సీఎంగా తొలిసారి శాసనసభలోకి వైయ‌స్ జ‌గ‌న్‌

ఘ‌న స్వాగ‌తం ప‌లికిన ఎమ్మెల్యేలు, అధికారులు
 

 అమ‌రావ‌తి:  అశేష ప్రజాభిమానంతో తిరుగులేని జననేతగా గుర్తింపు పొందిన వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి శాసనసభలో బుధవారం అడుగుపెట్టారు.  ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు పార్టీ ఎమ్మెల్యేలు, అధికారులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అద్వితీయమైన ప్రజాదరణ ఉన్న నేత సభా నాయకుడి స్థానాన్ని అధిష్టించడం రాష్ట్ర చరిత్రలో ఇది మూడోసారి. గతంలో ప్రజా ముఖ్యమంత్రులుగా ఎన్టీ రామారావు, వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి సభా నాయకులుగా రాష్ట్ర శాసనసభకు వన్నె తెచ్చారు. మళ్లీ కొత్త చరిత్రను లిఖిస్తూ వైయ‌స్‌ జగన్‌ అద్వితీయమైన ప్రజాదారణతో పార్టీని విజయపథంలో నడిపించి ప్రజా ముఖ్యమంత్రిగా శాసనసభలో సభానాయకుడి స్థానాన్ని అలంకరించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top