దుష్ట పాల‌న‌ను మార్చేందుకు సలహాలు, సూచనలు ఇవ్వండి

తటస్థులతో వైయ‌స్‌ జగన్‌ సమావేశం

మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది

కడప :  రాష్ట్రంలో కొన‌సాగుతున్న చంద్ర‌బాబు దుష్ట పాల‌న‌ను మార్చేందుకు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మేధావులు, త‌ట‌స్థుల‌ను కోరారు. మిమ్మ‌ల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయ‌న‌ పేర్కొన్నారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  కొద్దిసేప‌టి క్రితం తటస్థులు, మేధావులు, సామాజిక కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించారు. కడపలో ఇవాళ మధ్యాహ్నం గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో తటస్థ ప్రభావితులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 

 మీ ప్రాంతాల్లో మీరంతా మంచి చేయడం చాలా సంతోషం. మిమ్మల్ని అందర్నీ కలవాలని మీకు లేఖలు రాశాను. ప్రజలకు మరింత మంచి చేసేలా సలహాలు, సూచనలు ఇవ్వండి. మీతో అనుబంధం ఈ ఒక్క సమావేశానికే పరిమితం చేయాలని అనుకోవడంలేదు. ఈ ప్రయాణం జీవితకాలం అంతా ఉండాలని కోరుకుంటున్నా. రాష్ట్రంలో కొనసాగుతున్న పాలన, ఈ పరిస్థితిని మార్చేందుకు సలహాలు, సూచనలు ఇవ్వండి’  అంటూ వైఎస్‌ జగన్‌ తటస్థులను కోరారు. అనంతరం బూత్‌ కమిటీ కన్వీనర్లు, పార్టీ శ్రేణులతో మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొంటారు.

త‌ట‌స్థులు, మేధావుల‌తో వైయ‌స్ జ‌గ‌న్ ముఖాముఖి వివ‌రాలు ఇలా..

 జగదీశ్వర్‌ రెడ్డి, న్యాయవాది: 2008లో వేయి పోస్టులతో మాత్రమే జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు వేశారు. 10 ఏళ్లుగా జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు భ‌ర్తీ చేయ‌డం లేదు. 5 లక్షలమంది పీజీ చేసిన వారు రాష్ట్రంలో ఉన్నారు. మొన్న మాత్రమే 240 పోస్టులు చంద్రబాబు తీశారు. ఇది ఎంత అన్యాయం. మీ ప్రభుత్వం వచ్చాక నోటిఫికేషన్లు ఇచ్చి పోస్టులు భర్తీ చేయాలి. 6 జిల్లాల్లో కరువు తీవ్రంగా ఉంది. యూనివర్శిటీలో విద్యార్థులకు ఫెలోషిప్‌లు రావడం లేదు . ఫీజు బకాయిలు రద్దు చేయాలని కోరుతున్నాను. పీహెచ్‌డీ చేసేవాళ్లకు రూ.5 వేలు, పీజీ చేసేవాళ్లకు రూ.3వేలు ఇవ్వాలని కోరుతున్నా. జూనియర్‌ లెక్చరర్ల పోస్టులు తీయకపోవడంవల్లే రాష్ట్రంలో కార్పొరేట్‌ విద్య వేళ్లూనుకుంది.

వైయ‌స్ జ‌గ‌న్: జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులే కాదు, ఏ ఉద్యోగాలు తీయడం లేదు. రాష్ట్రంలో 2.42వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఐదేళ్లలో ఎక్కడా ఉద్యోగాలను భర్తీచేయడంలేదు . 2.42లక్షల ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీచేస్తాం. ఉద్యోగాల భర్తీమీద పూర్తి డ్రైవ్‌ చేస్తాం. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామన్నదానిపై లెక్కలు కూడా చూపుతాం. గ్రామ సెక్రటేరియట్‌లలో 10 మంది అదే గ్రామానికి చెందిన వారికి ఉద్యోగాలు ఇస్తాం. లంచాలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వ పథకాలు ఇస్తాం. గ్రామ సెక్రటేరియట్‌ల ద్వారా లక్షా 40వేల ఉద్యోగాల ఇస్తాం. గ్రామ వాలంటీర్‌ నియామకాలు ద్వారా 50 కుటుంబాలకు ఒక ఉద్యోగం ఇస్తాం. వీరిని గ్రామ సెక్రటేరియట్‌కు అనుసంధానం చేస్తాం. నవరత్నాలతోపాటు ప్రభుత్వ కార్యక్రమాలను నేరుగా వీరి ద్వారా డోర్‌డెలివరీ చేస్తాం. పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు లోకల్‌ వారికే ఇస్తాం. దీనిపై మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టాన్ని తీసుకు వస్తాం. ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాల విప్లవం వస్తుంది.
 
