టీడీపీ అరాచ‌కాలు, హ‌త్య‌ల‌పై గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు

రాజ్‌భ‌వ‌న్‌ను గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన వైయ‌స్ జ‌గ‌న్ 

ఏపీలో క్షీణించిన శాంతిభ‌ద్ర‌త‌ల అంశంపై గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు

విజ‌య‌వాడ‌:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో టీడీపీ అరాచ‌కాలు, హ‌త్య‌ల‌పై వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్‌కు ఫిర్యాదు చేశారు. కొద్దిసేప‌టి క్రితం రాజ్‌భవన్‌కు వెళ్లిన వైయస్‌ జగన్‌..గవర్నర్ అబ్ధుల్‌ నజీర్‌తో భేటీ అయ్యారు. 

రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి కొనసాగుతున్న అరాచక పాలన, చేస్తున్న హత్యలు, దాడులు, విధ్వంసాలను వైయస్‌ జగన్ రాష్ట్ర గవర్నర్‌కు వివరించారు.

వినుకొండలో పార్టీ కార్యకర్తను అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపడం, ఆ మర్నాడే పుంగనూరులో ఎంపీ మిధున్‌రెడ్డిపై రాళ్ల దాడి, ఆయన వాహనాలు ధ్వంసం చేయడం, మాజీ ఎంపీ రెడ్డప్ప కారును దహనం చేయడం సహా, ఈ 45 రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న విధ్వంసాలన్నింటి సాక్ష్యాలు, వీడియోలను  వైయస్‌ జగన్ గవర్నర్ అబ్దుల్‌ నజీర్‌కు అందజేశారు. 

Back to Top