ధ‌ర్మానికి..అధ‌ర్మానికి మ‌ధ్య పోరు

రాయ‌దుర్గం స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

పాద‌యాత్ర‌లో అంద‌రి ఆవేద‌న విన్నాను

అన్ని వ‌ర్గాల‌కు నేనున్నాన‌ని భ‌రోసా ఇస్తున్నా

చంద్ర‌బాబు ఎన్నిక‌ల ముందు ఇచ్చే రూ.3 వేల‌కు మోస‌పోవ‌ద్దు

అన్న ముఖ్య‌మంత్రి అవుతార‌ని అంద‌రికి చెప్పండి

అనంత‌పురం:  ఈ ఎన్నిక‌లు ధ‌ర్మానికి..అధ‌ర్మానికి మ‌ధ్య  యుద్ధం జ‌రుగుతుంద‌ని, ఒక వైపు  విలువ‌లు, విశ్వ‌స‌నీయ‌త ఉంటే..మ‌రోవైపు మోసం ఉంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్ర‌బాబు ఎన్నిక‌ల ముందు ఇచ్చే రూ.3 వేల‌కు మోసంపోవ‌ద్ద‌ని, రేపు పొద్దున జ‌గ‌న‌న్న ముఖ్య‌మంత్రి అవుతార‌ని అంద‌రికి చెప్పాల‌ని సూచించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సోమ‌వారం మ‌ధ్యాహ్నం అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గం ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొని ప్ర‌సంగించారు.

 
మోసం చేయడమేనా భరోసా ఇవ్వడం అంటే..
 ఉత్సాహం చూస్తుంటే నాకొక సన్నివేశం గుర్తుకు వస్తుంది. 1947వ సంవత్సరం జూలై మాసం దేశ ప్రజలంతా బ్రిటీష్‌ సామ్రాజ్యం అంతరించిపోతుంది. ఇక ఆగస్టు వచ్చే సరికే మన సొంత పరిపాలన మనం ప్రారంభించుకోగలుగుతామని, సంతోషం. ఇప్పుడు రాయదుర్గంలో మీ ఉత్సాహం చూస్తుంటే మరికొన్ని రోజుల్లో మన పాలన రాబోతుందన్న ధీమా కనిపిస్తుంది. ఐదు సంవత్సరాలు చంద్రబాబు పాలన చూశాం. ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు చేసిన మోసాలను చూశాం. ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు చేసిన అన్యాయాలను చూశాం. ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు చేసిన మోసాల మధ్య, అన్యాయాల మధ్య ఇప్పుడు చంద్రబాబు ఏమంటున్నారంటే ఈ రాష్ట్ర ప్రజల భద్రతకు, భరోసాకు తాను భరోసా ఇస్తాడంట. ఐదు సంవత్సరాలు మోసం చేసిన తరువాత ఎన్నికలు వచ్చే సరికి రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇస్తాడంట. చంద్రబాబును మీ తరుఫున గట్టిగా నిలదీస్తున్నా.. 2014 ఎన్నికలు ముగిశాక ప్రమాణస్వీకారం చేస్తూ మొదటి రోజే మొదటి సంతకాలని కొన్ని ఫైళ్లపై సంతకాలు చేశారు. అవేంటో చదివి వినిపిస్తాను.. అవి అమలయ్యాయా లేదా మీరే చెప్పాలి.

మొదటి సంతకం రైతుల రుణమాఫీ చేస్తానన్నాడు.. నేను అడుగుతున్నా.. రుణమాఫీ అయ్యిందా చెప్పాలి. డ్వాక్రా రుణమాఫీ అని సంతకం చేశాడు, చేనేత రుణమాఫీ అని సంతకం చేశాడు. ప్రతి గ్రామానికి రూ. 2కే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ అన్నాడు. బెల్ట్‌షాపులు రద్దు అని సంతకం చేశాడు. ఐదు సంవత్సరాల పాలన తరువాత అడుగుతున్నా.. వీటిలో ఏ ఒక్కటైనా అమలు చేశాడా..? ఐదేళ్ల తరువాత ఈ ప్రశ్నలకు ప్రజల నుంచి లేదు అనే సమాధానం వస్తుంది. ప్రజల భవిష్యత్తు గురించి తాను భరోసా ఇస్తాడంట. ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించేవాడైతే.. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టేవాడా..? ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించేవాడైతే.. ప్యాకేజీల పేరుతో మోసం చేసేవాడా..? ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచన చేసేవాడే అయితే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి 23 మంది ఎమ్మెల్యేలను పట్టపగలే అవినీతి సొమ్ముతో ఒకొక్కరికి రూ. 20, రూ. 30 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసేవాడా..? ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచన చేసేవాడే అయితే కమీషన్ల కోసం కక్కుర్తిపడి కేంద్ర ప్రభుత్వం పోలవరం కడతానంటే కమీషన్ల కోసం కక్కుర్తి పడి నేనే కడతానని లాక్కునేవాడా..? ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచన చేసేవాడే అయితే ఇసుక నుంచి మట్టి దాకా.. మట్టి నుంచి బొగ్గుదాకా.. బొగ్గు నుంచి కరెంటు కొనుగోలు దాకా.. కరెంటు కొనుగోలు నుంచి రాజధాని భూముల దాకా.. రాజధాని భూముల నుంచి విశాఖపట్నం భూముల దాకా.. చివరకు దళితుల భూములు, గుడి భూములు దోచేసేవాడా అని అడుగుతున్నా.. 

ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచన చేసేవాడే అయితే 108 పరిస్థితి ఇంత దారుణంగా ఉండేదా..? 108 నంబర్‌కు ఫోన్‌ కొడితే కుయ్‌.. కుయ్‌ అంటూ రావాల్సిన అంబులెన్స్‌ వస్తుందో.. రాదో తెలియని పరిస్థితి. ప్రజల బాగోగుల గురించి ఆలోచన చేసేవాడే అయితే ఆరోగ్యశ్రీ నీరుగార్చేవాడా అని అడుగుతున్నా.. ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచన చేసేవాడే అయితే పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేసే పరిస్థితిలోకి వెళ్లిపోయారు. ఇంజనీరింగ్, డాక్టర్‌ చదివించాలన్నా.. ఆస్తులు అమ్ముకుంటే కానీ చదివించలేని దారుణమైన పరిస్థితికి వెళ్లిపోయారు. ప్రజల గురించి ఆలోచన చేసేవాడే అయితే.. రాష్ట్రంలో విద్యాలయాలు, ఆరోగ్య కేంద్రాలు అన్నీ తన బినామీల వశం చేస్తాడా అని అడుగుతున్నా.. రాష్ట్రంలో అక్షరాల 6 వేల స్కూళ్లను మూసివేసి నారాయణ స్కూళ్లు మాత్రమే నడిచేలా గవర్నమెంట్‌ స్కూళ్లను మూసివేసేవాడా..? రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచన చేసేవాడే అయితే రాష్ట్రంలో ఇవాళ చంద్రబాబు ప్రతి కుటుంబంలో ఉన్న అందరి ఫోన్‌ నంబర్లు, అందరి ఆధార్‌ కార్డులు డీటెయిల్స్, బ్యాంక్‌ అకౌంట్‌ డీటెయిల్స్, చివరకు మన ఇళ్లలో ఉన్న ఆడవాళ్ల ఫోన్‌ నంబర్లు జన్మభూమి కమిటీలకు ఇచ్చేవాడా.. ? 

రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచన చేసేవాడే అయితే 2014లో అక్షరాల రైతుల రుణాలు రూ. 87,600 కోట్లు 2018 సెప్టెంబర్‌కు వచ్చేసరికి అక్షరాల రూ. 1.37 లక్షల కోట్లకు ఎగబాకడం రైతులకు భరోసా ఇవ్వడమా అని అడుగుతున్నా.. డ్వాక్రా రుణాలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి రూ. 14,205 కోట్లు అయితే అవి 2018 సెప్టెంబర్‌ నాటికి అక్షరాల పొదుపు సంఘాల రుణాలు రూ. 25,500 కోట్లకు ఎగబాకాయంటే ఇదేనా అక్కచెల్లెమ్మలకు భరోసా ఇవ్వడం. ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇస్తానన్నాడు. ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి నిరుద్యోగికి రూ. 2 వేల భృతి ఇస్తానన్నాడు. ఐదేళ్లలో ప్రతి ఇంటికి ప్రతి నెల రూ. 2 వేల చెప్పున బాకీ పడ్డాడు. రూ. 1.20 లక్షలు ఎగ్గొట్టడం భరోసా ఇవ్వడమా..? అని అడుగుతున్నా. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మోసం చేయాలని ఆరాటంతో మేనిఫెస్టోను రిలీజ్‌ చేశాడు. ఎన్నికల ప్రణాళికలో 650 వాగ్దానాలు పెట్టి ప్రతి పేజీ ఒక్కో కులానికి కేటాయించి ఏయే కులాన్ని ఎలా మోసం చేయాలని పీహెచ్‌డీ చేయడమేనా భరోసా ఇవ్వడమని అడుగుతున్నా.. 

ఇంతటి దారుణమైన పరిస్థితుల మధ్య నా పాదయాత్ర జరిగింది. అక్షరాల 3648 కిలోమీటర్లు దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో నడవగలిగాను. రాష్ట్రంలో ప్రతి అంగుళం తిరుగుతూ మీ కష్టాలను, నష్టాలను చూశాను. ప్రతి కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలు విన్నాను. సాయం కోసం ఎదురుచూస్తున్నా.. ప్రతి కుటుంబానికి ఒక మాట ఇస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తుందని ఎదురుచూస్తూ మోసపోయి ఉన్న ప్రతి కుటుంబానికి ఈ వేదిక నుంచి మాటిస్తున్నా మీ సమస్యలను.. నేను విన్నాను.. మీ సమస్యలను నేను చూశాను.. నేనున్నానని మాటిస్తున్నా.. 

