విశాఖ‌కు బ‌య‌లుదేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

సీఎం హోదాలో తొలిసారి విశాఖకు వైయస్‌ జగన్‌

విశాఖ ఎయిర్‌పోర్టులో అదనపు భద్రత

విశాఖపట్నం : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ‌కు బయలుదేరారు. అక్కడ నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం నేరుగా శారద పీఠానికి వెళ్లి.. స్వరూపానందదేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకుంటారు. తిరిగి గన్నవరం విమానాశ్రయానికి, అక్కడ నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్తారు. సీఎం వైఎస్‌ జగన్‌ రానుండటంతో ఏ.డీ జంక్షన్‌ పరిసర ప్రాంతాల్లో అభిమానులు భారీగా ఆయన స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం హోదాలో వైఎస్‌ జగన్‌ తొలిసారి విశాఖ వస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో విశాఖ ఎయిర్‌పోర్టులో అదనపు భద్రతా చర్యలు చేపట్టారు. సాధారణ ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా మరోమార్గం గుండా సీఎం రాకకు ఎయిర్‌పోర్టు అధికారులు ఏర్పాట్లు చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top