ఇఫ్తార్ విందుకు హాజ‌రైన వైయ‌స్ జ‌గ‌న్‌

హైద‌రాబాద్‌:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజ‌ర‌య్యారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్ర‌యం చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్ అక్కడ్నించి నేరుగా రాజ్ భవన్ కు పయనం అయ్యారు. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఇఫ్తార్ విందులో ఏపీ సీఎం జగన్ , తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ముస్లింల‌కు రంజాన్ మాసం శుభాకాంక్ష‌లు తెలిపారు. సీఎం హోదాలో వైయ‌స్ జగన్ హైదరాబాద్ లో అడుగుపెట్టడం ఇదే ప్రథమం.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top