గత అప్పులపై `ప‌చ్చ‌` అబద్ధాలు

 అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర అప్పులు రూ.6.4 లక్షల కోట్లే 

రూ.14 లక్షల కోట్ల అప్పులున్నాయన్నది దుష్ప్రచారమే.. 2019లో బాబు దిగిపోయేనాటికే రూ.4.06 లక్షల కోట్ల అప్పులు 

ఈ లెక్కన బాబు సర్కార్‌ కంటే జగన్‌ ప్రభుత్వం చేసిన అప్పులే తక్కువ 

అమరావతి: అప్పుల విషయంలో గత వైయ‌స్ఆర్‌ సీపీ ప్ర­­భుత్వంపై ఎల్లో మీడియా చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలేనని అసెంబ్లీ సాక్షిగా, అదీ కూటమి ప్రభుత్వం సోమ­వారం ప్రవేశపెట్టిన 2024–­25 బడ్జెట్‌లోనే తేలిపోయింది. మరో పక్క చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024–25 బడ్జెట్‌కు రూ.­91,443 కోట్ల అప్పులు, మరో రూ.1.09 లక్షల కోట్ల ప­న్నులు ఆధారంగా ఉండటం విశేషం. 

ఓసారి రూ.­14 లక్షల కోట్లు అప్పులని, మరోసారి రూ.10 లక్షల కోట్లు అ­ప్పు­లు చేశారని, రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేశారంటూ గత ప్రభుత్వంపై ఎల్లోమీడియా చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి పయ్యావుల సోమ­వారం అసెంబ్లీకి సమరి్పంచిన బడ్జెట్‌ పత్రాల్లో స్పష్టమైంది. బడ్జెట్‌ అప్పులతో పాటు గ్యారెంటీల ద్వారా చేసిన అప్పులు వైయ‌స్ఆర్‌ సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి అంటే 2023–24 ఆర్థిక ఏడాది పూర్తయ్యే­నాటికి రూ.6.46 లక్షల కోట్లేనని బడ్జెట్‌ పత్రాల్లో మంత్రి పే­ర్కొన్నారు. 

ఇందులో బడ్జెట్‌ అప్పులు 2023–24 మార్చి కి రూ.4.91 లక్షల కో­ట్లేనని పేర్కొన్నారు. ప్రభుత్వం గ్యారెంటీ ఇ­చ్చిన అప్పులు రూ.1.54 లక్షల కోట్లేనని చెప్పారు. 2024–25 ఏడాది మార్చికి బడ్జెట్‌ అప్పులు రూ.­5,60,094.25 కోట్లకు చేరతాయని, ఇది జీఎస్‌డీపీలో 34.14%గా ఉంటుందని మంత్రి బడ్జెట్‌ డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు.

వైయ‌స్‌ జగన్‌ పాలనలోనే అప్పులు తక్కువ
ఇవాళ అసెంబ్లీ సాక్షిగా తేలిన రాష్ట్ర అప్పు రూ.6,46,531 కోట్లు. ఇందులో చంద్రబాబు 2019లో దిగిపోయే నాటికే రూ.4,06,383 కోట్ల అప్పు ఉంది. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కోవిడ్‌ సమయంలో సైతం పెద్ద ఎత్తున సంక్షేమాభివృద్ధి పథకాలు అమలు చేస్తూ.. సుమారు రూ.2 లక్షల కోట్లకుపైగా డీబీటీ ద్వారా పేదల ఖాతాల్లో జమ చేసినప్పటికీ రాష్ట్ర అప్పు ఇంతేనని తేలింది. ఈ లెక్కన వైఎస్‌ జగన్‌ హయాంలో చేసిన అప్పు కంటే చంద్రబాబు హయాంలో చేసిన అప్పులే ఎక్కువని బట్టబయలైంది. రూ.14 లక్షల కోట్ల అప్పులు అంటూ టీడీపీ కూటమి నేతలు చెప్పింది దు్రష్పచారం అని తేటతెల్లమైంది. 