 చిన్నారెడ్డి, రిటైర్డ్‌ విద్యా అధికారి: ఆరునెలలకు ఇచ్చే డీఏ కూడా సక్రమంగా ఇవ్వడంలేదు. 2018 నాటి మొదటి డీఏ ఫిబ్రవరిలో ఇచ్చారు. మళ్లీ దీన్ని ఏప్రిల్‌ నుంచి అమలు చేస్తారంట. దాన్ని కూడా మూడు విడతలుగా చేస్తారంట. 2018 లో పీఆర్సీ ఇవ్వాలి. ఐఆర్‌ కూడా ఇవ్వాలి. గతంలో వైయస్ఆర్ 22 శాతం ఇచ్చారు. సీపీఎస్‌ను తొలగించాలి. సీపీఎస్‌ తొలగింపుపై మీరు అనేక సార్లు హామీలు ఇచ్చారు. పాత పెన్షన్‌ విధానాన్ని తీసుకురావాలని కోరుతున్నాం. రైతులకు మీరు ప్రతి మేలో రూ.12500 ఇవ్వడం చాలా మంది కార్యక్రమం. 

వైయ‌స్ జ‌గ‌న్‌: ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా ఉన్నాను. అనేక సందర్భాల్లో ఈ సమస్యలపై నేను స్పందించాను. సీపీఎస్ మీద ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోగా సీపీఎస్‌ను తొలగిస్తాం. చేయాలన్న చిత్తశుద్ధి మనసులో ఉంది. కచ్చితంగా త్వరగా చేస్తాను. చంద్రబాబుకు చేయాలన్న చిత్తశుద్ది లేదు . అందుకే కమిటీల పేరిట కాలయాపన చేస్తాడు . రాష్ట్ర ప్రభుత్వాల్లో మనం ఉంటాం. నాన్నగారిని ఇవ్వాళ్టికీ ఉద్యోగస్థులు అభిమానిస్తారు. ఆయన పేరు నిలబెట్టేలా నేను ఉద్యోగులతో సానుకూలంగా ఉంటాను. ఉద్యోగస్తులు చల్లగా ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది. దీన్ని గట్టిగా నమ్మే మనిషిని నేను. 

 లక్ష్మి, చైతన్య మహిళా సొసైటీ: రైతుకు గుర్తింపు నంబరు ఉండాలి. ఏ పంట వేస్తున్నాడు, ఎంత పంట వస్తుంది అన్నదానిపై ఈజీగా తెలుస్తుంది. వచ్చే పంటను గ్రేడింగ్‌ చేయాలి. దీనివల్ల చాలావరకు దళారీ వ్యవస్థను నిర్మూలించవచ్చు. రైతులు మోసపోకుండా కూడా చూడవచ్చు. 
వైయస్‌ జగన్‌: మార్కెటింగ్‌ పరంగా రైతులు పడుతున్న సమస్యలపై పాదయాత్రలో అనేకసార్లు ప్రస్తావించాను. మనం ఏరకంగా చేయబోతున్నామో అనేకసార్లు చెప్పాం. దళారులు కారణంగా రైతులు నష్టపోతున్నారు. అదే పంట హెరిటేజ్‌ షాపులోకి వెళ్లేసరికి ధరలు భారీగా ఉంటున్నాయి. పలాస జీడిపప్పే దీనికి ఉదాహరణ . అక్కడకీ, మార్కెట్‌కీ రేటు తేడా రెట్టింపు ఉంటోంది. ముఖ్యమంత్రి అనే వ్యక్తి దళారీ వ్యవస్థను కట్టడి చేయాలి. మన ఖర్మ ఏంటంటే.. మన ముఖ్యమంత్రికి హెరిటేజ్‌ షాపులు ఉన్నాయి. తానే దళారీలకు కెప్టెన్‌ అయ్యాడు. నాన్న హయాంలో రైతులకు మంచి గిట్టుబాటు ధరలు వచ్చాయి. మరి చంద్రబాబు హయాంలో ఎందుకు రావడంలేదు? . చిత్తూరులో తోతాపురి రైతులకు ఇదే జరుగుతుంది. గల్లా, ఆదికేశవుల కుటుంబాలే.. రైతులనుంచి మాడిమిని కొంటున్నాయి. ఇక రైతుకు గిట్టుబాటు ధరలు ఎలా వస్తాయి?.

