దేశంలోనే బెస్ట్‌ సీఎం వైయ‌స్‌ జగన్

ముఖ్య‌మంత్రిని క‌లిసిన‌ నటుడు అలీ
 

తాడేపల్లి: దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రిగా వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలుస్తారని సినీ నటుడు అలీ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైయ‌స్‌ జగన్‌ను బుధవారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. భేటీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మా నాయకుడిని మర్యాద పూర్వకంగా కలిశాను. కోవిడ్ సమయంలో సినిమా పరిశ్రమ గురించి సీఎం వాకబు చేశారు. ఇంకా షూటింగ్స్ మొదలు కావడానికి సమయం పడుతుందని చెప్పాను. చిన్న వయసులో ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నారు. సహజంగా ఆయన మంచి చేస్తున్నపుడు విమర్శించేవారు విమర్శిస్తుంటారు. వారు చేయలేక పోయారు కాబట్టే ఈయనకి మంచి పేరు వస్తుందన్న అక్కసుతో విమర్శలు చేస్తున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా దేశంలో బెస్ట్ సీఎంగా వైయ‌స్ జగన్ నిలుస్తార’ని అలీ అన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top