వాగ్ధానాల‌న్నీ నిజాయితీగానే చేద్దాం

మేనిఫెస్టో క‌మిటీ స‌మావేశంలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి
 

హైద‌రాబాద్‌:   చేసే ప్ర‌తి వాగ్ధానాన్ని నిజాయితీగానే చేద్దామ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. బుద‌వారం పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మేనిఫెస్టో క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. ఈ సమావేశంలో ప‌లు అంశాల‌పై క‌మిటీ స‌భ్యుల‌తో వైయ‌స్ జ‌గ‌న్ చ‌ర్చించారు.  ప్ర‌జ‌ల క‌ష్టాలు క‌ళ్లారా చూసి వాగ్ధానాలు ఇచ్చామ‌న్నారు. ఇందులో ఏ పార్టీతోనూ పోటీ ప‌డ‌టం లేద‌న్నారు.  మేనిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుంటామ‌న్నారు. పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటామ‌ని చెప్పారు. మేనిఫెస్టో సంక్షిప్తంగా అందరికీ అర్థమయ్యేలా ఉండాల‌ని సూచించారు. కౌలు రైతులకు న్యాయం చేసేలా మన పథకాలు ఉండాల‌ని పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top