లక్ష్మి: ప్రతిరైతూ మద్దతు ధరను కోరుతున్నారు. నాన్నగారి టైంలో రుణాలకోసం ఎలాంటి రైతులకూ ఇబ్బంది వచ్చేది కాదు. కాని, మాక్కెట్‌ విషయానికి వచ్చేసరికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 

వైయస్‌ జగన్‌: అగ్రికల్చర్‌ కోర్సులు చేసిన వారికి గ్రామసెక్రటేరియట్‌లో ప్రాధాన్యత కల్పిస్తాం. అక్కడనుంచి వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడతాం. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని అనుసంధానం చేస్తాం. పంటను వేసేముందే ధరను నిర్ణయిస్తాం.
వ్యవసాయ రంగంలో నిపుణులైన వారికి ఈ ధరలస్థీకరణ నిధి వ్యవహారాలను అప్పగిస్తాం.

రాజగోపాల్‌ రెడ్డి, డిగ్రీకాలేజీ లెక్చరర్: సైనికుల ఎలా పనిచేస్తున్నారో మేం కూడా సమాజంకోసం అంతే చేస్తున్నాం. కాని ప్రభుత్వం మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తోంది. ఏపీ ప్రభుత్వం కాంట్రాక్ట్‌ వ్యవస్థను ప్రోత్సహిస్తోంది. కర్ణాటక సహా కొన్ని రాష్ట్రాల్లో కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తప్పకుండా రెగ్యులరైజ్‌ చేయాలని కోర్టులు చెప్తున్నాయి. యనమల రామకృష్ణుడు కమిటీ అంతా ఒక బోగస్‌లా నడుస్తోంది. సేవారంగం, సంక్షేమ పథకాలపై మీరు చాలా దృష్టిపెడుతున్నారు.  అభివృద్ధి కార్యక్రమాలపై మీ భవిష్యత్‌ ప్రణాళికలను వెల్లడించాలని కోరుతున్నా. 

 వైయస్‌ జగన్‌: కాంట్రాక్ట్‌ ఉద్యోగులపై చాలా పాజిటివ్‌గా ఉన్నాం. ఎక్కడ అవకాశం ఉంటే.. అక్కడ వారిని రెగ్యులరైజ్‌ చేస్తాం. వారి అర్హత, పనిచేసిన కాలాన్ని పరిగణలోకి తీసుకుంటాం. విద్యుత్, విద్యా రంగాలు కావొచ్చు మరే ఇతర రంగమైనా కొవచ్చు. మన ప్రభుత్వం మానవత్వం ఉన్న ప్రభుత్వం అభివృద్ధి అజెండాలో భాగంగానే అవినీతికి తావులేని వ్యవస్థలను తీసుకొస్తాం. పారదర్శకత విధానానికి పెద్దపీట వేస్తాం. గ్రామ సెక్రటేరియట్‌ సంక్షేమ పథకం కాదు . విప్తవాత్మక అభివృద్ధి కార్యక్రమాల్లో గ్రామసెక్రటేరియట్‌ కీలకంగా వ్యవహరిస్తాయి. 
పెన్షన్ల నుంచి మరుగు దొడ్ల వరకూ లంచాలు వసూలు చేస్తున్నారు. జన్మభూమి కమిటీల మాఫియా భరించలేని స్థాయికి చేరింది. ఈ వ్యవస్థలు ఇలా ఉంటే.. అభివృద్ధి సాధ్యం కాదు. 

