సీఎంను క‌లిసిన ఏషియన్‌ పవర్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ విన్నర్‌ 

షేక్‌ సాదియాకు ప్ర‌భుత్వం త‌ర‌ఫున రూ.5 ల‌క్ష‌ల సాయం

మంగ‌ళ‌గిరిలో పవర్‌ లిఫ్టింగ్‌ అకాడమీ ఏర్పాటుకు అంగీకారం

శాస‌న‌స‌భ‌: అసెంబ్లీలో ముఖ్యమంత్రి కార్యాల‌యంలో సీఎం వైయ‌స్‌ జగన్‌ను ఏషియన్‌ పవర్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ విన్నర్‌ షేక్‌ సాదియా అల్మస్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన షేక్‌ సాదియా అల్మస్‌.. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో 2021 డిసెంబర్‌లో జరిగిన ఏషియన్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్ షిప్‌లో 3 స్వర్ణ పతకాలు, 1 రజత పతకం సాధించారు. షేక్‌ సాదియాకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున రూ. 5 లక్షల ఆర్ధిక సాయాన్ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. అంతేకాకుండా మంగళగిరిలో పవర్‌ లిఫ్టింగ్‌ అకాడమీ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున‌ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పర్యాటక, క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల‌ రామకృష్ణారెడ్డి, స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, షేక్‌ సాదియా తండ్రి సంధాని, రోటరీ క్లబ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. 

Back to Top