 నేను విన్నా...నేనున్నాను
రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. ఐదేళ్లు కరువు వచ్చినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న గాధలు విన్నాను. ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల బాధలు విన్నాను. వారి ఆవేదన చూశాను. పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ జరుగక..చదువుకునే పరిస్థితి లేక..చదువుల కోసం అప్పులపాలు అవుతూ..ఆత్మహత్యలు చేసుకుంటున్న బాధలు విన్నాను. చూశాను. 108 సకాలంలో రాక ప్రాణాలు కోల్పోతున్న వారి గాధలు విన్నాను. ఆరోగ్యశ్రీ సక్రమంగా అమలు కాక మంచానికే పరిమితమైన వారి బాధలు విన్నాను. బెల్టుషాపులు రద్దు చేయకపోగా..ప్రతి గ్రామంలోనూ మద్యం అమ్ముకునే స్థాయికి తెచ్చారు. ఆ అక్క చెల్లెమ్మలు పడుతున్న గాధలు విన్నాను. మన రాష్ట్రంలో ఎక్కడా కూడా ఉద్యోగాలు దొరక్క..చంద్రబాబు ఇస్తామన్న ఉద్యోగాలు ఇవ్వక ఆ పిల్లలు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాక పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. నీటి కోసం అలమటిస్తున్న గ్రామాలను చూశాను. పిల్లలను చదివించేందుకు అక్కచెల్లెమ్మలు పడుతున్న ఇబ్బందులు చూశాక..నేనున్నానని భరోసా కల్పిస్తున్నాను.

నవరత్నాలతో ప్రతి పేదవారికి మేలు జరుగుతుందని నమ్ముతున్నాను. ఈ నవరత్నాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లండి. చంద్రబాబు ఓట్ల కోసం మూటల కొద్ది డబ్బులు తరలిస్తున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు డబ్బులు పెడుతున్నారు. ప్రతి ఒక్కరిని కలవండి. ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లినప్పుడు వారికి చెప్పండి..అక్కా..చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇస్తున్న రూ.3వేలకు ఆశ పడవద్దు..అన్నా ముఖ్యమంత్రి అవుతారు. మన పిల్లలను బడికి పంపిస్తే ఏడాదికి రూ.15 వేలు  ఇస్తారని చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు..నెల రోజులు ఓపిక పట్టండి..మన పిల్లలు ఇంజినీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు వంటి చదువులు చదవాలంటే అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. మన పిల్లలను ఇంజినీర్లు, డాక్టర్లుగా చేస్తారు. ఎన్ని లక్షలు ఖర్చైనా అన్న భరిస్తారని ప్రతి ఒక్కరికి చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనను చూశాం. ఒక్కసారి అన్నకు అవకాశం ఇద్దాం. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తరువాత ప్రతి ఏటా మే  మాసంలో రైతుల చేతుల్లో రూ. 12500 ఇస్తారని చెప్పండి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీల వద్దకు వెళ్లి చెప్పండి..చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు..అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. వైయస్‌ఆర్‌ చేయూత పథకాన్ని తెస్తారు.

ప్రతి ఒక్క మహిళకు రూ.75 వేలు నలుగు దఫాలుగా ఇస్తారని చెప్పండి. పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పండి..అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం.. పొదుపు సంఘాల్లోని అప్పులన్నీ కూడా నాలుగు దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తారని చెప్పండి. ప్రతి అవ్వ, తాత వద్దకు వెళ్లి చెప్పండి. చంద్రబాబు మోసాలను నమ్మకండి అని చెప్పండి. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. మూడు నెలల క్రిందట పింఛన్‌ ఎంతిస్తారో ఆలోచించండి..ఎన్నికల కోసం ఫించన్‌ పెంచారు. అన్న రూ.2 వేలు  ఇస్తామంటే చంద్రబాబు ఇప్పుడు ఇస్తున్నారు. జగనన్న ముఖ్యమంత్రి అవుతున్నారు. పింఛన్లు రూ.3 వేలు ఇస్తారని చెప్పండి. నవరత్నాల్లో మనం చెప్పిన ప్రతి పథకాన్ని ప్రతి  ఇంటికి తీసుకెళ్లాలి. చంద్రబాబు అన్యాయాలను, మోసాలను ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి.

ఇవాళ మనం యుద్ధం చేస్తున్నది చంద్రబాబు ఒక్కరితోనే కాదు..ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో యుద్ధం చేస్తున్నాం. వీళ్లంతా కూడా రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద పెద్ద డ్రామాలు చేస్తారు. ఉన్నది లేనట్లుగా చేస్తారు. చూపిస్తారు. ఇవాళ ధర్మానికి..అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది. విశ్వసనీయత..విలువలు ఒక వైపు ఉంటే మరోవైపు మోసం ఉంది. ఇటువంటి పరిస్థితిలో జరుగుతున్న ఎన్నికల్లో రాయదుర్గం అభ్యర్థిగా కాపు రామచంద్రారెడ్డి నిలబడ్డారు. ఎంపీ అభ్యర్థిగా రంగయ్య నిలబడ్డారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను.మీ దీవెనలు, ఆశీస్సులు వైయస్‌ఆర్‌సీపీకి ఇవ్వండి..ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వైయస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. 
 
 

Back to Top