పాశ్వాన్‌ మృతి పట్ల సీఎం వైయ‌స్ జగన్‌ సంతాపం

తాడేప‌ల్లి : కేంద్ర మంత్రి రామ్‌ విలాస్ పాశ్వాన్‌ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంతో ఉన్న దళిత నాయకుడు, లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌ఎస్‌పి) చీఫ్ అణగారిన వర్గాలవారిపట్ల గొంతుకగా నిలిచారన్నారు. ఆయన మృతి దేశ రాజకీయాలలో తీరని లోటుగా మిగిలిపోనుందన్నారు.ఈ సందర్భంగా పాశ్వాన్‌ కుటుంబసభ్యులకు తన ప్రగాడ సానుభూతి ప్రకటించారు. అలాగే వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి కూడా పాశ్వాన్ మృతికి సంతాపం ప్ర‌క‌టించారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతిని తెలిపారు.

Back to Top