సీఎం వైఎస్‌ జ‌గ‌న్‌కు ఘ‌న‌స్వాగ‌తం

హైదరాబాద్‌ : తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఉదయం 9.45 గంటలకు మేడిగడ్డకు చేరుకున్నారు. తాడేపల్లి నివాసం నుంచి ఉదయం 8.15 గంటల ప్రాంతంలో ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరిన ఆయన నేరుగా మేడిగడ్డకు విచ్చేశారు. సీఎం జగన్‌కు తెలంగాణ మంత్రులు సాదర స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. సీఎం వైఎస్‌ జగన్‌ వెంట మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఉన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top