సుష్మాస్వరాజ్‌ మృతి పట్ల  సీఎం వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి 

అమరావతి: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత సుష్మాస్వరాజ్‌ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అపార అనుభవం, సంయమనం, రాజకీయ నైపుణ్యం కలబోసిన నేత ఆమె అని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా మన్ననలందుకున్న గొప్ప పార్లమెంటేరియన్‌ అని కొనియాడారు. సుష్మాస్వరాజ్‌ కుటుంబానికి వైయస్‌ జగన్‌ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.  
 

తాజా ఫోటోలు

Back to Top