శివప్రసాద్‌ మృతికి సీఎం వైయస్‌ జగన్‌ సంతాపం

అమరావతి: టీడీపీ సీనియర్‌ నేత, చిత్తూరు జిల్లా మాజీ ఎంపీ, సినీ నటుడు శివప్రసాద్‌ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు సీఎం వైయస్‌ జగన్‌ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.  గత కొంతకాలంగా శివప్రసాద్‌ కిడ్నీ సంబంధిత వ్యాధితో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మరణించారు.  1951జూలై 11న చిత్తూరు జిల్లా పొట్టిపల్లిలో ఆయన జన్మించారు. తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. 
 

Back to Top