 వైయస్‌ జగన్‌:  దేశం మొత్తం మనవైపు చూసేలా గ్రామ సెక్రటేటేరియట్‌ వ్యవస్థ. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తాం. దీనివల్ల పరిపాలనలో దృష్టి ఉంటుంది. సంతృప్తికర స్థాయిలో పథకాలను అమలు చేస్తాం. ఇప్పుడు వ్యవస్థలన్నవి సరిగ్గా పనిచేయడంలేదు.  

ప్రసాద్, వైమానికదళ ఉద్యోగి, ఎర్రగుంట్ల‌: మీ పథకాలను దేశంలోని ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా తప్పకుండా కాపీకొడతారు. రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగులపై దృష్టిపెట్టాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వంలో పనులకోసం మా సెలవులన్నీ అయిపోతున్నాయి. ఆర్మీ వాళ్లకి కాస్త ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నాను. ప్రతి గ్రామంలో ఉన్న రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి సేవలు తీసుకోవాలని కోరుతున్నాను. వికలాంగులకు గ్రామసెక్రటేరియట్‌లో అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించిన సైనికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నా.
మన రాష్ట్రంలో చాలామంది సైనికులు ఉన్నారు, వారికి భరోసా ఇవ్వాలని కోరుతున్నా.

 వైయస్‌ జగన్‌: పాదయాత్ర జరుగుతున్న సందర్భంలో చాలామంది ఎక్స్‌సర్వీస్‌మెన్‌ నన్ను కలిశారు. మీరు చెప్పించే వాళ్లంతా చెప్పారు . 
దేశం కోసం పోరాడుతున్నామని కేంద్రం గుర్తిస్తోంది కాని రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని చెప్పారు. రకరకాల పథకాలు మాకు అందడంలేదని చెప్పారు. రిటైర్‌ అయిన సైనిక ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక ధ్యాస పెడతాం. గ్రామ సెక్రటేరియట్‌ద్వారా ఇలాంటి సమస్యలు చాలావరకే సమసిపోతాయి. ముఖ్యమంత్రి అనే వ్యక్తి కొన్ని ప్రాజెక్టులను మానసపుత్రికలుగా చూసుకోవాలి. వాటి అమలు మీద తనదైన ముద్ర ఉండాలి. కచ్చితంగా బాగా చేశావు .. అని మళ్లీ అనిపించుకునేలా చేస్తా.

వెంకట్, పీహెచ్‌డీ: పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడంలేదు . మాకు స్కిల్స్‌ లేవని చెప్తున్నారు. మేం బాగా చదువుకున్నాం. ఇలాంటి స్కిల్స్‌ రోజుల వ్యవధిలో నేర్చుకోగలం. కచ్చితంగా నిరుద్యోగ సమస్య తీరుతుంది. 

 వైయస్‌ జగన్‌: పరిశ్రమల్లో తప్పనిసరిగా 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం తీసుకు వస్తాం. ఉన్న కంపెనీలకే కాకుండా కొత్తగా వచ్చే కంపెనీలన్నింటికీ వర్తిస్తుంది . నైపుణ్యాలను పెంచేలా కార్యాచరణ ప్రణాళికను తీసుకొస్తాం. పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో ఒక శిక్షణ కేంద్రాన్ని పెట్టేలా ఆలోచన చేస్తాం. ముందు ముందు రోజుల్లో రెండు మూడు నియోజకవర్గాలకు ఒకటి పెట్టేలా ఆలోచన చేస్తాం. ఇంజినీరింగ్‌ కాలేజీల్లో విద్య తీరును మారుస్తాం. చదువుకున్నప్పుడే ఉద్యోగాలు చేసేలా విద్యార్థులను తీర్చిదిద్దాలి. విద్యావ్యవస్థ రానురాను కుప్పకూలిపోతోంది . ఆ సమస్యలపై కచ్చితంగా దృష్టిపెడతాం . పరిశ్రమలకు అవసరమైన అన్ని నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం కల్పిస్తాం.

