కొలువుదీరిన కొత్త కేబినెట్‌

నిరాడంబ‌రంగా మంత్రుల ప్ర‌మాణ స్వీకారం

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త కేబినెట్ కొలువుదీరింది. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కేబినెట్‌లో మంత్రుల ప్ర‌మాణ స్వీకారం కార్య‌క్ర‌మం స‌చివాల‌యంలో నిరాడంబ‌రంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా మంత్రుల‌తో గవర్నర్‌ నరసింహన్ ప్ర‌మాణం చేయించారు. మొద‌ట న‌ర్స‌న్న‌పేట ఎమ్మెల్యే ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌తో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. అనంత‌రం మంత్రుల‌కు గ‌వ‌ర్న‌ర్‌, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఆదిమూల‌పు సురేష్‌, మేక‌పాటి గౌతంరెడ్డిలు ఇంగ్లీష్‌లో ప్ర‌మాణం చేయ‌గా..మిగిలిన స‌భ్యులంతా తెలుగులో ప్ర‌మాణం చేశారు. చివ‌రిగా గ‌వ‌ర్న‌ర్‌, ముఖ్య‌మంత్రితో కొత్త మంత్రుల ఫోటో కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

ప్ర‌మాణ స్వీకారం చేసిన మంత్రులు
1. ధర్మాన కృష్ణదాస్‌ (నర్సన్నపేట)
2. బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి)
3. పాముల పుష్పశ్రీవాణి (కురుపాం)
4. అవంతి శ్రీనివాస్‌ (భీమిలి)
5. పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ (ఎమ్మెల్సీ)
6. కురసాల కన్నబాబు(కాకినాడ రూల్‌)
7. పినిపే విశ్వరూప్‌ (అమలాపురం)
8. ఆళ్ల నాని (ఏలూరు)
9. తానేటి వనిత (కొవ్వూరు)
10. చెరుకువాడ శ్రీరంగరాజు(ఆచంట)
11. వెల్లంపల్లి శ్రీనివాస్‌ (విజయవాడ పశ్చిమ)
12. కొడాలి నాని (గుడివాడ)
13. పేర్ని నాని(మచిలీపట్నం)
14. మేకతోటి సుచరిత (ప్రత్తిపాడు)
15. మోపిదేవి వెంకటరమణ
16. బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి(ఒంగోలు)
17. ఆదిమూలపు సురేష్ (ఎర్రగొండపాలెం)
18. మేక‌పాటి గౌతంరెడ్డి( ఆత్మ‌కూరు)
19. అనిల్ కుమార్ యాదవ్ (నెల్లూరు సిటీ)
20. నారాయణస్వామి (గంగాధర నెల్లూరు)
21. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు)
22. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (కుర్నూలు - డోన్)
23. గుమ్మనూరు జయరాం (ఆలూరు)
24. అంజాద్ భాషా (కడప)
25. మాల‌గుండ్ల‌ శంకర్ నారాయణ (పెనుకొండ) 

 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top