అన్నదాతకు దుఃఖమే! 
 ఆచరణ సాధ్యం కాని హామీలతో అన్నదాతలను ఊహల పల్లకిలో ఊరేగించిన కూటమి ప్రభుత్వం కాడి పారేసి చేతులెత్తేసింది! ఓటాన్‌ అకౌంట్‌తో ఐదు నెలలు కాలక్షేపం చేయగా సోమవారం ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్‌లోనూ రైతుల నోట్లో మట్టి కొట్టింది. సూపర్‌ సిక్స్‌ హామీల అమలుతో పాటు మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం కేటాయింపులు ఉంటాయన్న ఆశలను నీరుగార్చి నిలువు దగా చేసింది.  తాము అధికారంలోకి రాగానే బేషరతుగా ప్రతీ రైతు కుటుంబానికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందచేస్తామని సూపర్‌ సిక్స్‌లో కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. 

ఆచరణకు వచ్చేసరికి మాట మార్చి పీఎం కిసాన్‌తో కలిపి జమ చేస్తామని రైతులను మరోసారి మోసగించింది.  గత ఐదేళ్లలో 53.58లక్షల మంది రైతులకు ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రూ.34,288.17 కోట్లు పెట్టుబడి సాయం అందించింది. అయితే, ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో సుమారు 53.58 లక్షల మంది రైతులకు రూ.20 వేల చొప్పున రూ.10,716.74 కోట్లు కేటాయించాలి. కానీ తాజా బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు కేవలం రూ.వెయ్యి కోట్లు మాత్రమే. ఈ మొత్తాన్ని పీఎం కిసాన్‌ సాయం అందుకున్న వారికి మాత్రమే జమ చేసినా... ఒక్కో కుటుంబానికి ఈ ఏడాది రూ.నాలుగు వేలకు మించి పెట్టుబడి సాయం అందే పరిస్థితి కనిపించడం లేదు. పైగా కౌలు రైతులు, దేవదాయ, అటవీ, భూ సాగు దారులకు పెట్టు­బడి సాయం అందిస్తామన్న ప్రస్తావన ఎక్కడా లేదు.   

రైతుల నెత్తిన ప్రీమియం పిడుగు 
రైతులపై పైసా భారం పడకుండా గత ఐదేళ్లూ విజయవంతంగా అమలైన ఉచిత పంటల బీమా పథకాన్ని నిలిపివేస్తున్నట్లు అసెంబ్లీలో వ్యవవసాయ శాఖ మంత్రి అచ్చెన్న అధికారికంగా ప్రకటించారు. ఖరీఫ్‌ సీజన్‌ వరకు మాత్రమే రైతుల ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని, రబీ–2024–­25 నుంచి ఈ పథకంలో స్వచ్ఛంద నమోదు పద్ధతిలో రైతులను భాగస్వాములను చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఫలితంగా రబీలో నోటిఫై చేసిన 15 పంటలకు ప్రీమియం వాటాగా రైతులపై రూ.300 కోట్లకు పైగా భారం పడుతుంది.

అంతేకాకుండా రూ.3 లక్షల వరకు సున్నా వడ్డీ రాయితీ, 90% సబ్సిడీపై డ్రిప్‌ పరికరాల పంపిణీ గురించి బడ్జెట్‌లో ప్రస్తావన లేదు. ధరల స్థిరీకరణ నిధి, ప్రకృతి వైపరీత్యాల నిధికి పైసా కూడా విదల్చలేదు. వేటకు వెళ్లే ప్రతీ మత్స్యకార కుటుంబానికి రూ.20వేల చొప్పున వేట నిషేధ భృతి అందిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అటకెక్కించేసింది. జోన్‌తో సంబంధం లేకుండా ఆక్వా సర్విస్‌ కనెక్షన్లకు యూనిట్‌ రూ.1.50కే విద్యుత్‌ సరఫరా చేస్తామని ఇచ్చిన హామీకి కూడా పైసా కేటాయించలేదు. 

పథకాల పేర్లు మార్చి.. ప్రశంసిస్తూ 
జగన్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన పలు పథకాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారంటూ ఎన్నికల్లో దు్రష్పచారం చేసిన కూటమి.. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా వాటి గొప్పతనాన్ని ప్రశంసించడం గమనార్హం. వాటి పేర్లు మార్చి తాము కొనసాగిస్తున్నట్లు తేటతెల్లం చేసింది.

