అక్కచెల్లెమ్మలపై చేయి వేసిన వ్యక్తి బాధపడేలా చేస్తా

లా అండ్‌ ఆర్డర్‌ను పటిష్ట పరుస్తాం

ప్రభుత్వం లాక్కున్న ఎడవల్లి రైతుల భూములు తిరిగి అందిస్తా

ఇళ్లపై ఉన్న రూ. 3 లక్షల రుణాన్ని మాఫీ చేస్తా

పత్తిపాటి పత్తి స్కాంపై విచారణ జరిపిస్తా

మహిళలను లక్షాధికారులను చేయాలనే నాన్నగారి కల నెరవేరుస్తా

చిలకలూరిపేటను గెలిపించండి రాజశేఖరన్నను మంత్రిని చేస్తా

పాలన చూపించి ఓట్లు అడిగితే చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావు

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకే యాక్టర్‌ పాట్నర్‌ని నిలబెట్టారు

మా చిన్నాన్నను బాబు చంపించినప్పుడు కుట్ర క్లైమాక్స్‌కు వచ్చింది

హత్య చేయించకపోతే సీబీఐ ఎంక్వరీకి ఎందుకు వెనకాడుతున్నావ్‌ బాబూ 

చిలకలూరిపేట బహిరంగ సభలో వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

చిలకలూరిపేట: రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలపై అఘాయిత్యాలు మితిమీరిపోతున్నాయని, లా అండ్‌ ఆర్డర్‌ పనిచేయడం లేదు. దేవుడి దయ, మీ అందరి ఆశీర్వాదంతో మన అందరి ప్రభుత్వం వచ్చిన తరువాత అక్కచెల్లెమ్మలపై చేయి వేసిన మనిషి బాధపడేలా చేస్తానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలకు రక్షణ లేదని, ఇసుక మాఫియాకు అడ్డొచ్చిన ఎమ్మార్వోపై దాడి, చదువు కోసం వెళ్లిన బాలిక రిషితేశ్వ‌రిని పొట్టనబెట్టుకున్నారు. అప్పుల ఇచ్చి తిరిగి ఇవ్వని మహిళల మానాలను దోచుకుంటున్నారని వైయస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో వైయస్‌ జగన్‌ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. బహిరంగ సభలో జననేత మాట్లాడుతూ.. 

నా సుదీర్ఘ పాదయాత్ర 3,648 సాగిన పాదయాత్ర దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో పూర్తి చేయగలిగా.. పాదయాత్రలో ఇదే నియోజకవర్గం గుండా సాగింది. ఇక్కడే ఇదే చిలకలూరిపేటలోనే మీ అందరితో మీటింగ్‌లో మాట్లాడాను. ఆ రోజు మీరు చెప్పిన బాధలు, మీరు చెప్పిన మాటలు అన్ని నాకు గుర్తున్నాయి. మరన్న మాటలు, మీరు పడిన బాధలు ఎప్పటికీ మర్చిపోలేను. సాగు నీరు అందక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు చెప్పారు. నాగార్జున సాగర్‌ కుడి కాల్వ నీరు సరిగ్గా రావడం లేదని చెప్పారు. తుర్లపాడు, పసుమ్రరు మేజర్‌ కాల్వను పొడిగించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నా.. దాని వల్ల మరో 20 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిసినా.. ఎవరూ పట్టించుకోవడం లేదని మీ ఆవేదన చెప్పారు. నాన్నగారి హాయాంను గుర్తుకుతెచ్చుకున్నారు. మూడు మండలాల పరిధిలో 21 ఎత్తిపోతల పథకాలు వైయస్‌ఆర్‌ ఏ విధంగా పెట్టారో చెప్పారు. ఆ ఎత్తిపోతల పథకాలు అగమ్యగోచర పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పుకొచ్చారు. వాగుల్లో నీరు ఉండడం లేదు.. ఉన్నప్పుడు మోటర్లు పనిచేయడం లేదని మీరు చెప్పిన బాధలు నాకు ఇంకా గుర్తున్నాయి. చిలకలూరిపేటలో ఇళ్లు లేని నిరుపేదలు చాలా మంది ఉన్నారు. ఆ పేదలకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో ఆ రోజుల్లో నాన్నగారు 52 ఎకరాలను కొనుగోలు చేసి అందులో పేద ప్రజలకు పట్టాలు పంపిణీ చేసిన కార్యక్రమం చెప్పుకొచ్చారు. ఆ తరువాత అదే భూమిని అధికారం ఉందని దౌర్జన్యంగా భూమిని లాగేసుకొని చంద్రబాబు ప్రభుత్వం అదే భూమిలో ప్లాట్లు కడతామని ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో కూడా చెప్పారు. ఆ రోజే చెప్పాను..

