ఆదివాసీలకు అండ‌గా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

ప్ర‌భుత్వ ప‌థ‌కాలు గిరిజ‌నుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి

వైయ‌స్ఆర్ సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

తాడేప‌ల్లి: రాష్ట్రంలోని గిరిజనుల అభ్యున్న‌తి కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ అనేక సంక్షేమ, అభివృద్ధి పథ‌కాలు అమలు చేస్తున్నారని వైయస్ఆర్ సీపీ నేత‌లు అన్నారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ సీపీ కేంద్ర కార్యాల‌యంలో ప్రపంచ ఆదివాసీల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్కర్, దివంగ‌త మ‌హానేత‌ వైయస్ రాజశేఖరరెడ్డి, గిరిజన నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ  మాట్లాడుతూ.. ఒక గిరిజన ఎమ్మెల్యేని డిప్యూటీ సీఎం చేసిన ఘనత వైయస్ జగన్‌దని గుర్తుచేశారు. గిరిజనులకు  ఏం కావాలో తెలుసుకొని మ‌రీ అభివృద్ధి పనులు చేపడుతున్నారని వివరించారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 18 సెల్ టవర్లతో అన్ని గ్రామాలకు కమ్యూనికేషన్ వచ్చిందన్నారు. 

కుంబా హరిబాబు మాట్లాడుతూ.. గిరిజనుల‌కు పోడు భూముల ప‌ట్టాలు ఇచ్చిన ఘ‌న‌త నాడు వైయ‌స్ఆర్‌కు, నేడు ఆయ‌న త‌న‌యుడు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కే ద‌క్కింద‌న్నారు. గిరిపుత్రుల పిల్ల‌ల‌కు ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిష్ విద్య‌ను అందిస్తున్నార‌ని చెప్పారు. అడవుల్లో రోగాలతో వందలాదిమంది చనిపోయేవారని, గిరిజ‌నుల క‌ష్టాల‌ను క‌ళ్లారా చూసిన‌ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌.. ఆదివాసీల‌కు వైద్యాన్ని అందుబాటులోకి  తెచ్చారని చెప్పారు.

ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సందర్బంగా గిరిపుత్రులందరికీ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ప్రకృతి మాత ఒడిలో జీవించే ఆదివాసీలు ఎన్నో కష్టనష్టాలకోర్చి జీవిస్తుంటారని తెలియచేశారు. డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ.. భిన్నమైన మన సంస్కృతులు, సంప్రదాయాలను కాపాడుకోవాలని, విద్య ద్వారానే మెరుగైన అవకాశాలు, వైద్యం కోసం మెడికల్ కాలేజీ ఏర్పాటు, ఇంటింటికీ వైద్యం వంటి వాటిని సీఎం వైయస్ జగన్ అందిస్తున్నార‌ని చెప్పారు. రాష్ట్రంలో గిరిజన సంప్రదాయాలు దేశానికి ఆదర్శం అని తెలియజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి వెంకటలక్ష్మి, హనుమంతనాయక్, నవరత్నాల ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ నారాయణమూర్తి, దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్, పార్టీ విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చైతన్య, తదితరులు పాల్గొన్నారు.

Back to Top