ఎల్లోస్ ఎలర్ట్

హడావిడిగా ఏదో ఒకటి చేయడం, చేస్తూ పప్పులో కాలేయడం నారాలోకేష్ కి బాగా అలవాటు కదా...ప్రజలు లోకేష్ కి  పెట్టిన పేరును సార్థకం చేసే పనిలో ఉంటారు తెలుగు తమ్ముళ్లు కూడా. శక్తి వంచన లేకుండా చినబాబు పేరు చిరస్థాయిగా కామెడీ చరిత్రలో నిలిచేలా ప్రయత్నం చేస్తుంటారు. ఆర్భాటంగా తిరుపతిలో చేసిన 4లక్షల గృహప్రవేశాల బహిరంగ సభలో ఎక్కడ చూసినా రావాలి జగన్ కావాలి జగన్ అనే కొటేషన్లు కనిపించాయి. ఏ కుర్చీ చూడబోయినా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఫొటేయే కనిపించింది.  తెలుగుదేశం సభలో జగన్ కావాలంటూ కొటేషన్లున్న కుర్చీలేంటని ఎవ్వరూ పట్టించుకోలేదు. నారా లోకేష్ సభ మొదలై ప్రసంగం మొదలైన తర్వాత గమనించిన అధికారులు బిత్తరపోయారు. అప్పటికే అందరూ అటు లోకేష్ వంక ఇటు రావాలి జగన్ అన్న కామెంట్లతో ఉన్న స్టిక్కర్లను ఆసక్తిగా మార్చి మార్చి చూసి నవ్వుకున్నారు. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ ను ఎంతగా విమర్శించినా, బురద జల్లాలని చూసినా ప్రతిచోటా యువనేత హవా తెలుగుదేశానికి ఎదురుగాలిలా వీస్తోందంటూ కామెంట్ చేసారు. నారావారి సభలో జగన్ కావాలంటూ ఉన్న స్టిక్కర్లున్న కుర్చీలను ఆదరాబాదరా తీసే ప్రయత్నం చేసారు అధికారులు. ఏం లాభం జరగాల్సిన డామేజీ జరిగే పోయింది. చంద్రబాబు, లోకేష్ ఎక్కడున్నా వారిని ఎదిరిస్తూ జగన్ ప్రాబల్యం అక్కడ కనిపిస్తూనే  ఉంటోందంటున్నారు తిరుపతి ప్రజలు. అధికార పక్షాన్ని నిలదీయడానికి జగనే అక్కర్లేదని ఆయన బొమ్మతో ఉన్న స్టిక్కర్లు చాలనీ అనిపిస్తోందంటున్నారు. ఎల్లో స్ ఎలర్ట్ గా లేకపోవడం వల్లే ఇలా జరిగిందని పార్టీ నేతలు వాపోతున్నారు.

Back to Top