రూ.43,402.33 కోట్ల అంచనాలతో వ్యవసాయ బడ్జెట్‌ 
సాక్షి, అమరావతి: స్వర్ణాంధ్ర–2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. ఉచిత పంటల బీమా పథకాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రబీ సీజన్‌ నుంచి స్పచ్ఛంద నమోదు విధానం ద్వారా రైతులను భాగస్వాములను చేసి, పీఎంఎఫ్‌బీవైతో అను­సంధానం చేసి అమలు చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతు కుటుంబానికి రూ.20 వేలు పెట్టుబడి సాయాన్ని పీఎం కిసాన్‌­తో కలిపి అన్నదాత సుఖీభవ పథకం పేరిట అమలు చేయబోతున్నట్టు చెప్పారు. రూ.43,402.33 కోట్ల అంచనాలతో రూపొందించిన వ్యవసాయ బడ్జెట్‌ను అచ్చెన్నాయుడు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ప్రసంగించారు.

 

Women and Child Welfare Budget: Women Empowerment IN AP Under Jagan Govt

మ‌హిళా సంక్షేమానికి వైయ‌స్ జ‌గ‌న్ కృషి భేష్‌
 రాష్టంలో మహిళా సాధికారత కోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన కృషిని కూటమి ప్రభుత్వం భేష్‌ అని పరోక్షంగా ప్రస్తావించక తప్పలేదు. కూటమి సర్కారు సోమ­వా­రం ప్రవేశపెట్టిన జెండర్‌ బడ్జెట్‌ ఉపోద్ఘాతంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేరు ప్రస్తావించకుండానే గత ప్రభుత్వం సాధించిన ఫలితాల­ను ప్రస్తావించింది. రాష్ట్రంలో మహిళలను విద్య, ఉపాధి, సంక్షేమం, ఆర్థిక, సామా­జి­క, రాజకీయ తదితర రంగాల్లో సాధికారత వైపు అడుగులు వేయించేలా ఐదేళ్ల (2021–­25) పటిష్ట కార్యాచరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర బడ్జెట్‌­లో కొంతభాగాన్ని జెండర్‌ బడ్జెట్‌ పేరుతో మహిళాభివృద్ధికి ప్రభుత్వం 2021–22 నుంచి కేటాయింపులు చేస్తోంది. 2021–22లో మొదలైన జెండర్‌ బడ్జెట్‌ 2022–23 నాటికి మరింత మెరుగైన ఫలితాలు సాధించడం మొదలైంది.

విద్య, ఉపాధి, భూమి కేటాయింపు వంటి అనేక కీలకమైన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. నామినేటెడ్‌ పదవుల్లోనూ, నామినేషన్‌ పను­ల్లోనూ మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తూ చట్టం చేయడంలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలిచింది. దీంతో మహిళలు ఇంటి యాజమాన్యంతోపాటు రాజకీయంగానూ, సామాజికంగానూ ముంద­డుగు వేశారు. ఫలితంగా మహిళా సాధికారతలో జాతీ­య స్థాయిలో నీతి ఆయోగ్‌ రూపొందించిన ర్యాంకింగ్‌­లో 4 నుంచి మూడో ర్యాంకును సాధించింది. 18 మహి­ళా పోలీస్‌ స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు, వన్‌స్టాఫ్‌ సెంటర్లు, హెల్ప్‌డెస్‌్కల ఏర్పాటు వంటి అనేక చర్యలు చేపట్టింది. ఇలా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అనేక అంశాలను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జెండర్‌ బడ్జెట్‌లోని ఉపోద్ఘాతంలో ప్రస్తావించడం విశేషం.