రమణారెడ్డి, ఉపాధ్యాయుడు : అభివృద్ధి చెందిన దేశాల్లో ఆరోగ్య, విద్యారంగాలకు మంచి ప్రాధాన్యత ఉంది. ఇప్పుడున్న హెల్త్‌కార్డుతో పెద్దగా ప్రయోజనం లేదు . ఏ సమస్య వచ్చినా.. ప్రభుత్వమే భరించేలా ఉండాలి. కేవలం రూ.5లక్షలు కాకుండా పూర్తిగా చెల్లించేలా ఉండాలి. 
ప్రజలు వెనుకబడ్డానికి కారణం వారి అప్పులే. నారాయణ, చైతన్య కాలేజీలకు లక్షల్లో ఫీజులు కట్టాలి. దీనివల్లే చాలామంది రైతులు అప్పుల పాలువుతున్నారు. 

 వైయస్‌ జగన్‌: చదువులు, అనారోగ్యం వల్లే మనిషి అప్పులు పాలు అవుతున్నాడు. అందుకే నాన్నగారు దేశంలో ఎవ్వరూ చేయని విధంగా ఫీజు రియింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ తీసుకు వచ్చారు. నాన్నగారు ఆరోజుల్లో ఈరెండు పథకాలను తన మానసపుత్రికల్లా చూసుకున్నారు. తర్వాత ఆ దృష్టి కొరవడింది. ఇప్పుడు చంద్రబాబు ఆ పథకాలను నీరుగారుస్తున్నారు .కేవలం పేరుకు మాత్రమే ఉద్యోగులకు హెల్త్‌కార్డులు ఇచ్చారు. దీనికి అర్థం లేకుండా పోయింది. మన ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీపై ప్రత్యేక దృష్టి. ప్రభుత్వ ఉద్యోగాలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకు వస్తాం. వేయి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తాం.

రమణారెడ్డి: ఎవ్వరూ కూడా ప్రభుత్వ స్కూళ్లకు పోవడంలేదు, ప్రభుత్వాసుపత్రులకు పోవడంలేదు, ప్రభుత్వ బస్సు ఎక్కడంలేదు. 
మీరు మార్చాలన్నా.

 వైయస్‌ జగన్‌: మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్టు. కచ్చితంగా విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తా. మోడల్‌ స్కూళ్లలో పనిచేస్తున్నవారికి జీతాలు ఇవ్వడంలేదు . ప్రభుత్వానికి ఎక్కడా తపన కనిపించడంలేదు. అవసరాన్ని బట్టి స్కూళ్ల సంఖ్యను పెంచుతాం. 
అన్ని పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యంలో బోధన చేస్తాం. ఇప్పటి స్కూళ్ల ఫొటోలు తీస్తాం, తర్వాత 2 ఏళ్ల తర్వాత మళ్లీ వాటికి ఫొటోలు తీస్తాం. కచ్చితంగా మార్పులు తీసుకు వస్తాం. ప్రభుత్వ ఆస్పత్రులను కూడా ఇలాగే మారుస్తాం. ఈరెండు కూడా చిత్తశుద్దితో చేస్తాం. ప్రజలెవ్వరికీ సంకోచాలు లేకుండా వీటిని అభివృద్ది చేస్తాం. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల ఫీజులను కచ్చితంగా నియంత్రిస్తాం. విద్యను వ్యాపారానికి వాడకూడదని చట్టం చెప్తోంది. కాని ఈ చట్టం నారాయణకు వర్తించదు, చైతన్యకు వర్తించదు. విద్యా హక్కు చట్టం కింద 25శాతం సీట్లను పేదలకు ఇవ్వాలి. కాని ఎవ్వరికీ పట్టదు . నారాయణ, చైతన్య సంస్థలు చంద్రబాబు బినామీ సంస్థలు కాబట్టి చట్టాలను ఉల్లంఘిస్తున్నా పట్టించుకోరు.
విద్య అందరికీ అందుబాటులో ఉంచుతాం. 

వెంకట్రామిరెడ్డి, ప్రధాన ఉపాధ్యాయుడు: మధ్యాహ్న భోజనంలో మంచి బియ్యం ఇవ్వగలరు. యూనిఫారమ్స్, పాఠ్యపుస్తకాలు సకాలానికే ఇవ్వాలి. ఇప్పటికీ డిసెంబర్‌ వస్తేగానీ పుస్తకాలు ఇవ్వడంలేదు. 

