ఉగ్రవాదుల దాడి పిరికిపందల చర్య

పుల్వామా దాడిని ఖండించిన వైయ‌స్‌ జగన్ 
 

హైదరాబాద్‌: జమ్మూకశ్మీర్‌ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు,  ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల దాడిని పిరికిపందల చర్యగా పేర్కొన్నారు. వీర సైనికులకు సంఘీభావం ప్రకటించారు. ముష్కరులు సాగించిన మారణకాండలో అమరులైన సైని​కుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని వైయ‌స్‌ జగన్‌ ఆకాంక్షించారు.

పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 43 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని తామే చేశామని పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌ ప్రకటించుకుంది

Back to Top