సచివాలయంలోకి సీఎం వైయస్‌ జగన్‌

ముఖ్యమంత్రి ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు

ఘనస్వాగతం పలికిన ఉద్యోగులు

వెలగపూడి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయంలో అడుగుపెట్టారు. సచివాలయం తొలి బ్లాక్‌లోని మొదటి అంతస్తులో గల సీఎం కార్యాలయంలోకి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తొలిసారి ప్రవేశించారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి కాన్వాయ్‌లో బయల్దేరిన ముఖ్యమంత్రి సచివాలయం చేరుకున్నారు. సచివాలయం ఉద్యోగులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. ఉదయం 8:39 గంటలకు తొలిసారిగా తన ఛాంపర్‌లోకి అడుగుపెట్టిన సీఎం వైయస్‌ జగన్‌ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితులు ఆశీర్వాదం తీసుకున్నారు. 9 గంటలకు సచివాలయం ఉద్యోగులు సీఎంను సత్కరించనున్నారు. అదే విధంగా 10 గంటలకు అన్ని శాఖ సెక్రటరీలు, హెచ్‌ఓడీలతో ముఖ్యమంత్రి తొలిసమావేశం నిర్వహించనున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top