రాష్ట్రం అభివృద్ధి చెందితే చంద్ర‌బాబు త‌ట్టుకోలేక‌పోతున్నారు

ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి
 

పులివెందుల : చంద్రబాబుకు రాష్ట్రం అభివృద్ధి చెందితే తట్టుకోలేకపోతున్నాడని ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు చేసిన సీఎం వైయ‌స్  జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతారన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టారన్నారు. శాసన సభలో రెండుసార్లు బిల్లులను ఆమోదించాకే గవర్నర్‌ ఆమోదానికి పంపించినట్లు చెప్పారు. శాసన మండలిలో బిల్లుపై ఓటింగ్‌ పెట్టాలని టీడీపీ మినహా అన్ని పార్టీలు గతంలో కోరాయన్నారు. అయితే మండలంలో సంఖ్యా బలంతో చంద్రబాబు సూచనల మేరకు శాసనమండలి చైర్మన్‌ అనైతికంగా వ్యవహరించారని అన్నారు. నిబంధనలకు అనుగుణంగా రాజధాని బిల్లులను గవర్నర్‌ ఆమోదానికి పంపించినట్లు చెప్పారు. అనంతరం ఆయన ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. 

Back to Top