జ‌ర్నలిస్ట్ మృతికి సీఎం వైయస్‌ జ‌గ‌న్ సంతాపం

 
 అమ‌రావ‌తి: అమెరికాలో క‌రోనా బారిన ప‌డిన‌ ప్రముఖ జర్నలిస్ట్‌ కంచిభొట్ల‌ బ్రహ్మానందం మ‌ర‌ణించ‌డంపై  ముఖ్యమంత్రి వైయస్‌ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఏపీకి  చెందిన కంచిభొట్ల పాత్రికేయునిగా జీవితం ప్రారంభించారు. అనంత‌రం ఆంగ్ల వార్తా సంస్థ యూఎన్ఐలో ప‌ని చేశారు. త‌ర్వాత అక్కడే న్యూయార్క్‌లో స్థిర‌ప‌డ్డారు. జర్నలిజంలో కొన‌సాగుతూ పేరు ప్రఖ్యాతలు గ‌డించారు. కొద్ది రోజుల క్రితం అత‌నికి క‌రోనా సోకింది. దీంతో అత‌నికి ఆసుప‌త్రిలో చికిత్స అందిస్తుండ‌గా.. సోమవారం మృతి చెందిన‌ట్లు న్యూయార్క్ వైద్యులు ధ్రువీక‌రించారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top