వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అనే నేను..

వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద డిజిటల్‌ బోర్డును ఏర్పాటు  

ప్రతిపక్ష పార్టీలు పొత్తులను, ఎత్తులను నమ్ముకున్నాయి

మా నాయకులు దేవుడిని, ప్రజలను మాత్రమే నమ్ముకున్నారు

రెండు బటన్లు నొక్కి వైయస్‌ జగన్‌ రుణం తీర్చుకునేందుకు ప్రజలు సిద్ధం

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి

తాడేపల్లి:  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అనే నేను..పేరుతో వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద డిజిటల్‌ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ..వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అనే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భాన్ని పురస్కరించుకొని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద డిజిటల్‌ బోర్డును ఏర్పాటు చేశామన్నారు. అవతలి వైపు మూడు పార్టీలు కాదు..30 పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా ..ఎన్ని ఎత్తులు, పొత్తులతో ముందుకు వచ్చినా కూడా మా నాయకులు వైయస్‌ జగన్‌ ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకువచ్చారన్నారు. వైయస్‌ జగన్‌ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిపథంలో అగ్రస్థానానికి తీసుకెళ్లారన్నారు. అందుకే మేం మేం ధైర్యంగా ఉన్నాం..మాకు ఎత్తులు, పొత్తుల గురించి ఆలోచించడం లేదు.

మా నాయకులు వైయస్‌ జగన్‌ పైన దేవుడిని, కింద ప్రజలను నమ్ముకున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించారు. 2019లో మాకు ఓటు వేసినా, వేయకపోయినా కూడా రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి వారి ఇంటి తలుపు తట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాం. ప్రజలు కూడా మరోసారి వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇటీవల నాలుగు సిద్ధం మహాసభలు నిర్వహించాం. ఒకదానికి మించి మరో సభకు ప్రజలు స్వచ్ఛందంగా అన్ని వర్గాల ప్రజలు జయప్రదం చేశారు. అవతలి పార్టీలకు ప్రజలపై నమ్మకం లేక పొత్తులను నమ్ముకుంటున్నారు. మేం ప్రజలను నమ్మాం..ప్రజలు కూడా వైయస్‌ జగన్‌ను నమ్మారు కాబట్టే రెండోసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.

రాష్ట్రంలో ఉన్న సుమారు 90 శాతం ఇళ్లకు మా ప్రభుత్వ కార్యక్రమాల వల్ల లబ్ధి జరిగింది. ఈ ప్రక్రియలో ఎక్కడా కూడా దళారుల ప్రమేయం లేకుండా నేరుగా అందాయి. దేశంలోని అనేక రాష్ట్రాల ప్రజలు వైయస్‌ జగన్‌ లాంటి ముఖ్యమంత్రి మాకు ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారు. వైయస్‌ జగన్‌ పార్టీ ప్రాంతీయ పార్టీగానే ఎందుకు ఉంది..జాతీయ పార్టీగా ఎందుకు మార్చడం లేదని అనేక రాష్ట్రాల నుంచి మా పార్టీ కేంద్ర కార్యాలయానికి విజ్ఞప్తులు వస్తున్నాయి. దేశంలో చాలా మంది వైయస్‌ జగన్‌ నాయకత్వాన్ని కావాలని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో లబ్ధి పొందిన ప్రజలు వైయస్‌ జగన్‌ చేసిన సహాయానికి తిరిగి రుణం తీర్చుకునేందుకు రేపు జరిగే ఎన్నికల్లో రెండు బటన్లు నొక్కబోతున్నారు. ఇప్పటికే వైయస్‌ జగన్‌ 130 సార్లు బటన్‌ నొక్కి పేదలకు మేలు చేస్తే..ప్రజలు రెండుసార్లు బటన్లు నొక్కి వైయస్‌ జగన్‌ రుణం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, ప్రతిపక్ష పార్టీల పీక నొక్కి వారిని రాజకీయంగా రాష్ట్రంలో లేకుండా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు.
 

Back to Top