మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కంపై సీఎం స‌మీక్ష‌

అమ‌రావ‌తి:  ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన మ‌రుస‌టి రోజే వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌రిపాల‌న‌పై దృష్టి సారించారు. ఇవాళ తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీసులో మధ్యాహ్న భోజన పథకంపై సమీక్ష నిర్వ‌హించారు. అక్షయపాత్ర ట్రస్ట్, ఉన్నతాధికారులతో సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి స‌మావేశం అయ్యారు.  మ‌ద్యాహ్న భోజ‌న ప‌థ‌కం నిర్వాహ‌ణ‌పై ఆరా తీశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు. ప్రతీ విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు మొగ్గు చూపేలా పాఠశాలలు తీర్చిదిద్దాలన్నారు. స్కూల్స్ లో అవసరం అయిన అన్ని మౌలిక సదుపాయాలు, వసతులు వెంటనే ఏర్పాటు చేయాల‌ని సూచించారు.  భోజనం, తాగునీరు, వసతులు అన్ని పకడ్బందీగా ఉండాల‌న్నారు.  మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో రాజీపడద్దు, విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు సౌకర్యవంతమైన వంటశాలలు నిర్మించాల‌ని ఆదేశించారు. ఇది ప్రాథమిక సమావేశం, మళ్ళీ సమావేశం లోపు పూర్తిస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసుకుని రావాల‌ని సూచించారు. 

Back to Top