కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్‌ భేటీ

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అక్కడ నుంచి ప్రగతి భవన్‌ చేరుకుని తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌ కుమార్‌ ఈ భేటీలో పాల్గొన్నారు.

Back to Top