక్కువ తప్పులు చేశారు. ఆయన్ను ఎందుకు శిక్షించలేదని యముడిని ప్రశ్నించాడట. అందుకు యముడు అన్నారట. అప్పట్లో శ్రీకృష్ణుడు నిన్ను వధించాడు. ఇప్పుడు ఈవీఎం మీషన్లపై ఏపీ ప్రజలు ఓట్లు నొక్కి చంద్రబాబును దించబోతున్నారని చెప్పారట. ఈ యుగంలో విష్ణు చక్రానికి ప్రతిరూపం ఫ్యాన్‌ చక్రమని, శ్రీకృష్ణుడికి ప్రతిరూపం ఆంధ్రరాష్ట్ర ప్రజలని యముడు చెప్పాడట. కాకపోతే శిశుపాలుడికి ప్రతిరూపం ఎవరో తెలుసా? నరకాసురుడు, రావనాసురుడు, బకాసురుడికి జాయింట్‌ వెంచర్‌గా చంద్రబాబు పుట్టారట. ఈ పెద్ద పెద్దమనిషి చంద్రబాబు పాలన చూస్తే ఇదే గుర్తుకు వస్తుంది. మన ఖర్మ ఏంటంటే ఓటు వేసి గెలిపించాం.అందుకే ఇన్నాళ్లు ఏమీ చేయలేకపోయాం. దేవుడుఎన్నికలు కాస్త మొదటి విడతలోనే ఎన్నికలు పెట్టారు. నారసురుడి పాలన అంతం దగ్గరకు వచ్చింది. రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఒక నాయకుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ఆ పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితి రావాలి. అప్పుడు ఈ చెడిపోయిన వ్యవస్థలోకి నిజాయితీ, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం వస్తుంది.
 •  ఇటువంటి అన్యాయమైన పాలన పోవాలి. రేపు పొద్దున మంచి పాలన రావాలంటే ఆ హక్కు..అవకాశం మీ చేతుల్లోనే ఉంది. మనందరికి చంద్రబాబు రోజుకో సినిమా చూపిస్తున్నారు. ఆయనకు తోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఉంది. వీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఉన్నది లేనట్లుగా..లేనిది ఉన్నట్లుగా చూపిస్తారు. ఎన్నికలు దగ్గరకు వచ్చాయి. చంద్రబాబు చేయని అన్యాయం ఉండదు, చెప్పని అబద్ధం ఉండదు. చంద్రబాబు ప్రతి గ్రామానికి మూటలు మూటల డబ్బు పంపిస్తున్నారు. ప్రతి చేతిలో రూ.3 వేల డబ్బు పెడతారు. ప్రతి ఓటర్‌ను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లండి. ప్రతి ఒక్కరికి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. 20 రోజులు ఓపిక పడితే అన్న ముఖ్యమంత్రి అవుతారు. మన పిల్లలను బడికి పంపిస్తే రూ.15 వేలు ప్రతి ఏటా ఇస్తారు.
 •  ప్రతి ఒక్కరికి చెప్పండి..చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. మన పిల్లలు ఇంజినీర్లు, డాక్టర్లు చదవాలంటే ఎంత ఖర్చైనా ఫర్వాలేదు..అన్న ముఖ్యమంత్రి అవుతారు. అన్ని అన్నే ఇస్తారని చెప్పండి. మన పిల్లలను పెద్ద పెద్ద చదువులు చదివించుకుందామని చెప్పండి.
 •  పొదుపు సంఘాలలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పండి..చంద్రబాబు ఇచ్చిన మాట తప్పారు. అన్న ముఖ్యమంత్రి అవుతారు..ఎంతైతే అప్పులు ఉన్నాయో వాటన్నింటిని నాలుగు దఫాలుగా అన్న ముఖ్యమంత్రి కాగానే ఇస్తారని చెప్పండి. సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తారని చెప్పండి. 
 •  ప్రతి ఒక్కకు చెప్పండి..అన్న ముఖ్యమంత్రి అవుతారు..వైయస్‌ఆర్‌ చేయూత పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.75 వేలు ఉచితంగా ఇస్తారని చెప్పండి. 
 •  ప్రతి అన్నకు చెప్పండి..ప్రతి రైతుకు ఏడాదికి రూ.12500 పెట్టుబడి నిధి ఇస్తారని చెప్పండి. రూ.50 వేలు ఇస్తారని చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి విషయాన్ని ప్రతిఇంటికి తీసుకెళ్లండి. అవ్వ తాతలకు చెప్పండి. మూడు నెలల కిందట పింఛన్‌ ఎంతవస్తుందని అడగండి. జగనన్న చెప్పకుంటే రూ.2 వేలు ఇచ్చేవారా? . 20 రోజులు ఓపిక పట్టండి అన్న ముఖ్యమంత్రి అవుతారు. పింఛన్‌ రూ.3 వేలు ఇస్తారని చెప్పండి. నవరత్నాలతో జీవితాలు బాగుపడుతాయని నేను నమ్ముతున్నాను. చంద్రబాబు మోసాలకు మోస పోవద్దనిప్రతి ఇంట్లో చెప్పండి. 
 •  మంచి పాలన కోసం మీరంతా కూడా రమేష్‌ను అవనిగడ్డ ఎమ్మెల్యేగా, ఎంపీగా బాలశౌరీని దీవించండి. వైయస్‌ఆర్‌సీపీ ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వైయస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు.  
Back to Top