చంద్రబాబు కడుతున్న ప్లాట్లు పేరుతో మోసం చేస్తున్నారో.. ఒక చదరపు అడుగు కట్టడానికి ఎంత అవుతుందని ఏ కాంట్రాక్టర్‌ను అడిగితే వెయ్యి రూపాయలు దాటదని చెబుతారు. ఆ ప్లాట్లలో లిఫ్ట్, గ్రానైట్‌ ఫ్లోరింగ్‌ లేదు.. అటువంటి ప్లాట్లు కట్టడానికి వెయ్యి రూపాయలు మించదని ఎవరైనా చెబుతారు.. అదే ప్లాట్ల నిర్మాణానికి అడుగుకు రూ. 2 వేలు ఇస్తూ ఏ విధంగా దోచుకుంటున్నారో చెప్పారు. ఏరకంగా చంద్రబాబు తన బినామీలతకు సంబంధించిన కాంట్రాక్టర్లకు అడుగుకు రూ. 2 వేలకు కాంట్రాక్ట్‌ ఇచ్చి ఏరకంగా లంచాలు తీసుకుంటున్నాడో.. పేద ప్రజలు 20 సంవత్సరాల పాటు నెల నెల రూ. 3 వేలు కడుతూ.. పోవాలో మీరు పడిన బాధలు నాకు చెప్పారు. ఆ ప్రతి పేదవాడికి చెబుతున్నా.. ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబు ఆ ప్లాట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాడు. ఆ ప్లాట్లు ఎవరూ వద్దు అనొద్దు.. ఇంతకు ముందే మీకు మాటిచ్చాను మరోసారి చెబుతున్నా.. ఆ తరువాత మన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ప్లాట్ల మీద ఉన్న రూ. 3 లక్షల రుణం మాఫీ చేస్తామని మాటిస్తున్నా.. 

ఆ రోజు చెప్పిన మాటలు నాకు బాగా గుర్తున్నాయి. పాదయాత్ర జరుగుతున్నప్పుడు ఎడవల్లిలో దళితుల భూములు 416 ఎకరాల భూమి ఎలా ఆక్రమించారో.. గ్రానైట్‌ కోసం 1975లో ఇచ్చిన భూముల పట్టాలను రద్దు చేసి ఏరకంగా గద్దల్లా ఆక్రమించారో చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే భూమలన్నీ తిరిగి అందజేస్తామని మాటిస్తున్నా.. చిలకలూరిపేట వచ్చినప్పుడు ఇక్కడ జరిగిన అవినీతి గురించి కూడా చెప్పారు. మంత్రిగా ఉన్న వ్యక్తి అవినీతి, మోసం చేయకూడదు.. మంత్రి పుల్లారావు దగ్గరుండి సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు  చేసే కార్యక్రమంలో ఏరకంగా రైతులకు అన్యాయం చేస్తూ అధికారుల అండతో రూ. 650 కోట్ల స్కాం చేశారో మీరే చెప్పారు. మీరు చెప్పిన మాటలు ఇవాల్టికి మర్చిపోలేదు. అగ్రిగోల్డ్‌ ఆస్తులు ఏరకంగా మీ మంత్రి కాజేసే ప్రయత్నం చేశారో నేను మర్చిపోలేదు. మరో 20 రోజుల్లో దేవుడు ఆశీర్వదించి మీ చల్లని దీవెనలతో మన ప్రభుత్వం వచ్చిన తరువాత వీటన్నింటిపై ఎంక్వైరీ వేస్తాం. అన్నింటిపై న్యాయం జరిగేలా చేస్తానని హామీ ఇస్తున్నా.. 

