మీ బాధలు ఎప్పటికీ మర్చిపోలేను

ఎడవల్లి రైతులకు 416 ఎకరాల భూములు తిరిగి అందజేస్తా

ఇళ్లపై ఉన్న రూ. 3 లక్షలు మాఫీచేస్తా

మంత్రి పత్తిపాటి రూ. 650 కోట్ల స్కాంపై విచారణ చేయిస్తా

మీకు జరిగిన ప్రతి అన్యాయంపై న్యాయం జరిగేలా చూస్తా

చిలకలూరిపేట: పాదయాత్రలో మీరు చెప్పిన బాధలు, మీరు చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. చిలకలూరిపేట బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగిస్తూ పాదయాత్రగా చిలకలూరిపేటకు వచ్చినప్పుడు ప్రజలను కలిసి వారి బాధలు తెలుసుకున్నారు. వారి కష్టాలను విన్న వైయస్‌ జగన్‌ ఎన్నికల ప్రచార సభలో మరోసారి గుర్తు చేశారు. వాటన్నింటినీ పరిష్కరిస్తామని, ప్రతి అన్యాయంపై ఎంక్వైరీ వేసి దోషులను శిక్షిస్తామని హామీ కూడా ఇచ్చారు. స్థానిక సమస్యలపై వైయస్‌ జగన్‌ ప్రస్తావిస్తూ.. 

నా సుదీర్ఘ పాదయాత్ర 3648 సాగిన పాదయాత్ర దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో పూర్తి చేయగలిగా.. పాదయాత్రలో ఇదే చిలకలూరిపేట నియోజకవర్గం గుండా సాగింది. ఇక్కడే ఇదే చిలకలూరిపేటలోనే మీ అందరితో మీటింగ్‌లో మాట్లాడాను. ఆ రోజు మీరు చెప్పిన బాధలు, మీరు చెప్పిన మాటలు అన్ని నాకు గుర్తున్నాయి. మరన్న మాటలు, మీరు పడిన బాధలు ఎప్పటికీ మర్చిపోలేను. సాగు నీరు అందక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు చెప్పారు. నాగార్జున సాగర్‌ కుడి కాల్వ నీరు సరిగ్గా రావడం లేదని చెప్పారు. తుర్లపాడు, పసుమ్రరు మేజర్‌ కాల్వను పొడిగించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నా.. దాని వల్ల మరో 20 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిసినా.. ఎవరూ పట్టించుకోవడం లేదని మీ ఆవేదన చెప్పారు. నాన్నగారి హయాంను గుర్తుకు తెచ్చుకున్నారు. మూడు మండలాల పరిధిలో 21 ఎత్తిపోతల పథకాలు వైయస్‌ఆర్‌ ఏ విధంగా పెట్టారో చెప్పారు. ఆ ఎత్తిపోతల పథకాలు అగమ్యగోచర పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పుకొచ్చారు. వాగుల్లో నీరు ఉండడం లేదు.. ఉన్నప్పుడు మోటర్లు పనిచేయడం లేదని మీరు చెప్పిన బాధలు నాకు ఇంకా గుర్తున్నాయి. 

చిలకలూరిపేటలో ఇళ్లు లేని నిరుపేదలు చాలా మంది ఉన్నారు. ఆ పేదలకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో ఆ రోజుల్లో నాన్నగారు 52 ఎకరాలను కొనుగోలు చేసి అందులో పేద ప్రజలకు పట్టాలు పంపిణీ చేసిన కార్యక్రమం చెప్పుకొచ్చారు. ఆ తరువాత అదే భూమిని అధికారం ఉందని దౌర్జన్యంగా భూమిని లాగేసుకొని చంద్రబాబు ప్రభుత్వం అదే భూమిలో ప్లాట్లు కడతామని ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో కూడా చెప్పారు. ఆ రోజే చెప్పాను.. చంద్రబాబు కడుతున్న ప్లాట్లు పేరుతో మోసం చేస్తున్నారో.. ఒక చదరపు అడుగు కట్టడానికి ఎంత అవుతుందని ఏ కాంట్రాక్టర్‌ను అడిగితే వెయ్యి రూపాయలు దాటదని చెబుతారు. ఆ ప్లాట్లలో లిఫ్ట్, గ్రనైట్‌ ఫ్లోరింగ్‌ లేదు.. అటువంటి ప్లాట్లు కట్టడానికి వెయ్యి రూపాయలు మించదని ఎవరైనా చెబుతారు.. అదే ప్లాట్ల నిర్మాణానికి అడుగుకు రూ. 2 వేలు ఇస్తూ ఏ విధంగా దోచుకుంటున్నారో చెప్పారు. ఏరకంగా చంద్రబాబు తన బినామీలతకు సంబంధించిన కాంట్రాక్టర్లకు అడుగుకు రూ. 2 వేలకు కాంట్రాక్ట్‌ ఇచ్చి ఏరకంగా లంచాలు తీసుకుంటున్నాడో.. పేద ప్రజలు 20 సంవత్సరాల పాటు నెల నెల రూ. 3 వేలు కడుతూ.. పోవాలో మీరు పడిన బాధలు నాకు చెప్పారు. ఆ ప్రతి పేదవాడికి చెబుతున్నా.. ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబు ఆ ప్లాట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాడు. ఆ ప్లాట్లు ఎవరూ వద్దు అనొద్దు.. ఇంతకు ముందే మీకు మాటిచ్చాను మరోసారి చెబుతున్నా.. ఆ తరువాత మన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ప్లాట్ల మీద ఉన్న రూ. 3 లక్షల రుణం మాఫీ చేస్తామని మాటిస్తున్నా.. 

ఆ రోజు చెప్పిన మాటలు నాకు బాగా గుర్తున్నాయి. పాదయాత్ర జరుగుతున్నప్పుడు ఎడవల్లిలో దళితుల భూములు 416 ఎకరాల భూమి ఎలా ఆక్రమించారో.. గ్రనైట్‌ కోసం 1975లో ఇచ్చిన భూముల పట్టాలను రద్దు చేసి ఏరకంగా గద్దల్లా ఆక్రమించారో చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే భూమలన్నీ తిరిగి అందజేస్తామని మాటిస్తున్నా.. చిలకలూరిపేట వచ్చినప్పుడు ఇక్కడ జరిగిన అవినీతి గురించి కూడా చెప్పారు. మంత్రిగా ఉన్న వ్యక్తి అవినీతి, మోసం చేయకూడదు.. మంత్రి పుల్లారావు దగ్గరుండి సీసీఐ ద్వారా పత్తికోలు చేసే కార్యక్రమంలో ఏరకంగా రైతులకు అన్యాయం చేస్తూ అధికారుల అండతో రూ. 650 కోట్ల స్కాం చేశారో మీరే చెప్పారు. మీరు చెప్పిన మాటలు ఇవాల్టికి మర్చిపోలేదు. అగ్రిగోల్డ్‌ ఆస్తులు ఏరకంగా మీ మంత్రి కాజేసే ప్రయత్నం చేశారో నేను మర్చిపోలేదు. మరో 20 రోజుల్లో దేవుడు ఆశీర్వదించి మీ చల్లని దీవెనలతో మన ప్రభుత్వం వచ్చిన తరువాత వీటన్నింటిపై ఎంక్వైరీ వేస్తాం. అన్నింటిపై న్యాయం జరిగేలా చేస్తానని హామీ ఇస్తున్నా.. 

Back to Top