కాసేపట్లో సీఈసీని కలవనున్న వైయస్‌ జగన్‌ బృందం 

ఢిల్లీ: రాష్ట్రంలో అప్రజాస్వామిక రీతిలో అధికార తెలుగుదేశం పారీ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతుండడం, అధికార యంత్రాంగాన్ని,పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న తీరుపై వైయస్‌ జగన్‌ బృందం మరికొద్ది సేపట్లో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. సర్వేల పేరుతో టీడీపీ వ్యతిరేక ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తుండడాన్ని కేంద్ర ఎన్నిల ప్రధానాధికారి సునీల్‌ ఆరోరా దృష్టికి తీసుకెళ్ళి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరనున్నారు. ఆయన వెంట వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి,పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Back to Top