నాన్నే నాకు స్ఫూర్తి

బీసీ గర్జనలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

వెనుకబడిన కులాలు కాదు..మన జాతికి వెన్నుముక కులాలు

భారతీయ సంస్కృతి నిలబెట్టిన మహనీయులు బీసీలు 

119 హామీలిచ్చిన చంద్రబాబు ఒక్కటీ కూడా నెరవేర్చలేదు

ఐదేళ్లలో బీసీలకు రూ.18 వేల కోట్లు కూడా ఇవ్వలేదు

జగన్‌ చెప్పిన పథకాలను కాపీకొట్టడానికి చంద్రబాబు రెడీ

బీసీలు హైకోర్టు జడ్జిలు కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు

చంద్రబాబు చేసిన బీసీ డిక్లరేషన్‌కు దిక్కులేదు

వైయస్‌ఆర్‌ గురువు వెంకటప్ప ఓ బీసీ కులానికి చెందిన వ్యక్తి 

బీసీల స్థితిగతులపై అధ్యయన కమిటీ వేశాం

ప్రతి కులానికి ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం

ఎన్ని లక్షలు ఖర్చైనా ఉచితంగా చదివిస్తాం

45 ఏళ్లు నిండిన ప్రతి బీసీ మహిళకు వైయస్‌ఆర్‌ చేయూత కింద రూ.75 వేలు

తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత

బీసీల్లోని 139 కులాలకు విడివిడిగా ప్రత్యేక కార్పొరేషన్లు

బీసీల అభివృద్ధికి రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తాం

ఏలూరు: దివంగత ముఖ్యమంత్రి పేదల కోసం ఒక్క అడుగు ముందుకు వేస్తే..ఆయన కుమారుడిగా తాను రెండు అడుగులు ముందుకు వేస్తానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. నాన్నే నాకు స్ఫూర్తి అని ప్రకటించారు. బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, వారి సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర కంటే ముందుగానే బీసీ అధ్యయన కమిటీ ఏర్పాటు చేశామన్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చేకా ఏం చేస్తామన్నది ఈ సభలో బీసీ డిక్లరేషన్‌ను వైయస్‌ జగన్‌ ప్రకటించారు. బీసీ గర్జన సభలో వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..ఆయన మాటల్లోనే..   

ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన బలహీన వర్గాల అన్నదమ్ములను చూస్తుంటే.. అక్కచెల్లెమ్మలను, అవ్వతాతలను చూస్తుంటే నిజంగా ఈ రోజు కురుక్షేత్రం చివరి రోజు అన్నట్లుగా ఉంది మీ అందరి అప్యాయతలు చూస్తుంటే..ఐదేళ్ల చంద్రబాబు పాలనను చూశాం. ఈ పాలనను చూసిన తరువాత మార్పును కోరుతూ ఈ రోజు బీసీ గర్జన నిర్వహించుకుంటున్నాం. 14 నెలల పాటు దాదాపు పాదయాత్ర చేశాను. 3648 కిలోమీటర్లు రాష్ట్రంలోని ప్రతి మూలకు నడిచాను. పాదయాత్ర మొదలుకాకముందే మన పార్టీలోని సీనియర్‌ నాయకులతో బీసీ అధ్యాయన కమిటీ వేశాను. ఒక వైపు నేను పాదయాత్ర చేస్తుండగానే..మరోవైపు జంగా కృష్ణమూర్తి నేతృత్వంలో అధ్యాయన కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. ప్రతి జిల్లాలోనూ బీసీలకు సంబంధించి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు చేశాం. ఒక వైపు నేరుగా నా అంతకు నేనే బీసీల సమస్యలను దారి పొడవునా తెలుసుకున్నాను. మరోవైపు మన పార్టీ సీనియర్‌ నాయకులు రాష్ట్ర నలుమూలల తిరిగారు. వీలైనంత ఎక్కువ మందిని కలిశారు. సమస్యలు తెలుసుకున్నారు. అధ్యాయనం చేశారు. ఈ అధ్యాయన కమిటీ లోతుగా వెళ్లి సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేసింది. వాళ్లు నాకు నివేదికను ఇచ్చారు. పాదయాత్రలో చూశాను.

రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి..మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదవారి జీవితంలో వెలుగులు నింపాలని, ప్రతి బీసీ కుటుంబంలో చిరునవ్వులు చూడాలని ఈ రోజు బీసీ డిక్లరేషన్‌ ద్వారా మనం ఏం చేస్తామన్నది మీతో చెప్పేందుకు బీసీ గర్జన ఏర్పాటు చేశాం.బీసీలంటే బ్యాక్‌వర్డ క్లాస్‌లు కాదని, భారతదేశ కల్చర్‌ను వేల సంవత్సరాలుగా నిలబెట్టిన మహనీయులు. మీరు వెనుకబడ్డ కులాలు కాదు..మీరంతా మన జాతికి వెన్నుముక కులాలని గర్వంగా చెబుతున్నాను. తరతరాలుగా మనం వేసుకునే దుస్తుల నుంచి తినే అహారం వరకు. ఉపయోగించే పనిముట్టు, ఇళ్లు, నీరు తాగే గ్లాస్‌ నుంచి అన్నం తినే కంచం వరకు..బావి నుంచి ఇటుక వరకు మన బట్టలకు పట్టిన మకిలిని వదల్చడం దగ్గర  నుంచి వెంట్రుకలకు సంస్కారం తెలిపే వరకు వేలాది సంవత్సరాలుగా బీసీల పాత్ర ఎంత గొప్పదో వేరే చెప్పాల్సిన పనే లేదు. మనల్ని సృష్టించినందుకు దేవుడిని, మనల్ని నడిపించినందుకు బీసీ సోదరులకు ఎల్లప్పుడు రుణపడి ఉంటాను. భారతీయ నాగరికతలో కనిపించే శిల్పం..అగ్గిపెట్టెలోని చీరే..మంగలి సన్నాయి..ఏది చూసినా గొప్పతనమే..వారందరికి వందనం చేస్తూ..ఈ సభలో ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను..

నాగరికతకు నడకలు నేర్పిన మహనీయుల బతుకులు ఎలా ఉన్నాయో మనసుతో ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మనం ఏం చేయగలుగుతామన్నది మనసు పెట్టి ఆలోచించాలి. మన సమాజంలో  అనేక మంది ఈ రోజుకు కూడా వెనుకబడి ఉన్నారన్నది మనసుతో మనమంతా ఆలోచన చేయాలి. బడుగులు, బలహీనులు ఈ ప్రపంచంలో తలెత్తుకొని తిరగాలంటే ఉన్నతంగా చదువుకోవాలి. అధికారంలో పదువులు కావాలి..అందులో వాటా తీసుకోవాలి. గ్రామాల్లో ఇప్పటి తరం వారు చేసుకుంటున్న పనుల్లో లాభసాటి కావాలి. వచ్చే తరాన్ని గొప్పగా ప్రపంచానికి పరిచయం చేసే అడుగులు పడాలి. 3648 కిలోమీటర్ల పాదయాత్రలో నాకు వినిపించిన పేదల గుండెచప్పుడు..వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఏంచేస్తానన్నది చెబుతున్నాను. ఒక పేద కుటుంబం ఏం కోరుకుంటుందన్నది నవరత్నాలను రూపొందించాం. అదనంగా బీసీలకు వారి వారి వృత్తుల రీత్యా, ఇబ్బందుల దృçష్ట్యా అదనంగా ఏం చేయాలన్నది చెప్పేందుకే బీసీ గర్జన ఏర్పాటు చేశాం.
ప్రస్తుతం బీసీలు ఎలా బతుకుతున్నారు.

చంద్రబాబు బీసీలకు ఏం చేస్తున్నారో గుర్తుకు లె చ్చుకోవాలి. చంద్రబాబు హయాంలో బీసీల పరిస్థితి ఎలా ఉందో ఆలోచించాలి. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు బీసీ డిక్లరేషన్‌ చేశారు. 2012 జులై మాసంలో చంద్రబాబు బీసీ డిక్లరేషన్లో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. తాను చేసిన బీసీ డిక్లరేషన్‌కు దిక్కులేదు. 2014లోని టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు నవ్వుతూ ఫోటోకు ఫోజులిచ్చారు. బీసీ కులాలకు సంబంధించి ఈ బుక్కులో 119 హామీలు ఇచ్చారు. మచ్చుకకు ఆయన బీసీలకు ఇచ్చిన హామీల్లో..పది హామీలు ఇలా ఉన్నాయి..పేద పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, కాలేజీ విద్యార్థులకు ఐ ప్యాడ్‌ ఇస్తామన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యావిధానంలో మార్పులు. ఏడాదికి రూ.10 వేల కోట్లతో బడ్జెట్‌లో కేటాయిస్తాం. బీసీ సబ్‌ ప్లాన్‌ అమలుకు చట్టం చేస్తామని హామీ ఇచ్చారు.