 వైయస్‌ జగన్‌: పాదయాత్రలో కూడా దీనిపై పలుమార్లు మాట్లాడాను . మార్చి, ఏప్రిల్‌ నాటికి పుస్తకాలు, యూనిఫారమ్స్‌ రావాలి. సెప్టెంబరు, అక్టోబరు అయితేగానీ పుస్తకాలు రావడంలేదు. కావాలనే చంద్రబాబుగారు ప్రభుత్వ స్కూళ్లే వేస్ట్‌ అని మనచేతనే అనిపించాలని చేస్తున్నారు.అప్పుడే నారాయణ, చైతన్యలకు ప్రజలు వెళ్తారని ఆయన అభిప్రాయం. 23వేల టీచర్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే... వాటిని భర్తీచేయలేదు. స్కూళ్లలో నాణ్యతను పెంచడం లేదు. మధ్యాహ్న  భోజన సరుకుల బిల్లులు ఆరు నెలలైనా చెల్లించడంలేదు. ప్రభుత్వ పంపిణీ చేసే బియ్యం క్వాలిటీ కచ్చితంగా మారాలి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటాం.

 లెక్కల జోగిరమేష్‌: రాష్ట్రంలో 15వేల ప్రైవేటు స్కూల్స్‌ ఉన్నాయి. ఈ స్కూళ్లలో చాలావరకూ ఇబ్బందులతో నడుస్తున్నాయి. కాని ప్రభుత్వానికి నివేదించినా పట్టించుకోవడంలేదు . అమ్మ ఒడి కార్యక్రమాన్ని మాకూ వర్తింపు చేయండి. అభివృద్ధి వికేంద్రీకరణ జరగడంలేదు. కడపజిల్లాలో స్టీల్‌ ఫ్యాక్టరీ శంకుస్థాపన ఒక మొక్కుబడి చర్య:. కేంద్రం సహాయం లేకుండా ఈ ఫ్యాక్టరీ సాధ్యం కాదు. మీరు అధికారంలోకి రాగానే ఈ స్టీల్‌ ఫ్యాక్టరీని నిర్మించాలి. మూతబడ్డ చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలి. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు హెల్త్‌ కార్డులు ఇవ్వాలి. 

 వైయస్‌ జగన్‌: ఇవన్నీ చాలా ముఖ్యమైన అంశాలు. గతంలో పాదయాత్ర సందర్భంగా ఈ అంశాలను అడ్రస్‌ చేస్తా. ప్రైవేటు స్కూళ్లను వర్గీకరణ చేయాలి. కార్పొరేట్‌ స్కూళ్లను, స్వయం ఉపాధికోసం నడిపే స్కూళ్లను వర్గీకరించాలి. చిన్న స్కూళ్లను ప్రోత్సహిస్తాం. వారికి కరెంటు ఛార్జీల్లో కూడా రాయితీలు కల్పిస్తాం. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ బాధ్యత నాది. అధికారంలోకి వచ్చిన 3–6 నెలల్లో పనులు ప్రారంభిస్తాం. 3 ఏళ్లలో స్టీల్‌ ఫ్యాక్టరీ పనులు పూర్తిచేస్తాం. 

నూరి, వైద్యురాలు: ఆరోగ్యరంగాన్ని మరింత బలోపేతం చేయాలి. కనీసం 5వేలమందికి ఒక డాక్టర్‌ను నియమించాలి. పీహెచ్‌సీల్లో ఏర్పాట్లు సరిగ్గా లేవు. ఉన్న పీహెచ్‌సీల్లో కూడా డాక్టర్లు లేరు

వైయస్‌ జగన్: పాదయాత్ర దారిపొడవునా ఇదే కనిపించింది. ప్రభుత్వం పోస్టులను భర్తీ చేయడంలేదు. ప్రభుత్వ ఆస్పత్రులను నిర్వీర్యం  చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. మనం వచ్చాక  ప్రతి పీహెచ్‌సీలో నాణ్యత పెంచుతాం. సిబ్బంది ఉండేలా కచ్చితంగా భర్తీ చేస్తాం. 

తాజా వీడియోలు

Back to Top