నేటి ఎన్నిక‌ల ప్ర‌చారం షెడ్యూల్‌

గూడూరు, గిద్దలూరు, దర్శి, మైలవరంలో వైయ‌స్ జ‌గ‌న్ ఎన్నికల ప్రచారం

  హైదరాబాద్‌: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం మూడు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు గూడూరు (నెల్లూరు జిల్లా), 11.30 గంటలకు గిద్దలూరు (ప్రకాశం జిల్లా), మధ్యాహ్నం 1.30 గంటలకు దర్శి, 3.30 గంటలకు మైలవరం (కృష్ణా జిల్లా)లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో వైయ‌స్‌ జగన్‌ పాల్గొని ప్రసంగిస్తా రు. 

నేడు విజయమ్మ, షర్మిల పర్యటన ఇలా..
  అమరావతి: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయ‌స్‌ విజయమ్మ ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇచ్ఛాపురం ఆ తరువాత నరసన్నపేట, ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో విజయమ్మ పాల్గొంటారు. 

గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో షర్మిల ప్రచారం..
వైయ‌స్ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైయ‌స్‌ షర్మిల ఆదివారం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో  ప్రచారం చేయనున్నారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు, నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో, ప్రకాశం జిల్లా అద్దంకి, చీరాల నియోజకవర్గాల్లో షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 

Back to Top