అందరికీ ఉద్యోగాలు కల్పిస్తా.. నాది బాధ్య‌త‌

రెండేళ్లలో ప్రభుత్వ ఆస్పత్రులు, పాఠశాలలను ప్రక్షాళన చేస్తాం

వైయస్‌ జగన్‌కు బాగా లేకపోయినా ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం

తటస్థ ఓటర్ల భేటీలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ప్రకటనలు

అనంతపురం: నిరుద్యోగులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అనంతపురంలో సమర శంఖారావం సభ సందర్భంగా ముందుగా తటస్థ ఓటర్‌లతో వైయస్‌ జగన్‌ ముఖాముఖి అయ్యారు. ఈ మేరకు వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. తటస్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. కియా కార్ల పరిశ్రమ వల్ల ప్రయోజనం లేదని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. వాచ్‌మన్‌లు, స్వీపర్లకే నిరుద్యోగులను పరిమితం చేయడం దుర్మార్గమన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా చట్టం చేస్తామన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలను విస్తతంగా ఏర్పాటు చేస్తామన్నారు. నిరుద్యోగులకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. 

అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు కల్పిస్తాం.. రెండేళ్లు సమయం ఇస్తే పాఠశాలలు, ఆస్పత్రులు మెరుగుపరుస్తాం. తనకు ఆరోగ్యం బాగ లేకపోయినా ప్రభుత్వ ఆస్పత్రిలోకి వెళ్లే పరిస్థితి రావాలని వైయస్‌ జగన్‌ అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్యం చేయించుకుంటారు. ఎప్పుడు అలాంటి పరిస్థితులు వస్తాయో.. అప్పుడు ప్రభుత్వంపై నమ్మకం వస్తుందన్నారు. మన పార్టీ అధికారంలోకి రాగానే మొత్తం ప్రభుత్వ ఆస్పత్రులు, పాఠశాలలను ప్రక్షాళన చేస్తామన్నారు. 

 తటస్థులతో వైయ‌స్ జగన్ ముఖాముఖి 
 గౌస్, అనంతపురం ప్రజా సంరక్షణ సమితి ప్రతినిధి:
ఉపాధి కూలీలకు గిట్టుబాటు ధరలు దక్కటం లేదు.. కూలీ వేతనం పెంచాలి
 
వైయ‌స్ జ‌గ‌న్‌:  చంద్రబాబు సర్కార్ ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లను మూసివేస్తోంది. విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు ఇవ్వలేదు
వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే విద్య, వైద్య సదుపాయాలు పెంచుతాం. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం. ప్రభుత్వ ఆసుపత్రులన్నీ వృథా అన్నట్లు టీడీపీ ప్రభుత్వం చిత్రీకరిస్తోంది. లోకేష్ కనుసన్నల్లో నడిచే మెడాల్ సంస్థ కు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్తపరీక్ష  కాంట్రాక్టు పనులు అప్పగించి దోపిడీకి పాల్పడుతున్నారు. జాతీయ ఉపాధి హామీ కూలీల సమస్యలన్నీ పరిష్కరిస్తాం. 

మనోరంజన్ రెడ్డి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యదర్శి: తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ కేవలం బాలింతల రవాణాకే ఉపయోగపడుతున్నాయి. 
108 వాహనాలు నిర్వీర్యం. వైద్యుల కొరత రోగులను వేధిస్తోంది. 

వైయ‌స్ జ‌గ‌న్: కియా కార్ల పరిశ్రమ వల్ల మాకు ఎలాంటి ప్రయోజనం లేదని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. వాచ్ మెన్లు, స్వీపర్లకే అనంత నిరుద్యోగులను పరిమితం చేయటం దుర్మార్గం. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా చట్టం చేస్తాం.. స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేస్తాం. మన రాష్ట్ర నిరుద్యోగులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం.. అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం.  వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల లోపు వైద్య వ్యవస్థ లో సమూల ప్రక్షాళన చేస్తాం. నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లే స్థాయికి తీసుకెళ్తా. సర్కార్ దవాఖానాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి.. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం చేయించునేలా వ్యవస్థలో మార్పు తెస్తా
 పుల్లారెడ్డి, ఎస్కేయూనివర్సిటీ ప్రొఫెసర్:  ఏపీలో విశ్వవిద్యాలయాలను అధ్యాకుల కొరత వేధిస్తోంది. ఎన్నికల వేళ జారీ అవుతున్న జీవోలు చెల్లుబాటు కావు.. న్యాయస్థానాల్లో కేసులు వేయాలి.  తటస్థుల అభిప్రాయం తీసుకోవడం శుభపరిణామం. రాజకీయాల్లో విలువలు తేవాలన్న మీ సంకల్పం అభిందనీయం 

వైయ‌స్ జ‌గ‌న్‌: యూనివర్సిటీ ల్లో అధ్యాపకుల కొరత సిగ్గు చేటు. టీడీపీ ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీ లను ప్రోత్సహిస్తోంది. 20 కోట్ల బకాయిలు తనకే రావాలని సాక్షాత్తు మోహన్ బాబు వంటి వారు ఆవేదన చెందుతున్నారు.. ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే కాలేజీలు ఎలా నడుస్తాయి?

Back to Top