పీవీ సింధుకు సీఎం వైయస్‌ జగన్‌ అభినందనలు

అమరావతి: ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌లో విజయకేతనం ఎగురవేసిన తెలుగు తేజం పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. స్విట్జర్లాండ్‌ లోని బాసెల్‌ లో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌లో సింధు విజేతగా అవతరించింది. ఇవాళ జరిగిన ఫైనల్లో జపాన్‌ అమ్మాయి నజోమీ ఒకుహరపై వరుస గేముల్లో గెలిచింది. కేవలం 38 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌ లో సింధు 21–7, 21–7తో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌ లో టైటిల్‌ నెగ్గిన తొలి భారత షట్లర్‌ గా రికార్డు పుటల్లో స్థానం సంపాదించడం పట్ల వైయస్‌ జగన్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం తెలుగు ప్రజల విజయంగా అభివర్ణించారు.  
 

Back to Top