మ‌ట్టి నుంచి ఎదిగిన మాణిక్యం ల‌క్ష్మీనారాయ‌ణ‌

ప్రముఖ రచయిత​ పెనుగొండ లక్ష్మీనారాయణకు వైయస్‌ జగన్‌ అభినందనలు

తాడేప‌ల్లి: ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణ కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం పట్ల వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు.   గుంటూరులో న్యాయవాదిగా పని చేస్తూ,  అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడిగా కూడా ఎన్నికై, ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్న లక్ష్మీనారాయణ రచించిన దీపిక అభ్యుదయ సాహిత్య వ్యాస సంపుటికి సాహితీ విమర్శ కేటగిరీలో జాతీయ సాహిత్య అకాడమీ అవార్డు రావడం ఎందరికో స్ఫూర్తినిస్తుంద‌ని వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు. 1972లో సమిథ అనే కవితతో తన సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించిన లక్ష్మీనారాయణ మట్టి నుంచి ఎదిగిన మాణిక్యంగా వైయస్‌ జగన్‌ ప్రశంసించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కించుకున్న లక్ష్మీనారాయణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తన సందేశంలో పేర్కొన్నారు.

Back to Top