జెండర్‌ బడ్జెట్‌ కేటాయింపులు ఇలా
ప్రత్యేకంగా మహిళలు, బాలికల కోసం ఉద్ధేశించిన జెండర్‌ బడ్జెట్‌లో గత వైఎస్సార్‌సీపీ ప్రభు­త్వం కంటే కూటమి ప్రభు­త్వం ప్రధాన కేటాయి­ంపులు తగ్గించింది. 
⇒ కూటమి ప్రభుత్వం(2024–25) బడ్జెట్‌లో 100శాతం కేటాయింపులు (పార్ట్‌–ఏ ప్రోగ్రామ్‌)లో రూ.20,935.56­కోట్లు కేటాయించింది. 30 నుంచి 99శాతం లబ్ధి కలిగే పథకాలు (పార్ట్‌–బి ప్రోగామ్‌)లో రూ.58,355.44­కోట్లు కేటాయించి­ంది. మొత్తం రూ.79,291­కోట్లు మాత్రమే కేటాయించింది. 

చిన్నారుల సంక్షేమానికి ఇలా.. 
⇒ ప్రస్తుత కూటమి ప్రభుత్వం చిన్నారుల సంక్షేమానికి మొత్తం రూ.21,910.75కోట్లు కేటా­యించింది. నూరు శాతం పిల్లలకే ఉద్దేశించిన పథకాలు (పార్ట్‌–ఎ)లో రూ.13,793.51­కోట్లు, పార్ట్‌–బిలో రూ.8,117.24కోట్లు మాత్రమే కేటాయించింది.  

ఉచిత బస్‌.. కేటాయింపులు తుస్ 

 ఎన్నికల హామీలను తుంగలో తొక్కే చంద్రబాబు తన ట్రాక్‌ రికార్డ్‌ను మరోసారి కొనసాగిస్తున్నారనే విషయాన్ని టీడీపీ కూటమి సోమవారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వ తొలి బడ్జెట్‌ తేటతెల్లం చేసింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ గురించి కనీసం ప్రస్తావించకపోవడం ద్వారా మరోసారి ప్రజలను సర్కారు వంచించింది. ఆ హామీని ఈ ఏడాదికి అటకెక్కించేసినట్టేనని తేల్చిచెప్పింది.

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణం అంటూ ఊదరగొట్టిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే ఆ హామీపై మౌనవ్రతం పాటిస్తున్నారు. వచ్చే మార్చిలోగా అమలు చేస్తారేమో అనుకుంటే.. ప్రస్తుత బడ్జెట్‌లో ఆ పథకానికి నిధులు కేటాయించలేదు. అధికారంలోకి వచ్చిన  ఐదు నెలల అనంతరం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉచిత ప్రయాణం పథకం ప్రస్తావనే లేకుండా చేశారు.

మహిళలకు ఈ ఏడాది రూ.3,500 కోట్ల నష్టం
ఉచిత బస్‌ ప్రయాణం పథకంపై ప్రభుత్వం దాటవేత వైఖరితో రాష్ట్రంలోని మహిళలు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో రోజుకు 40 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. వారిలో మహిళలు 50 శాతం అంటే 20 లక్షల మంది ఉంటారని అంచనా. కేవలం మహిళల నుంచే టికెట్ల ద్వారా నెలకు రూ.350 కోట్ల రాబడి వస్తోంది. ఈ పథకాన్ని అమలు చేయాలంటే ప్రభుత్వం ప్రతినెలా ఆర్టీసీకి రూ.350 కోట్లు చొప్పున ఏడాదికి రూ.4,200 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది.

బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులు కేటాయించకపోవ­డంతో మహిళలు బస్‌ ప్రయాణం రూపంలో ప్రతి నెలా రూ.350 కోట్లు నష్టపో­తున్నారు. ఆ ప్రకారం ఇప్పటికే రాష్ట్ర మహిళలు రూ.1,750 కోట్లు నష్టపో­యారు. ఏడాది మార్చి వరకు ప్రవేశపెట్టిన ప్రస్తుత బడ్జెట్‌లో ఈ పథకం ప్రస్తా­వనే లేదు. అంటే కనీసం మరో 5 నెలలు మరో రూ.1,750 కోట్లు మహిళలు నష్టపోవడం ఖాయమని తేలిపోయింది. వెరసి 2024–24 ఆర్థిక సంవత్సరంలోనే రాష్ట్ర మహిళలు రూ.3,500 కోట్లను రాష్ట్ర మహిళలు నష్టపోయినట్టే. 
 

Back to Top