చెడుపై మంచి సాధించే విజయమే జన్మాష్టమి 

రాష్ట్ర ప్రజలకు సీఎం వైయస్‌ జగన్‌ జన్మాష్టమి శుభాకాంక్షలు 
 

అమరావతి : శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించే విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా ప్రజలంతా జన్మాష్టమి వేడుకలు జరుపుకొంటారని తెలిపారు. విష్ణు భగవానుడి అవతారమైన శ్రీకృష్ణ పరమాత్ముని జన్మాష్టమి సందర్భంగా ప్రజల జీవితాల్లో సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.  

Back to Top