అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్‌లో ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడి అనకాపల్లి ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాధితులకు వైయస్ జగన్ ధైర్యం చెప్పారు. బాధితుల వివరాలు, ప్రమాదం జరిగిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న వైద్యం.. వాళ్ల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైయస్ జగన్ సూచించారు.