ఎన్నికలు నెలలో ఉన్నాయంటే ఈయనకు చట్టాలు గుర్తుకు వస్తాయి. ఐదేళ్లలో చట్టాలు గుర్తుకురావు. రాష్ట్ర ప్రణాళిక వ్యయంలో ప్రతి ఏటా బీసీ ఉపకులాలకు 25 శాతం నిధులు కేటాయిస్తామన్నారు. బీసీలకు ఉన్న రిజర్వేషన్లు 33 శాతానికి పెంచుతారట. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని నింపితే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు స్థానం వస్తుంది. వీటిని భర్తీ చేసేందుకు చంద్రబాబుకు మనసు రాదు. బీసీలను చంద్రబాబు దగా చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఆధార్‌తో సంబంధం లేకుండా అమలు చేస్తారట. చేనేత కార్మికులకు వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధి అన్నారు. బడ్జెట్‌లో ప్రతి ఏటా రూ.10 వేలు కేటాయిస్తామన్నారు. ఎన్నికలు అయిపోయాయి..ఐదేళ్లు చంద్రబాబు పరిపాలన చేశారు. టీడీపీ మేనిఫెస్టోలో ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలో 119 హామీలు ఇచ్చి అందరి చెవ్వుల్లో పూలు పెట్టారు. మనల్ని మోసం చేసి గట్టేక్కారు.

మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఇవాళ బీసీ డిక్లరేషన్, ఎన్నికల ప్రణాళిక అంటున్నారు. ఇటువంటి వ్యక్తిని నమ్మగలమా?..ఏటా రూ.10 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో అక్షరాల రూ.50 వేల కోట్లు  బీసీల అభివృద్ధికి ఇస్తామన్నారు. ఈ ఐదేళ్లలో చంద్రబాబు ఇచ్చింది ఎంతో చూడండి. 2014–15లో చంద్రబాబు ఇచ్చింది రూ.1540 కోట్లు, ఖర్చు చేసింది రూ.200 కోట్లు, రెండో ఏటా రూ.4400 కోట్లు కేటాయించారు. మొత్తం కలిపితే రూ.18 వేల కోట్లు కూడా సరిగ్గా ఐదేళ్లలో ఇవ్వలేదు. చంద్రబాబు పాలనను గమనించమని అడుగుతున్నాను.

దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. నాన్నగారు పెట్టిన వందశాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఏ పేదపిల్లాడైనా తమ ఆస్తులు అమ్ముకోకుండా పెద్ద పెద్ద చదువులు చదివారు. ఈ రోజు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం నీరుగార్చుతున్నారు. ఇవాళ మన పిల్లలను ఇంజినీర్లుగా చదివించే పరిస్థితిలో ఉన్నామా? మన పిల్లలను పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో ఉన్నామా?  ఇంజినీరింగ్‌ పీజులు ఏడాదికి లక్షల్లో ఫీజులు ఉన్నాయి. చంద్రబాబు ముష్టి వేసినట్లు రూ.30 వేలు ఇస్తున్నారు. ఏడాదికి రూ.70 వేలు తమ పిల్లలను చదివించేందుకు అప్పులు చేస్తున్నారు. ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఇదే పెద్దమనిషి చంద్రబాబు పాలనలో అరకొరగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ఇస్తున్నారు. ఇందులో కూడా బకాయిలు పెట్టడం మొదలుపెట్టారు. 2014–15కు రూ.6 కోట్లు బకాయిలు ఉన్నాయి.