ప్రతి గ్రామం నేను తిరుగుతూ వచ్చా.. పాదయాత్రలో రైతులు పడిన బాధలు చూశా. పేదవాడు పడిన బాధలు చూశా. అక్కచెల్లెమ్మలు పడుతున్న అవస్థలు చూశా. అక్కచెల్లెమ్మలు కన్నీరు పెడితే ఇంటికే అరిష్టం అంటారు. అక్కచెల్లెమ్మలు ఇళ్లు, గ్రామం, రాష్ట్రం బాగుంటుందని అందరికీ తెలిసిన విషయం. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు హయాంలో అటువంటి అక్కచెల్లెమ్మలు పడుతున్న బాధలు చూశా. ఏ రకంగా 2014లో చంద్రబాబు అక్కచెల్లెమ్మలకు పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు అక్షరాల 93 లక్షల మందిని ఎలా మోసం చేశారో, వారు చెబుతున్న బాధలు విన్నా.. ఏరకంగా అక్కచెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేస్తాను. మీరు డబ్బులు కట్టొద్దని చంద్రబాబు చెప్పారో.. వీరు కట్టని కారణంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి రూ. 14,200 కోట్లు ఉంటే కట్టని కారణంగా అవి మొత్తం  వడ్డీలతో రూ. 26 వేల కోట్లకు ఎగబాకాయో వారు చెబుతున్నప్పుడు బాధ అనిపించింది. గతంలో సున్నా వడ్డీకే రుణాలు వచ్చేవి. దానికి చంద్రబాబు ఏరకంగా ఎగనామం పెట్టారో అక్కచెల్లెమ్మలు చెప్పారు. ఇవాళ మీ అందరికీ ఒకటే చెబుతున్నా.. ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ బాధలను విన్నాను. ఆ ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు భరోసా ఇస్తూ చెబుతున్నా.. నేను విన్నాను.. నేనున్నానని మాటిస్తున్నా.. 

అక్కచెల్లెమ్మలు విద్యా, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలి. వీరు ఎదిగితేనే కుటుంబాలు బాగుపడతాయి. అక్కచెల్లెమ్మల బాగోగుల కోసం మనం ఏం చేయబోతున్నామో నవరత్నాల ద్వారా చెప్పాను. 93 లక్షల మంది పొదుపుసంఘాల అక్కచెల్లెమ్మలకు రుణాలు మాఫీలు కావడం లేదు, సున్నావడ్డీ అందడం లేదు. మహిళలను లక్షాధికారులను చేయాలని దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కలలు కన్నారు. అటువంటి అక్కచెల్లెమ్మలు అప్పుల్లో కూరుకుపోయారు. నిండా మునిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి అక్కచెల్లెమ్మలను పసుపు – కుంకుమ అని పేరుతో చిల్లర విసిరేస్తూ మోసం చేస్తున్నాడు. దేవుడు ఆశీర్వించి మన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఎన్నికల నాటికి ఎంత రుణాలు ఉంటాయో నాలుగు దఫాల్లో నేరుగా డబ్బులు వారి చేతికే ఇస్తాం. అక్కచెల్లెమ్మలను లక్షాధికారులుగా చేసే విధంగా అడుగులు వేస్తాం. సున్నా వడ్డీకే రుణాలు అందిస్తాం. వాళ్ల తరుపున కట్టాల్సిన వడ్డీ ప్రభుత్వమే కడుతుందన్నారు. 

బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ అక్కలకు పేదరికం పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. 45 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల అక్కలకు దేవుడు ఆశీర్వదించి మన పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి అక్కకు వైయస్‌ఆర్‌ చేయూత పథకాన్ని తీసుకొచ్చి ప్రతి అక్క చేతిలో రూ. 75 వేలు నాలుగు దఫాల్లో పెడతాం. ఇవాళ చంటిపిల్లలను చంకన వేసుకొని ఆ పిల్లలు గొప్పగా చదవాలి.. వారిని చదివించేందుకు అక్కచెల్లెమ్మలు పడుతున్న అవస్థలు చూశా. పేదరికం పోవాలంటే పిల్లలు చదవాలి. ఆ పిల్లలు ఉద్యోగాలు చేసినప్పుడు పేదరికం పోతుందని, ఆ పిల్లలకు మంచి పరిస్థితులు రావాలని తల్లులు పడుతున్న ఆరాటం చూశా. మీ అందరి చల్లని దీవెనలతో మన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ తల్లి చేయాల్సిందేమీ లేదు పిల్లలను బడులకు పంపిస్తే చాలు ప్రతి తల్లికి సంవత్సరానికి రూ. 15 వేలు ఇస్తామని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెకు చెబుతున్నా. అమ్మ ఒడి అని ఈ పథకాన్ని తీసుకొస్తున్నాం. ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ ముఖంలో చిరునవ్వు చూస్తాం. అదే పిల్లలు కాలేజీ వరకు వస్తే ఇంజనీరింగ్, డాక్టర్‌ వంటి పెద్ద చదువులు చదివించేందుకు ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు. నేను చదివిస్తానని ప్రతి అక్క, చెల్లెమ్మకు చెబుతున్నా.. ఉన్నత చదువుల కోసం వెళ్లిన పిల్లల కోసం సంవత్సరానికి రూ. 20 వేలు ఇస్తామని చెబుతున్నా.. 

ఆ అక్కచెల్లెమ్మల కోసం నవరత్నాల్లో ఇంకో కార్యక్రమాన్ని కూడా ప్రకటించాం. అది మద్యం నిషేదం. మద్యం కాపురాల్లో చిచ్చుపెడుతుంది. మొదటి సంతకం పెట్టి బెల్టుషాపులు రద్దు చేస్తామని చెప్పారు. కానీ ఇవాళ ప్రతి కిరణ దుకాణాల్లో మందు అమ్మే కార్యక్రమానికి వ్యవస్థను తీసుకువచ్చారు. గ్రామాల్లో 7 గంటలు దాటితే ఇంట్లో చెల్లెమ్మలు బయటకు వెళ్లలేని పరిస్థితి చంద్రబాబు తీసుకువచ్చారు. మన ప్రభుత్వం వచ్చిన తరువాత మద్యపానాన్ని మూడు దశల్లో నిర్మూలిస్తానని మాటిస్తున్నా.. ఈ ఎన్నికలు అయిపోయిన తరువాత మరో ఐదు సంవత్సరాల్లో ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో మద్యం షాపులు తీసేయించిన తరువాతే ఓట్లు అడుగుతానని మాటిస్తున్నా. 

