టీడీపీ నేత‌ల తీరుపై మండ‌లిలో మ‌హిళా ఎమ్మెల్సీల ఆవేద‌న 

అమ‌రావ‌తి: శాసనమండలిలో టీడీపీ సభ్యులు మహిళలను ఆత్మాభిమానాన్ని కించపరిచే విధంగా వ్యవహరించారు. టీడీపీ ఎమ్మెల్సీలు సభలోకి తాళిబొట్లు తీసుకుని వచ్చి ప్రదర్శన చేశారు. దీంతో మా ఆత్మాభిమానాన్ని అవమాన పరిచారంటూ వైఎస్సార్‌సీపీ మహిళా సభ్యులు పోతుల సునీత, వరుదు కళ్యాణి, కల్పలతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యడు దీపక్ రెడ్డి చేతిలో నుంచి పోతుల సునీత తాళిబొట్లు లాక్కున్నారు. ఆ సమయంలో సభలో గందరగోళం నెలకొంది. దీంతో మండలి ఛైర్మన్‌ మోషేన్‌రాజు సభని కొద్దిసేపు వాయిదా వేసి, మళ్లీ ప్రారంభించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top