ఐదేళ్లలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.2200 కోట్లు ఉన్నాయి. ఒక్కసారి ఆలోచన చేయండి. చంద్రబాబు పాంప్లెట్‌ పేపర్‌ ఈనాడులో గుండెలు తరుక్కుపోయే విషయం..త్రిపుల్‌ ఐటీ కోర్స్‌ పూర్తి అయినా పట్టాలు తీసుకొని పరిస్థితి చూశాను. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల కారణంగా సర్టిఫికెట్లు  ఇవ్వడం లేదు. పేద పిల్లలు ఇవాళ అధ్వాన్నమైన పరిస్థితిలో ఉన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలో పీహెచ్‌డీ చేశారు. రాష్ట్ర పరిధిలో లేని అంశాలను తీసుకువచ్చారు. గాండ్లను బీసీల నుంచి ఎస్సీలుగా చేస్తామన్నారు. బీసీ డీ నుంచి బీసీ ఏలుగా చేస్తామన్నారు. వాల్మీకులను ఎస్టీలుగా చేస్తామన్నారు. మేదరులను ఎస్సీలుగా చేస్తామన్నారు. రజకులను ఎస్టీలుగా చేస్తామన్నారు. ప్రతి కులంలోనూ వాళ్ల వాళ్ల ఆకాంక్షలను రెచ్చగొట్టి, తాను చేయలేనివి చేస్తానని చెప్పి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడటం ధర్మమేనా? అని అడుగుతున్నాను.

ఇదే పెద్ద మనిషి ..ఐదేళ్లు అధికారంలో ఉండి బీసీలకు, పేదలకు కార్పొరేషన్లు పెట్టాలన్న ఆలోచన రాలేదు. కార్పొరేషన్‌ పెడతానని చివరి మూడు నెలల్లో ఎన్నికల్లో ఓట్ల కోసం అబద్ధాలు చెబుతున్నారు.  ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆ కార్పొరేషన్లకు తనకు సంబంధం లేని 6వ బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నాను. అరకొరగా రుణమాఫి చేస్తారు. ఎన్నికలప్పుడు మాత్రం పూర్తిగా రుణాలు మాఫి అన్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం మీ ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలంటారు. అధికారంలోకి వచ్చాక వడ్డీలకు కూడా రాని రుణమాఫి చేస్తున్నారు. నాలుగు, ఐదు విడతలకు సంబంధించి డబ్బులు ఇవ్వడం లేదు. వ్యవసాయమే ప్రధానమైన బీసీలకు అన్యాయం చేస్తున్నారు.  ఇప్పుడేమో అన్నదాత సుఖీభవ అంటున్నారు. తన హయాంలో రాని ఆరో బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నారు.

ఈ పెద్ద మనిషి చేస్తున్న మోసాలను గమనించమని కోరుతున్నాను. ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలు ఎంత మంది బీసీలకు ఇచ్చారని అడుగుతున్నాను. ఎంత మంది ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు ఇచ్చారని అడుగుతున్నాను. 2.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఏపీపీఎస్సీ ద్వారా నియమకాలు చేపడితే ఈ సామాజిక వర్గాలకు ఉద్యోగాలు వస్తాయి. చంద్రబాబు మాత్రం ఈ ఖాళీలను భర్తీ చేసే ఆలోచన చేయడం లేదు. చంద్రబాబును నిలదీయండి.  ఐదేళ్లుగా కేబినెట్‌ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భూ కేటాయింపులు చేస్తున్నారు. ఎంత మంది బీసీలకు భూ కేటాయింపులు చేశారో చంద్రబాబును నిలదీయండి. ఎన్ని లక్షల ఎకరాలు బీసీల భూములు లాక్కున్నావని, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల పొలాలు లాక్కున్నావని అడగండి. ఎంత సేపటికి చంద్రబాబు బీసీలే తమకు వెన్నెముక అంటుంటారు.

