బాబు చర్మం మందమెక్కింది

అనవసరంగా ధర్నాలు చేసి చదువులు చెడగొట్టుకోకండి

మన ప్రభుత్వం రాగానే హార్టికల్చర్‌ విద్యార్థులకు ఉద్యోగాలు

గ్రామ సెక్రటేరియట్‌ ద్వారా 1.50 లక్షల ఉద్యోగాల భర్తీ

హార్టికల్చర్‌ విద్యార్థులకు హామీ ఇచ్చిన ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌

వైయస్‌ఆర్‌ జిల్లా: మనందరి ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రామ సెక్రటేరియట్‌లో ఉద్యోగాలు కల్పిస్తామని హార్టికల్చర్‌ విద్యార్థులకు వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. రైల్వేకూడురులోని హార్టికల్చర్‌ యూనివర్సిటీ ఎదుట విద్యార్థులు చేస్తున్న నిరసనలో వైయస్‌ జగన్‌ పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యలు విన్నారు. హార్టికల్చర్‌లో కొన్నేళ్లుగా ఉద్యోగాల నోటిఫికేషన్లను ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జననేత స్పందిస్తూ.. ప్రజలందరి దీవెనలతో, మీ అందరి ఆశీస్సులతో ఏప్రిల్‌లో మనందరి ప్రభుత్వం వస్తుంది. మనం వచ్చిన వెంటనే గ్రామ సెక్రటేరియట్‌ను తీసుకొస్తాం. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో క్షేత్రస్థాయిలో గ్రామ సచివాలయం కార్యక్రమాన్ని అమలు చేస్తాం. గ్రామ సెక్రటేరియట్‌లో ఆ గ్రామానికి సంబంధించిన రైతులకు సూచనలు ఇచ్చే కార్యక్రమం చేయాలంటే టెక్నికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న అగ్రికల్చర్, హార్టికల్చర్‌ విద్యార్థుల సేవలు అవసరం. గ్రామ సెక్రటేరియట్‌లో మీకు అధిక ప్రాధాన్యం ఇస్తాం. కచ్చితంగా మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయి. రాబోయే రోజుల్లో మీ సేవలను పూర్తిగా ఉపయోగించుకుంటాం. రైతులు బాగుపడేలా చేస్తాం. 

చంద్రబాబుకు చర్మం మందమెక్కింది. ధర్నాలు చేసినా లాభం లేదు. అనవసరంగా చదువులు చెడగొట్టుకోవద్దు. జీవితాలు చెడగొట్టుకోకండి. చంద్రబాబు జీఓ ఇవ్వలేదని బాధపడడం ఎందుకు. మన ప్రభుత్వం వచ్చాక గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తాం. గ్రామ సెక్రటేరియట్‌ ద్వారా 1.50 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వైయస్‌ జగన్‌ హార్టికల్చర్‌ విద్యార్థులకు భరోసా ఇచ్చారు. జననేత హామీతో విద్యార్థులంతా హర్షం వ్యక్తం చేశారు. 

తాజా వీడియోలు

Back to Top