రేపు పార్వ‌తీపురంలో వైయ‌స్ జ‌గ‌న్ రోడ్‌షో

విజయనగరం: వైయ‌స్ఆర్‌సీపీ అధినేత  వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండోసారి జిల్లాకు వస్తున్నారు. ఈ నెల 27న పార్వతీపురం పట్టణంలో రోడ్‌షో నిర్వహించి, ప్రచార సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ నెల 17న నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ సభ నుంచి జిల్లాలో ఎన్నికల ప్రచారానికి జగన్‌ శ్రీకారం చుట్టిన విషయం విదితమే. మరోసారి బుధవారం ఉదయం 9.30 గంటలకు జగన్‌ పార్వతీపురం చేరుకుంటారని పార్టీ జిల్లా రాజకీ య వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీని వాసరావు తెలిపారు. తొలి పర్యటనకు ముం దే జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీ  అభ్యర్థుల జాబి తాను జగన్‌ ప్రకటించారు. వారు ఇప్పుడు ప్రచారంలో దూసుకుపోతున్నారు. రెట్టించి న ఉత్సాహంతో అధినేత సభకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ నేతలు, శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.  

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top