ఇప్పటికీ కూడా మీ కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి?

 లోకేష్‌, పవన్‌ ఇప్పటికీ షటిల్‌ సర్వీసులే 

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

తాడేపల్లి: రాజధాని పేరుతో చంద్రబాబు పట్టపగలే దోపిడీ చేస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. 12ఏళ్లలో మనస్పూర్తిగా చంద్రబాబు అమరావతిలో ఉన్నారా?. ఇప్పటికీ కూడా మీ కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ వైయ‌స్ఆర్‌సీపీ వ్యతిరేకం కాదని వైఎస్‌ జగన్‌ చెప్పుకొచ్చారు. 
వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘రాజధాని పేరుతో దోపిడీని డైవర్ట్‌ చేసేందుకు చంద్రబాబు డ్రామాలు. చంద్రబాబు ఈ 12 ఏళ్ల కాలంలో మనస్ఫూర్తిగా ఈ ప్రాంతంలో ఉన్నారా?. ఇప్పటికీ చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌, లోకేష్‌ కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి?. 2019 వరకు హైదరాబాద్‌కు షటిల్‌ సర్వీస్‌ చేశారు. ఇప్పుడు కూడా హైదరాబాద్‌కు షటిల్‌ సర్వీసే చేస్తున్నారు. పవన్‌, లోకేష్‌ నాలుగు రోజులు కూడా అమరావతిలో ఉండట​ం లేదు. పవన్‌, లోకేష్‌లకు కూడా ప్రత్యేక విమానాలు ఉన్నాయి. విమానాల్లో తిరుగుతున్నారు..షటిల్‌ సర్వీసు చేస్తున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ అమరావతి ప్రాంతానికే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదు. మేము అప్పుడు, ఇప్పుడు ఇదే చెబుతున్నాం. కానీ, ప్రజలను మభ్యపెట్టేలా చంద్రబాబు మాట్లాడుతూ బిల్డప్‌ ఇస్తున్నాడు.

అమరావతికి ఇప్పటి వరకు చంద్రబాబు ఎంత ఖర్చు చేశారు?. 2014-19 మధ్య రూ.5335 కోట్లు ఖర్చు చేశారు. ఈ రెండేళ్లలో అమరావతికి బాబు చేసిన అప్పు 47వేల కోట్లు. అమరావతి కోసం ఏడేళ్లలో మొత్తం 8000 కోట్లు ఖర్చు చేశారు. ఏడేళ్లలో 8000 కోట్లు ఖర్చు పెడితే రూ.2లక్షల కోట్లు ఖర్చు చేయడానికి ఎన్నేళ్ల సమయం పడుతుంది. అమరావతి నిజంగా సెల్ఫ్‌ ఫైనాన్స్‌ రాజధాని అయ్యిందా?. అమరావతిలోనే వేల కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరిస్థితేంటి?’ అని ప్రశ్నించారు. 
 

Back to Top