చంద్రబాబు పాలనలో లా లేదు.. ఆర్డర్‌ లేదు. ఇసుక దోపిడీ చేస్తున్న ఎమ్మెల్యేను మహిళా ఎమ్మార్వో అడ్డుకుంటే ఆ ఎమ్మార్వోను జుట్టుపట్టుకొని ఈడ్చుకొని పోతున్నారు ఆ ఎమ్మెల్యేలు. అయినా కేసులు, అరెస్టులు లేవు. రిషితేశ్వరి అని బాలిక చదువుల కోసం వెళ్లి అనుమానాస్పద రీతిలో చనిపోతే.. చావుకు కారణం బాబురావు అనే వ్యక్తి అని తెలిసినా అరెస్టు చేయని వ్యక్తి చంద్రబాబు. ఇదే విజయవాడలో అక్కచెల్లెమ్మలకు రుణాలు ఇస్తూ ఆ రుణాలు వెనక్కు ఇవ్వలేని అక్కచెల్లెమ్మల మానాలతో చెలగాటం ఆడుతూ వాటిని సెల్‌ఫోన్లలో రికార్డు చేసి మరీ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న పరిస్థితులు విజయవాడ టౌన్‌లోనే చూశాం. ఆడవారి జీవితాల్లో చెలగాటం ఆడుతున్నా పట్టించుకోని ప్రభుత్వం. దళిత మహిళలను నడిరోడ్డు మీద వివస్త్రను చేసి దాడి చేస్తున్నారు. దాన్ని సెల్‌ఫోన్లతో తీసి సర్కులేట్‌ చేస్తున్నారంటే లా అండ్‌ ఆర్డర్‌ ఏ స్థాయిలో చెప్పాల్సిన పనిలేదు. మీ అందరికీ ఒకటే చెబుతున్నా.. మీ అందరి దీవెనలతో మన పార్టీ అధికారంలోకి వచ్చిన  తరువాత లాండ్‌ ఆర్డర్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తామని చెబుతున్నా.. ఆడవారిపై ఎవరైనా చెయ్యి వేస్తే ఆ చెయ్యి వేసినందుకు ఆ మనిషి బాధపడేలా చేస్తానని మాటిస్తున్నా.. 

మరో 20 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. చంద్రబాబు చేయని మోసం ఉండదు. చంద్రబాబు చెప్పని అబద్ధం ఉండదు. మరో 20 రోజుల్లో చంద్రబాబు చూపించే సినిమా ఉండదు. మీ అందరినీ ఒకటే అడుగుతున్నా.. ఇవాళ యుద్ధం ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది. చంద్రబాబు ఒక్కరితోనే కాదు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, అమ్ముడుపోయిన అనేక చానళ్లతో యుద్ధం చేస్తున్నాం. వ్యవస్థలు దిగజారిపోయాయి. విలువలు లేని రాజకీయాలు వచ్చాయి. విశ్వసనీయత అనే పదానికి అర్థం లేదు. 20 రోజులుగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు గమనించాలి. ఐదు సంవత్సరాల్లో పలానా మంచి చేశాను. నాకు ఓటేయండి అని చెప్పి అడగలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి తాను ఎన్నికల్లో గెలవడం కోసం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. పాలన మీద ఎన్నికలు జరిగితే డిపాజిట్లు కూడా రావని బాగా తెలుసు. తన పాలన మీద చర్చ జరగకూడదని, అన్యాయాల మీద, దుర్మార్గాల మీద, మోసాల మీద చర్చ జరగకూడదని చేస్తున్న కుట్రలను గమనించాలి. కుట్రలు క్లైమాక్స్‌కు వచ్చాయి. మా చిన్నాన్నను చంద్రబాబు చంపించినప్పుడు కుట్ర క్లైమాక్స్‌కు వచ్చింది. తానే చంపిస్తాడు. తన పోలీసుల చేత తానే విచారణ చేయిస్తాడు. తరువాత తానే వక్రీకరించి తన పత్రికలు, టీవీ చానళ్లలో చూపిస్తాడు. ఈ స్థాయిలోకి వ్యవస్థలు దిగజారిపోయాయి. నువ్వు హత్య చేయించకపోతే నువ్వు సీబీఐ ఎంక్వైరీకి ఎందుకు వెనకాడుతున్నావని అడుగుతున్నా.. 

ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని చంద్రబాబుకు తెలుసు. వ్యతిరేక ఓట్లను ఎలా చీల్చాలని చంద్రబాబు చేస్తున్న కుట్రలు గమనించాలి. మీ అందరికీ కనిపిస్తుంది ఒక యాక్టర్‌ చంద్రబాబు పాట్నర్‌ కనిపిస్తాడు. చంద్రబాబు ఎది చెబితే అది వల్లిస్తాడీ పాట్నర్‌ యాక్టర్‌. చంద్రబాబు ఎవరికి చెబితే వారికే టికెట్లు ఇస్తాడు యాక్టర్‌ పాట్నర్, చంద్రబాబు ఎలా చెబితే అలా నడుచుకుంటాడు. చివరకు యాక్టర్‌ పాట్నర్‌ నామినేషన్‌ వేస్తే తెలుగుదేశం పార్టీ జెండాలు కూడా కనిపిస్తాయి. యాక్టర్‌ పాట్నర్‌ ముసుగు కప్పుకొని ఎందుకు చంద్రబాబుకు సపోర్టు చేస్తున్నావు అని అడుగుతున్నా.. కారణం ఏంటో తెలుసా.. డైరెక్ట్‌గా చంద్రబాబుతో పొత్తుపెట్టుకుంటే డిపాజిట్లు రావని యాక్టర్‌ పాట్నర్‌కు తెలుసు. ప్రతి అడుగులోనూ కుట్రలు కనిపిస్తాయి. చివరకు సామాజికవర్గాల వారిగా కుట్రలు పన్నుతున్నారు. ఎలా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎలా విడదీయాలి. చంద్రబాబుకు ఎలా మేలు చేయాలని కుట్రలు చేస్తున్నారు. అందుకే కొత్త కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఆ పార్టీలకు వేసుకునే కండువాలు కూడా వైయస్‌ఆర్‌ సీపీ కండువాల మాదిరిగా ఉండేలా చేస్తున్నారు. వారందరికీ చంద్రబాబు ఫైనాన్స్‌ చేసి సినిమా తీస్తున్నాడు. మీ అందరినీ ఒకటే కోరుతున్నా.. ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి ఎన్నికల్లో ప్రభావితం చేసేందుకు ప్రతి చేతిలో రూ. 3 వేలు పెట్టే కార్యక్రమం చేస్తాడు. 

గ్రామాల్లో, వార్డుల్లో ప్రతి తాత, ప్రతి అవ్వ, ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న దగ్గరకు వెళ్లి చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు.. 20 రోజులు ఓపిక పడదాం. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న నవరత్నాలను తీసుకువస్తాడు. మన జీవితాలు బాగుపడతాయని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు చెప్పండి. ఈ వ్యవస్థలో మార్పు రావాలి. విశ్వసనీయత, నిజాయితీ అనే పదానికి అర్థం రావాలి. ఇటువంటి ధర్మ పోరాటంలో విడదల రజిని నా చెల్లి మంచి చేస్తుందనే నమ్మకం నాకు ఉంది. మీ అందరి చల్లని దీవెనలు నా చెల్లి రజినిపై ఉంచాలని సవినయంగా కోరుతున్నాను. కృష్ణదేవరాయలు యువకుడు, ఉత్సాహవంతుడు మంచి చేస్తాడనే నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు ఉంచాలని కోరుతున్నాను. మ్రరి రాజశేఖరన్న గురించి చెప్పాలి. నేను అడిగిన వెంటనే తన సీటును కూడా వదులుకున్నాడు. సామాజిక న్యాయం చేయాలని అడిగితే.. ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేదు. రాజశేఖరన్నను నా గుండెల్లో పెట్టుకుంటా.. చిలకలూరిపేటను మీరు గెలిపించండి రాజశేఖరన్నను మంత్రిని కూడా చేస్తా అని మాటిస్తున్నా. అన్నిరకాలుగా తోడుగా ఉంటానని మరోసారి చెబుతున్నా. మన పార్టీ గుర్తు ఫ్యాన్‌ గుర్తు అని ఎవరూ మర్చిపోవద్దు. 

Back to Top