నేడు ఢిల్లీకి ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ 

 సాయంత్రం ప్రధానితో భేటీ

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలను కూడా కలవనున్న వైయస్‌ జగన్‌

అమరావతి:  ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నేడు ఢిల్లీకి పయనమవుతున్నారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను చెల్లించాలని ప్రధానిని కోరనున్నారు. విద్యుత్‌ ఉత్పాదక సంస్థల పీపీఏలపై సమీక్ష, రివర్స్‌ టెండరింగ్‌ తదితర అంశాలను వివరించనున్నారు. ఢిల్లీ పర్యటనకు వైయస్‌ జగన్‌ తో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్, కొడాలి నానిలతో పాటు పలువురు ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు మోదీతో భేటీ అవుతారు. రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులతో కూడా వైయస్‌ జగన్‌ భేటీ కానున్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top