కానీ తమ పార్టీ బీసీలకు ఎన్నుముక అని మాత్రం అనడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు బీసీలను కరివేపాకులా వాడుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు ముఖ్యమంత్రుల గురించి చిన్న ఉదాహరణ చెబుతున్నాను. ఒక ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి. వైయస్‌ఆర్‌ గురువు వెంకటప్ప గారి గురించి చెబుతాను. ఆయన ఒక బీసీ కులం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయనది వడ్డెర కులం. మహానేత ఆ గురువును గుండెల్లో పెట్టుకున్నారు.  మా పులివెందులలో వెంకటప్ప పేరు మీద వెంకటప్ప మోమొరియల్‌ స్కూల్‌ ఏర్పాటు చేశారు. ఆ స్కూల్‌లో 2 వేల  మంది విద్యార్థులు ఉచితంగా ఇంగ్లీష్‌ మీడియం చదువులు చదువుకుంటున్నారు. ఆ స్కూల్‌ వ్యవహారాలు నా భార్య భారతి చూసుకుంటున్నారు. ఇది ఆ మహానేత మనస్తత్వం. చంద్రబాబు బీసీల వల్లే అధికారంలో ఉన్నానని చెప్పుకుంటున్నారు. ఏ బీసీ నాయకుడి పేరు మీద తన జేబులో నుంచి ఒక్కపైసా అయినా ఖర్చు పెట్టారా? ఇదే పెద్ద మనిషి నైజం. బీసీలకు రాజ్యాంగపరమైన పదవులు ఎప్పుడో ఒకసారి వస్తాయి.  వెనుకబడిన వారికి పదవులు రావాలంటే లక్ష మందిలో  ఒక్కరికి వస్తుంది. చేతనైతే సహాయం చేస్తారు.

చంద్రబాబు ఇద్దరు బీసీలకు హైకోర్టు జడ్జిలుగా  అవకాశం వస్తే..వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. జడ్జిలను అడ్డుకుంటూ రాసిన లేఖలు జస్టిస్‌ ఈశ్వరయ్య చంద్రబాబు నైజాన్ని చెప్పారు. చంద్రబాబుకు ఇది బీసీలపై ఉన్న ప్రేమ. ఈ రోజుకు తాను చేసింది తప్పు అని లెంపకాయలు వేసుకున్న పరిస్థితి లేదు.  నిజంగా బీసీల మీద ప్రేమ ఉన్న వ్యక్తి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. హామీ నెరవేర్చమని మత్స్యకారులు అడుగుతుంటే..తోలు తీస్తా ..ఖబడ్డార్‌ అని ఎవరైనా అంటారా? మీ ప్రాంతంలో రోడ్లు కూడా వేయమని చంద్రబాబు సిగ్గు లేకుండా బీసీలను తిడుతూ బెదిరించారు. నిరుడు జూన్‌లో నాయీ బ్రహ్మణులను బెదిరించారు. తోక జాడిస్తే కత్తరిస్తా అంటారు. ఈ మాదిరిగా భీ కేర్‌ ఫుల్‌ అంటూ చంద్రబాబు బెదిరిస్తున్నారు. ఇలాంటి వ్యక్తి బీసీలపై ప్రేమ అంటే నమ్ముతారా? చదువుకుంటున్న పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ఇచ్చి ఆదుకోలేని వ్యక్తి వేల కోట్లతో అభివృద్ధి చేశానని చెబితే నమ్ముతారా? మన పథకాలను చంద్రబాబు యథాతధంగా కాపీ కొడుతున్నారు. ఎన్నికల్లో కనీసం సొంతంగా పథకాలు ప్రవేశపెట్టాలన్న బు్రర, చిత్తశుద్ది లేదు. ఎన్నికలల్లో జగన్‌ చెప్పారా..అంటూ నిసిగ్గుగా కాపీ కొడుతున్నారు. పింఛన్లు, రైతు భరోసా, కులాల కార్పొరేషన్లు, ఉచిత విద్యుత్‌ అన్ని కూడా కాపీ కాదా? అని అడుగుతున్నాను. బీసీలు తిరగబడుతారని భయంలో భాగంగానే చంద్రబాబు చేస్తున్నారు. 

జగన్‌ అనే నేను..మీ అందరి బిడ్డను..
ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మోసాలను విన్నారు. రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జగన్‌ అనే నేను..మీ అందరి బిడ్డను..మీ కోసం ఏం చేస్తానో చెబుతున్నాను. చంద్రబాబు ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు కేటాయిస్తానని కేవలం రూ.18 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఏడాదికి రూ.3500 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. రేపు పొద్దున మనందరి ప్రభుత్వం వచ్చాక...బీసీ సంక్షేమానికి ప్రతి ఏటా రూ. 15 వేల కోట్లు ఖర్చు చేస్తానని చెబుతున్నాను. ఐదేళ్లలో రూ.75 వేల కోట్లు బీసీలకు ఖర్చు చేస్తానని హామీ ఇస్తున్నాను. 

 

తాజా వీడియోలు

Back to Top